twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాన్నకు యాక్సిడెంట్, 17 ఏళ్ల వయసులోనే కష్టాలు... సుడిగాలి సుధీర్ రియల్ లైఫ్ స్టోరీ!

    |

    జబర్దస్త్ కామెడీ షో ద్వారా అందరికీ పరిచయం అయిన సుడిగాలి సుధీర్... తన స్కిట్లతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇపుడు పెద్ద పెద్ద షోలకు యాంకరింగ్ చేస్తూ మంచి పొజిషన్‌కు వచ్చాడు. అయితే సుధీర్ ఈ స్థాయికి రావడం వెనక ఎంత కష్టపడ్డాడు? అతడి జర్నీ ఎక్కడ మొదలైంది? అనే విషయాలు చాలా మందికి తెలియదు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సుధీర్ ఈ విషయాలు వెల్లడించారు. 16 ఏళ్ల వయసులో సినిమాల్లో ట్రై చేద్దామని హైదరాబాద్ వచ్చాను. కానీకుదరలేదు. వాళ్లు డబ్బులు అడిగితే ఇవ్వడానికి నా వద్ద ఏమీ లేవు. సపోర్ట్ కూడా లేదు. ఏం చేయాలో తెలియక ఇంటికి వచ్చానని తెలిపారు.

    డాడీకి యాక్సిడెంట్, పెద్ద కొడుకుగా రెస్పాన్సిబిలిటీ

    డాడీకి యాక్సిడెంట్, పెద్ద కొడుకుగా రెస్పాన్సిబిలిటీ

    ఇంటర్ మధ్యలో గ్యాప్ వచ్చింది. మళ్లీ ఎగ్జామ్స్ రాయడానికి సంవత్సరం వెయిట్ చేయాలి. ఈ లోపు ఏదో ఒకటి చేద్దామనుకునే లోపు మా నాన్నకు యాక్సిడెంట్ అయింది. కాలుకు ఫ్చాక్చర్ అయింది. రాడ్ వేశారు. ఆయన షుగర్ పేషెంట్ కావడంతో మా అందరిలో భయం. నేను 17 ఏళ్ల పిల్లోడిని. డాడీ ఆరు నెలలు బెడ్ మీద ఉన్నారు. ఏదైనా చేయాలన్నా ఎవరికీ ఏమీ రాదు. అపుడు నేను పెద్ద కొడుకుగా రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాను.

     నన్ను పంపిస్తూ డాడీ ఏడ్చారు

    నన్ను పంపిస్తూ డాడీ ఏడ్చారు

    మా డాడీ కూడా నన్ను హైదరాబాద్ పంపించేపుడు ఏడ్చేశారు. ఈ వయసులో నీకు ఏదైనా చేయడానికి తండ్రి హెల్ప్ ఉండాలి. కానీ నువ్వు తండ్రి లాగా నా రెస్పాన్సిబిలిటీ తీసుకున్నావు అని బాధ పడ్డారు.

    రామోజీ ఫిల్మ్ సిటీలో రూ. 8 వేలతో మొదలు

    రామోజీ ఫిల్మ్ సిటీలో రూ. 8 వేలతో మొదలు

    ఇంటి నుంచి వచ్చి రామోజీ ఫిల్మ్ సిటీలో రెండు సంవత్సరాలు జాబ్ చేశాను. నేను అక్కడ మెజీషినయ్ గా పని చేసేవాడిని. 5వ తరగతి నుంచే నేను మామయ్య దగ్గర మ్యాజిక్ నేర్చుకోవడం మొదలు పెట్టాను. అది ఎంతో హెల్ప్ అయింది. రూ. 8 వేల జీతంతో ఫిల్మ్ సిటీలో నా జీవితం మొదలైంది. రూ. 500 ఉంచుకుని మిగతా డబ్బు ఇంటికి పంపేవాడిని. అక్కడే ఫుడ్, బెడ్... ఖర్చు కూడా ఏమీ ఉండేది కాదు. ఎప్పుడైనా డాడీ వాళ్లతో మాట్లాడటానికి, ఇంటర్నెట్ కు మాత్రమే డబ్బులు ఖర్చయ్యేవి.

