ఆ నలుగురితో సుడిగాలి సుధీర్ రొమాన్స్... నోరు మూయించిన హీరోయిన్
సుడిగాలి సుధీర్ హోస్ట్ గా చేస్తున్న తెలుగు గేమ్ షో సర్కార్-4. ఆహలో స్ట్రీమింగ్ అవుతున్న గేమ్ షోలో 4వ సీజన్ 3 వ ఎపిసోడ్ టెలికాస్ట్ కు రెడీగా ఉంది. తాజాగా రిలీజ్ అయిన ఈ తాజా ఎపిసోడ్ కు సంబంధించిన విశేషాలపై మనం కూడా ఓ లుక్కేద్దాం.
గత మూడు సీజన్స్ సక్సెస్ ఫుల్ గా రన్ అవ్వడంతో 4వ సీజన్ లోని ఒక్కో ఎపిసోడ్ గురించి ఓటిటి ప్రియులు ఎగ్జైటింగ్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే ఆ మూడు సీజన్లకు మరో పాపులర్ తెలుగు హోస్ట్ ప్రదీప్ మాచిరాజు హోస్ట్ గా చేశారు. కానీ సీజన్ 4కు మాత్రం హోస్ట్ గా సుధీర్ ఎంట్రీ ఇచ్చాడు.

మే 3న సర్కార్-4 3 వ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుండగా తాజాగా దానికి సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేసి క్యూరియాసిటీని పెంచేశారు ఆహా వారు. అందులో నలుగురు తెలుగు హీరోయిన్లు గెస్టులుగా రావడం విశేషం. ఆ నలుగురికి రోజ్ ఫ్లవర్ ఇచ్చి సుడిగాలి సుధీర్ ప్రపోజ్ చేయడం, వాళ్లను పొగుడుతూ ఆయన చెప్పిన డైలాగులు ప్రోమోలో ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి.
హీరోయిన్లు అనన్య నాగళ్ళ, గౌరీ ప్రియ, శివాని, మానస చౌదరికి షోకు గెస్టులుగా హాజరయ్యారు. ముందుగా గౌరీ ప్రియను ఆహ్వానించిన సుడిగాలి సుధీర్ మీరు మిస్ హైదరాబాద్ కదా అని అడిగాడు. ఆమె అవును అని సమాధానం చెప్పగానే నేను ఎలా మిస్ అయ్యాను అంటూ పంచ్ వేశాడు. ఆ తర్వాత అనన్య నాగళ్లకు లవ్ లెటర్ ఇచ్చి ప్రపంచం అంతా వెతికా అంత కంటే గొప్ప పేరు కనిపించలేదు అంటూ తనదైన శైలిలో ఆమెపై పొర్తల వర్షం కురిపించాడు.

ఇక మూడో హీరోయిన్ శివాని ఎంట్రీ ఇవ్వగానే మీరు బరువు పెరగనని మాట ఇవ్వండి.. జీవితాంతం మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని ఆ బరువు మొయ్యాల్సింది నేనే కదా అంటూ రొమాంటిక్ గా రిప్లై ఇచ్చాడు.
ఇక చివరిగా బాబుల్ గమ్ మూవీ హీరోయిన్ మానస చౌదరి ఎంట్రీ ఇచ్చి సుధీర్ కి రివర్స్ పంచులు వేసి నవ్వించింది. ముందుగా మీ ఇంటి పేరు ఏంటండీ అని మానసను అడిగాడు సుధీర్. ఆమె చెరుకూరి అనగానే అందుకేనా అంత స్వీట్ గా ఉన్నారు అంటూ కామెంట్ చేశాడు.

అయితే మానస కూడా మీ ఇంటి పేరేంటి అని అడిగితే సుధీర్ బయానా అని చెప్పాడు. అందుకేనా అంత భయపెడుతున్నారు అంటూ పంచ్ వేసింది మానస. ఇక ఈ ప్రోమోలో మరో ఇంటరెస్టింగ్ విషయం ఏమిటంటే బీర్ గురించి చర్చ రావడం.
ఓ బీర్ బాటిల్ లో ఎంత బీరు ఉంటుంది అని సుధీర్ ప్రశ్నించగా, మానస చౌదరి పుల్లా, హాఫా అంటూ పంచ్ వేసి అందరిని నవ్వించింది. సరదా సరదాగా నలుగురు హీరోయిన్లతో సుధీర్ ఆడిన ఈ గేమ్ షో మే 3న రాత్రి 8 గంటలకు ఆహా ఓటీటీలో రాబోతోంది.


Click it and Unblock the Notifications











