Sudigali Sudheer: ఆమెతో 14 ఏళ్ల రిలేషన్.. ఆ విషయం తట్టుకోలేక నడిరోడ్డుపై అలా..

బుల్లితెర నుంచి వెండితెర వరకు తనదైన స్టైల్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer). మొదట స్టేజ్‌లపై మెజీషియన్‌గా తన ప్రయాణాన్ని ప్రారంభించిన ఆయన, తర్వాత కామెడీ ప్రపంచంలో అడుగుపెట్టి క్రమంగా స్టార్‌డమ్‌ను అందుకున్నారు. ముఖ్యంగా జబర్దస్త్ ఆయన కెరీర్‌ను పూర్తిగా మార్చేసిన షోగా నిలిచింది. ఈ షో ద్వారానే 'సుడిగాలి' అనే బ్రాండ్ ఆయనకు దక్కింది. జబర్దస్త్‌లో తన ప్రత్యేకమైన కామెడీ టైమింగ్, ఎనర్జీ, ఎక్స్‌ప్రెషన్స్‌తో సుధీర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కేవలం కమెడియన్‌గా మాత్రమే కాకుండా, ఆ షోలో యాంకర్ రష్మీ గౌతమ్ తో నడిచిన లవ్‌ట్రాక్ ఆయనకు మరింత క్రేజ్ తెచ్చింది.

సుధీర్ తన టాలెంట్‌తో ఎక్స్‌ట్రా జబర్దస్త్, ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి పాపులర్ షోలలో తన సత్తా చాటుతూ, సింగర్, డాన్సర్, యాంకర్‌గా గుర్తింపు పొందాడు. ఇలా ఒక్కో రంగంలో తన ప్రతిభను నిరూపించుకుంటూ, ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించాడు. క్రమంగా వచ్చిన ఈ క్రేజ్, ఆయనను వెండితెర వైపు తీసుకెళ్లింది. చిన్న పాత్రలతో మొదలైన సినీ ప్రయాణం, తర్వాత హీరోగా అవకాశాలు దక్కే స్థాయికి చేరడం ఆయన కృషికి నిదర్శనం. బుల్లితెరపై సంపాదించిన అభిమానాన్ని, అదే స్థాయిలో సినిమాల్లోకి తీసుకెళ్లాలని ఆయన ప్రయత్నం కొనసాగుతోంది. తాజాగా ఓ షోలో తన బ్రేకప్ సోర్టీ చెబుతూ ఎమోషనల్ అయ్యారు. ఇంతకీ ఏమైందంటే?

Jabardasth Sudigali Sudheer Opens Up on 14-Year Love Breakup Gets Emotional on Sarkaar 6

బుల్లితెరపై స్టార్‌గా ఎదిగిన సుధీర్, తరువాత పలు షోలకు హోస్ట్‌గా అవకాశాలు అందుకున్నారు. తాజాగా సర్కార్ సీజన్ 6 (Sarkaar Season 6)కి ఆయన హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహా (Aha)లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ షో, ప్రేక్షకుల్లో మంచి ఆదరణ పొందుతోంది. తాజాగా ప్రసారమైన ఎపిసోడ్‌లో 'పాపం ప్రతాప్' సినిమా టీమ్ సందడి చేయగా, అదే వేదికగా సుధీర్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఒక ఎమోషనల్ అంశాన్ని బయటపెట్టాడు.

ఈ షోలో సుధీర్ మాట్లాడుతూ.. తన తొలి ప్రేమ కథను గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యాడు. తనకు ఒక అమ్మాయితో దాదాపు 14 సంవత్సరాల పాటు రిలేషన్‌షిప్ ఉన్నట్టు వెల్లడించాడు. అయితే ఆ రిలేషన్ అనూహ్యంగా ముగిసిపోయిందని చెప్పాడు. ఆ అమ్మాయి చివరకు మరో వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోవడంతో తన జీవితం ఒక్కసారిగా మారిపోయిందని వివరించాడు.

బ్రేకప్ రోజు.. నెక్లెస్ రోడ్‌పై కన్నీటి కధ
సుధీర్ తన బ్రేకప్ జరిగిన రోజు గురించి చెబుతూ మరింత ఎమోషనల్ అయ్యాడు. '14 ఏళ్ల పాటు కలిసి ఉన్నాం. ఒకరోజు ఆమె వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని చెప్పింది. 'ఇప్పుడు నేను హ్యాపీగా ఉన్నా... నన్ను డిస్ట్రబ్ చేయకు' అని చెప్పింది. ఆ మాటలు విన్న తర్వాత నేను పూర్తిగా బ్రేక్ అయ్యా' అని తెలిపారు. అంతేకాకుండా, ఆ రోజు తాను హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్ వద్ద ఒంటరిగా పరిగెత్తుతూ, అరుస్తూ, తన బాధను బయటపెట్టుకున్నానని చెప్పాడు. ఆ పరిస్థితిలో తనకు ఏమి జరుగుతుందో కూడా అర్థం కాలేదని చెప్పిన సుధీర్, ఆ సంఘటన తన జీవితంలో అత్యంత బాధాకరమైన క్షణంగా మిగిలిపోయిందని వెల్లడించాడు.

సుధీర్ ఇలా తన మనసులోని బాధను బయటపెడుతుండగా, పక్కనే ఉన్న కో-హోస్ట్ విష్ణుప్రియ ఆయనను హగ్ చేసుకుని ఓదార్చడం ఆ ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఈ సీన్ చూసిన ప్రేక్షకులు కూడా భావోద్వేగానికి గురయ్యారు. సోషల్ మీడియాలో ఈ క్లిప్ వైరల్ అవుతూ, సుధీర్‌కు అభిమానులు మద్దతుగా కామెంట్లు చేస్తున్నారు. అయితే.. ఇప్పటివరకు సోషల్ మీడియాలో సుధీర్ పెళ్లి, రిలేషన్‌షిప్‌లపై వచ్చిన వార్తలకు ఇది ఒక స్పష్టతనిచ్చినట్లైంది. ముఖ్యంగా రష్మీతో ఆయన ప్రేమలో ఉన్నారనే ప్రచారం ఎక్కువగా నడిచినప్పటికీ, అది కేవలం షో కోసం మాత్రమే అని వారు పలుమార్లు స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X