Lavanya Tripathi: మెగా కోడలితో సుడిగాలి సుధీర్‌కు బంపర్ ఆఫర్... అరెరె ఎంత పని చేశావయ్యా?

జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. కమెడియన్ నుంచి హీరోగా మారిపోయిన సుదీర్.. వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఆయన మెగా కోడలు లావణ్య త్రిపాఠితో నటించే అవకాశం రాగా.. ఆ ఛాన్స్ ను మిస్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న సుడిగాలి సుధీర్ ఫ్యాన్స్.. అరెరె ఎంత పని చేశావయ్యా అంటూ కామంట్స్ పెడుతున్నారు. అసలు అది ఏ సినిమా.. ఎందుకు మిస్ చేసుకున్నారు అనే వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.

సుడిగాలి సుధీర్.. జబర్దస్త్ లో కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చి... హీరోగా మారాడు. హీరోగా మారిన తర్వాత ఫుల్ బీజీగా మారిన సుధీర్ కు సరైన హిట్ పడటం లేదు. సినిమాలు చేస్తూ పోతున్నాడు తప్ప.. సాలిడ్ అయితే రావడం లేదని ఫ్యాన్స్ కూడా నిరాశ పడుతుంది. అయితే లావణ్య త్రిపాఠితో కలిసి నటించే అవకాశాన్ని హీరో సుడిగాలి సుధీర్ మిస్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Jabardasth Sudheer Sudheer missed Role in Lavanya Tripathis Miss Perfect movie News Goes Viral

మెగా కోడలు లావణ్య త్రిపాఠి.. ప్రస్తుతం వరుణ్ తేజ్ తో ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తుంది. ఒక పక్క సినిమాలు మరొక పక్క సిరీసులతో బిజీ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల లావణ్య త్రిపాఠి నటించిన వెబ్ సిరీస్ మిస్ ఫర్ ఫెక్ట్. ఈ సిరీస్ డిస్ని ప్లస్ హాట్ స్టార్ వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది. ఓటీటీలో ఈ సిరీసుకు మంచి రెస్పాన్స్ వస్తుంది.

మిస్ ఫర్ ఫెక్ట్ సిరీస్ లో లావణ్య త్రిపాఠి ఒసీడీ గల అమ్మాయిగా కనినిపించి మెప్పించింది. ఇక ఈ సిరీసుకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ సిరీస్ చూసిన ప్రతి ఒక్కరు లావణ్య త్రిపాఠిపై ప్రసంశలు కురిపిస్తున్నారు. అయితే ఈ సిరీస్ కు సంబంధించిన మరోక ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది. అయితే ఈ సిరీస్ సంవత్సరం ముందే కమిట్ అయినట్లు సమాచారం.

Jabardasth Sudheer Sudheer missed Role in Lavanya Tripathis Miss Perfect movie News Goes Viral

అయితే ఈ సిరీసులో బిగ్ బాస్ విన్నర్ అభిజిత్ కీలక పాత్రలో నటించాడు. అయితే మొదటగా అభిజిత్ స్థానంలో సుడిగాలి సుధీర్ ని అనుకున్నారట చిత్ర యూనిట్. సుడిగాలి సుదీర్ అప్పుడు బాగా ఫేమస్ కావడం... అప్పట్లోనే లావణ్య త్రిపాఠి, వరుణ్ మధ్య ప్రేమాయణం ఉందంటూ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అంతేకాదు దాని గురించి ఎంక్వయిరీ చేసిన సుధీర్ అది రియల్ అని తెలియడంతో ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారని టాక్. నాగబాబునే సుధీర్ కి లైఫ్ ఇచ్చారనే విషయం తెలిసిందే. మరి అలాంటి ఇంటి కోడలితో ఆయన నటించడం సమంజసం కాదు అనుకున్న సుధీర్ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ న్యూస్ లో ఎంత నిజం ఉందో తెలియదు కానీ.. నెట్టింట వైరల్ గా మారింది. ప్రస్తుతం సుధీర్ గోట్ అనే సినిమాలో నటిస్తున్నాడు. అది రిలీజ్ కు సిద్ధంగా ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X