Jabardasth: జబర్దస్త్ కమెడియన్ హీరోగా మరో సినిమా ... రిలీజ్ ఎప్పుడంటే?

బుల్లితెర ప్రెక్షకులకు సుడిగాలి సుధీర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. జబర్దస్త లాంటి కార్యక్రమాలతో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న సుదీర్... సిల్వర్ స్క్రీన్ పై కూడా సినిమాలు చేస్తూ.. హంగామా చేస్తున్నాడు. ఇక ఆయన హీరోగా ఇప్పటికే పలు సినిమాలు రిలీజ్ చేశాడు. ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆ సినిమా ఏంటి... ఎప్పుడు రిలీజ్ కానుందనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

సుడిగాలి సుధీర్ కు ఉన్న క్రేజ్ వేరే లెవెల్ అని చెప్పవచ్చు. ఆయన జబర్దస్త్ కార్యక్రమంలో కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చి.. టీం మెంబర్ గా మారాడు. ఆ తర్వాత యాంకర్ రష్మతో క్లోజ్ గా మూవ్ అయి.. వీరి మధ్య ఏదో ఉందంటూ జనాలకు హైప్ ను ఇచ్చాడు. ఇక ఈ విషయంపై రష్మి, సుధీర్ కూడా.. మేం స్నేహితులం అంటూ చెప్పుకువచ్చారు. ఇక జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ తదితర షోల్లో కనిపిస్తూ.. బుల్లితెరపై ప్రేక్షకులను అలరించాడు సుదీర్.

 Jabardasth Sudigali Sudheer Calling Sahasra Movie Completed Post Production and Release Date Details Here

బుల్లితెర నుంచి వెండితెరపైకి వెళ్లిన సుధీర్.. కమెడియన్ గా కొన్ని సినిమాల్లో నటించి అలరించాడు. ఇక ఆ తర్వాత ఆయనే హీరోగా మారి సినిమాలు చేస్తూ వచ్చాడు. సిల్వ‌ర్ స్క్రీన్‌పై కూడా ఆడియెన్స్‌ని మెప్పిస్తున్నారు సుధీర్. ఇటీవల సుధీర్ హీరోగా తెరకెక్కిన 'గాలోడు' చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్టుగా నిలిచింది. ఇక ఈ సినిమా తర్వాత ఆయన మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

 Jabardasth Sudigali Sudheer Calling Sahasra Movie Completed Post Production and Release Date Details Here

సుధీర్ హీరోగా నటించిన తాజా చిత్రం 'కాలింగ్ సహస్త్ర'. ఇక ఈ చిత్రానికి అరుణ్ విక్కిరాలా ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నాడు. సుధీర్ సరసన ఈ చిత్రంలో డాలీషా హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఆనంద్ బయానా, శివబాలాజీ మనోహరన్, రవితేజ నన్నిమాల త‌దిత‌రులు ఈ చిత్రంల్లో కీలక పాత్రలు పోషించారు. మార్క్ కె రాబిన్ ఈ సినిమాకు సంగీతం అందించారు. ఇక ఈ సినిమాను షాడో మీడియా ప్రొడక్ష‌న్స్‌, రాధా ఆర్ట్స్ ప‌తాకాల‌పై విజేష్ త‌యాల్‌, చిరంజీవి ప‌మిడి, వెంక‌టేశ్వ‌ర్లు కాటూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

 Jabardasth Sudigali Sudheer Calling Sahasra Movie Completed Post Production and Release Date Details Here

ఇక బుల్లితెరపై నవ్వించిన సుధీర్.. గాలోడు సినిమాతో మాస్ హీరోగా ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేశాడు. అయితే ఈసారి మ‌రో డిఫ‌రెంట్ అటెంప్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా కాలింగ్ సహాస్త్ర సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుంది. ఈ సంద‌ర్బంగా చిత్ర దర్శక నిర్మాతలు ప్రెస్ మీట్ పెట్టారు. ఈ కార్యక్రమంలో వారు సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చెప్పుకు వచ్చారు.

 Jabardasth Sudigali Sudheer Calling Sahasra Movie Completed Post Production and Release Date Details Here

కాలింగ్ సహాస్త్ర చిత్ర నిర్మాత మాట్లాడుతూ... నిర్మాతలుగా 'కాలింగ్ సహస్త్ర' మా తొలి అడుగు అని చెప్పుకువచ్చారు. మాకు ఇదొక స్వీట్ మెమొరీ. డైరెక్టర్ అరుణ్‌గారు, హీరో సుధీర్‌గారు, హీరోయిణ్ డాలీషా గారి స‌పోర్ట్‌తో సినిమాను పూర్తి చేశామని వెల్లడించారు. ఔట్ పుట్ సూప‌ర్‌గా వ‌చ్చిందని తెలిపారు. స‌రికొత్త సుధీర్‌ను చూస్తార‌ని న‌మ్మ‌కంగా చెబుతున్నానని చెప్పారు. ఇందులో సుధీర్ పాత్ర‌ వైల్డ్‌గా, థ్రిల్లింగ్ ఎలిమెంట్‌తో, మాసీగా ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. ప్రేక్ష‌కులు ఊహించ‌ని మ‌లుపులతో సీట్ ఎడ్జ్ థ్రిల్ల‌ర్‌గా ఆక‌ట్టుకోనుంది మా కాలింగ్ స‌హ‌స్త్ర మూవీ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. పోస్ట్ ప్రొడక్ష‌న్ కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి.... న‌వంబ‌ర్‌లో సినిమాను విడుద‌ల చేయ‌టానికి స‌న్నాహాలు చేస్తున్నామని వివరించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X