    ఒక్క రోజు కూడా సెలవు ఉండేది కాదు

    ఒక్క రోజు కూడా సెలవు ఉండేది కాదు

    రెండు సంవత్సరాలు బానే ఉంది కానీ ఎప్పుడూ పేరెంట్స్ ను వదిలి ఉండలేదు. అక్కడ ప్రతి రోజూ జాబ్ చేయాలి. ఒక్క రోజు కూడా వీకాఫ్ ఉండదు. రామోజీ ఫిల్మ్ సిటీ 365 రోజులు ఓపెన్ ఉంటుంది. జనాలు వస్తుంటారు.. పోతూ ఉంటారు. ఆదివారం కూడా సెలవు ఉండదు. రెండు సంవత్సరాలు పేరెంట్స్ ను వదిలేసి కష్టపడ్డాను. నాకు ఫిల్మ్ సిటీనే లోకం అయిపోయింది. రెండేళ్ల తర్వాత నా సాలరీ 30 వేలు అయింది. నాకు అదే లైఫ్ అయిపోయింది. దానికి మించి చూడలేక పోతున్నాను అనే ఫీలింగ్ ఎక్కువైంది.

    జాబ్ మానేశాక చాలా కష్టపడ్డాను

    జాబ్ మానేశాక చాలా కష్టపడ్డాను

    డబ్బులు వస్తున్నాయి కానీ సూపరేం కాదు. ఇంట్లో వాళ్లు తినడానికి, ఇతర ఖర్చులకు, నాకు సరిపోతున్నాయి. సేవింగ్స్ అయితే ఉండటం లేదు. ఇక్కడి నుంచి బయటకు వచ్చి సొంతగా మ్యాజిక్ షోలు మొదలు పెడదామనుకున్నాను. జాబ్ మనేసిన తర్వాత విపరీతంగా కష్టపడ్డాను. రెండు మూడేళ్లు నా కష్టాలు ఎవరితో చెప్పుకోలేనంత భీభత్సంగా ఉండేవి.

    సింకులో నీళ్లు తాగేవాడిని, ఏడుపొచ్చేది

    సింకులో నీళ్లు తాగేవాడిని, ఏడుపొచ్చేది

    ఎస్ఆర్ నగర్లో ఫ్రెండ్స్ తో ఉండే వాడిని. అక్కడ ఓ మెజీషియన్ దగ్గర చేసేవాడిని. ఒక్కోసారి ప్రోగ్రామ్స్ ఉండేవి, ఒక్కో నెల ఉండేవి కావు. కొన్ని సార్లు వాటర్ బబుల్ కొనుక్కోవడానికి డబ్బుల్లేక సింక్ లో వచ్చే నీళ్లు తాగే వాడిని. ప్రియా పికిల్స్ ప్యాకెట్ తెచ్చుకుని పచ్చడి తినేవాడిని. చిన్నప్పటి నుంచి నేను అలా పెరగలేదు కాబట్టి కష్టం అనిపించింది. ఒక్కోసారి ఏడుపొచ్చేది.

     ఇపుడు నా జీవితం మారింది

    ఇపుడు నా జీవితం మారింది

    అలాంటి కష్టాలు పడ్డ తర్వాత షోలు పెరగడం, యాంకరింగ్ మొదలు పెట్టడం, ఈవెంట్స్ చేయడం ఆ తర్వాత నుంచి లైఫ్ మారిపోయింది. గత రెండు సంవత్సరాల నుంచి అయితే నా జీవితం సూపర్ గా ఉంది. ఫైనల్ గా దేవుడు బ్లెస్ చేసి సక్సెస్ ఇచ్చాడు. జబర్దస్త్‌లో చేయడం వల్ల సినిమా వాళ్ల పిలిచి అవకాశాలు ఇస్తున్నారు.... అని సుడిగాలి సుధీర్ తెలిపారు.

    English summary
    Jabardasth Sudigali Sudheer recently shared his Real Life struggles in a interview. Sudigali Sudheer is a Telugu language actor and a stand-up comedian, who is known for his performance in the Telugu-language television channel comedy shows Jabardasth and Extra Jabardasth, which are judged by actor Nagendra Babu and actress Roja.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X