Sudigali Sudheer : అమ్మాయి ట్రాప్‌లో సుడిగాలి సుధీర్ .. బుల్లితెర స్టార్‌ను ముంచేసిందిగా

దాదాపు 13 ఏళ్లుగా తెలుగువారిని నవ్వుల్లో ముంచెత్తుతోంది జబర్దస్త్.. ఈటీవీని, మల్లెమాల బ్యానర్‌ను నిలబెట్టిన షోగా ఇది గుర్తింపు తెచ్చుకుంది. జబర్దస్త్ ద్వారా ఎంతోమంది ప్రతిభావంతులు తమ టాలెంట్ నిరూపించుకుని సినిమాలు , సీరియల్స్‌లో అవకాశాలు దక్కించుకోవడమే కాదు ఏకంగా హీరోలైన వాళ్లు కూడా ఉన్నారు. ఇలాంటి వారిలో సుడిగాలి సుధీర్ కూడా ఒకరు. చిన్నా చితకా మేజిక్ షోలు చేసుకునే స్థాయి నుంచి హీరో రేంజ్‌కి ఎదిగాడు సుధీర్.

విజయవాడకు చెందిన సుడిగాలి సుధీర్.. మెజీషియన్‌గా కెరీర్ ఆరంభించి పలు ఛానెళ్లలో స్పెషల్ షోలు చేస్తూ బుల్లితెరపై నిలదొక్కుకున్నాడు. సరిగ్గా అదే సమయంలో జబర్దస్త్ కార్యక్రమం మొదలుకావడంతో ఇందులో అడుగుపెట్టాడు. తక్కువ సమయంలోనే తన టాలెంట్‌ను నిరూపించుకున్న సుధీర్‌కు నిర్వాహకులు టీమ్ లీడర్‌గా ప్రమోషన్ కల్పించారు. రామ్ ప్రసాద్, గెటప్ శ్రీనులతో కలిసి వందల స్కిట్‌లు చేసి ప్రేక్షకులను నవ్వించాడు.

Jabardasth - Sudigaali Sudheer s old skit goes viral

జబర్దస్త్ యాంకర్ రష్మి గౌతమ్‌తో లవ్ ట్రాక్ నడుతున్నట్లుగా గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. ఇది కేవలం షోలో భాగమేనని.. తమ మధ్య అలాంటిదేమీ లేదని వీరిద్దరూ పలుమార్లు క్లారిటీ ఇచ్చారు. అయినప్పటికీ ఈ న్యూస్‌కి మాత్రం చెక్ పడటం లేదు. రష్మి - సుధీర్ పెళ్లి చేసుకుంటారా? అసలు ఇంతకీ వీరి మధ్య ప్రేమాయణం నిజమేనా? అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తూనే ఉన్నారు. వీరిద్దరూ పెళ్లి చేసుకోకుండా ఇంకా బ్యాచిలర్‌గానే ఉండటం అనేక అనుమానాలకు తావిస్తోంది.

టీవీ షోలతో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న సుడిగాలి సుధీర్ హీరోగా ఎంట్రీ షాకిచ్చాడు. సాఫ్ట్‌వేర్ సుధీర్, గాలోడు, వాంటెడ్ పండుగాడ్, కాలింగ్ సహస్ర వంటి సినిమాలు చేశాడు. ఇతని క్రేజ్ కారణంగా ఆయా సినిమాలకు మంచి లాభాలు వచ్చాయి. సినిమాలతో పాటు షోలతోనూ బిజీగా ఉన్న సుడిగాలి సుధీర్.. ఆహా ఓటీలో కామెడీ ఎక్స్‌ఛేంజ్, సర్కార్ 4కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు.

Jabardasth - Sudigaali Sudheer s old skit goes viral

సుడిగాలి సుధీర్ స్కిట్‌లు ఇప్పటికీ షార్ట్స్ రూపంలో చక్కర్లు కొడుతూ ప్రేక్షకులను నవ్విస్తూనే ఉన్నాయి. తాజా గతంలో చేసిన ఓ స్కిట్ వైరల్ అవుతోంది. ఆటో రామ్ ప్రసాద్ ఆడవేషంలో , గెటప్ శ్రీను ఆమె భర్త గెటప్‌లో ఉండగా సుడిగాలి సుధీర్ అద్దె ఇంటి కోసం వస్తాడు. ఇంతలో సుధీర్ వచ్చి రెంట్ ఎంత అని అడగ్గా 5 వేలు అని గెటప్ శ్రీను చెబుతాడు. చాలా చీప్ అని రామ్ ప్రసాద్‌ను తీసుకెళ్తాడు సుడిగాలి సుధీర్. రెంట్ 5 వేలు , రెండు నెలలు అడ్వాన్స్ ఇవ్వాలని గెటప్ శ్రీను చెప్పగా.. రెంట్ కింద పది వేలు, నాలుగు నెలలు అడ్వాన్స్ తీసుకోమంటాడు సుధీర్. తర్వాత ఇంటిలో రూల్స్ చెబుతాడు గెటప్ శ్రీను.

అమ్మాయి వీక్‌నెస్ ఉండటంతో గెటప్ శ్రీను ఎంత చెబితే దానికి డబుల్ ఇచ్చేస్తాడు సుధీర్. ఇంతలో సుధీర్ బండారం తెలుసుకున్న గెటప్ శ్రీను, రామ్ ప్రసాద్ కలిసి అతనిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంటారు. లేడీ గెటప్‌లో ఉన్న రామ్ ప్రసాద్ ముందు శ్రీనును తలపై కొడతాడు. ఇక పిల్లా నాదే, ఇల్లు నాదే అని హ్యాపీ అవుతుండగా సుధీర్ తలపై కొడతాడు రామ్ ప్రసాద్. చివరిలో సుధీర్, శ్రీను కలిసి రామ్ ప్రసాద్‌ను కొట్టడంతో స్కిట్ ముగుస్తుంది. కడుపుబ్బా నవ్విస్తోన్న ఈ స్కిట్‌ను మీరూ చూసి ఎంజాయ్ చేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X