Jabardasth సుడిగాలి సుధీర్ టీమ్.. వారి ముగ్గురి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

జబర్దస్త్ ద్వారా గుర్తింపును అందుకున్న చాలామంది కమీడియన్స్ ఆర్థికంగా నిలదొక్కుకున్నవారే అని చెప్పాలి. ఇండస్ట్రీలో కమెడియన్స్ గా కూడా గుర్తింపు అందుకోలేని వారు కూడా జబర్దస్త్ లోకి వచ్చిన తర్వాత మాత్రం జనంలో మంచి స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇక జబర్దస్త్ ద్వారా భారీ స్థాయిలో ఆదాయాన్ని అందుకున్న వారిలో సుడిగాలి సుదీర్ టీం టాప్ లిస్ట్ లో ఉంటుంది. సుడిగాలి సుధీర్ గెటప్ శ్రీను ఆటో రామ్ ప్రసాద్ ఈ ముగ్గురూ కూడా చాలా మంచి టైమింగ్ తో జబర్దస్త్ లో కొనసాగారు. అయితే వీరు జబర్దస్త్ లో ఉండగా.. రెమ్యునరేషన్ ఏ స్థాయిలో ఉండేది అనే వివరాల్లోకి వెళితే..

జబర్దస్త్ తోనే మంచి ఆదాయం

జబర్దస్త్ తోనే మంచి ఆదాయం

నిజం చెప్పాలి అంటే జబర్దస్త్ ద్వారా చాలా మంది కొత్త తరహా కమెడియన్స్ కు అవకాశాలు వచ్చాయి. జబర్దస్త్ నుంచి సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకున్న వారు కూడా చాలామంది ఉన్నారు. తినడానికి చాలా కష్టపడుతున్న తరుణంలో జబర్దస్త్ ద్వారా మంచి ఆదాయాన్ని అందుకని ఇప్పుడు సొంతంగా ఇల్లు కట్టుకున్న వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. జబర్దస్త్ లో సీనియర్ కమెడియన్స్ అందరు కూడా సినిమాల కంటే జబర్దస్త్ తోనే ఎక్కువ ఆదాయాన్ని సంపాదించుకున్నారు.

 అలా జబర్దస్త్ లోకి

అలా జబర్దస్త్ లోకి

వేణు వండర్స్ టీమ్ ద్వారా జబర్దస్త్ లోకి అడుగుపెట్టిన సుడిగాలి సుధీర్ గెటప్ శీను ఇద్దరు కూడా చాలా తొందరగానే వారికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్నారు. మొదట సుడిగాలి సుదీర్ జబర్దస్త్ లో కేవలం స్క్రిప్ట్ రైటర్ గా మంచి గుర్తింపు అందుకున్నాడు. ఆ తర్వాత అతని టైమింగ్ కూడా బావుండడంతో సీనియర్ కమెడియన్ వేణు జబర్దస్త్ స్టేజ్ పైకి తీసుకువచ్చాడు.

టీమ్ లీడర్ గా..

టీమ్ లీడర్ గా..

మొదట సుడిగాలి సుదీర్ మ్యాజిక్ షోలతో కొన్ని స్టేజ్ షో లలో కూడా మంచి గుర్తింపు పొందాడు ఉన్నత చదువులు చదువుకున్నప్పటికి కూడా తనకు ఇష్టమైన ఫీల్డ్ లోనే ఉండాలని అడుగులు వేశాడు. వేణు వండర్స్ టీం లో ఒక రైటర్ గా జాయిన్ అయ్యి అతి తక్కువ కాలంలోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకని టీమ్ లీడర్ గా ఎదిగాడు.

ముగ్గురు కలిసి కట్టుగా..

ముగ్గురు కలిసి కట్టుగా..

సుడిగాలి సుదీర్ గెటప్ శ్రీను ఇద్దరు కూడా జబర్దస్త్ లో అలాగే కొనసాగుతూ స్కిట్స్ తో షో టిఆర్పి పెంచడంలో ముఖ్య పాత్ర పోషించారు. ఇక మధ్యలో వారితోపాటు జాయిన్ అయిన ఆటో రాంప్రసాద్ కూడా మరింత ఆకట్టుకోవడంతో టీమ్ కు మంచి పేరు వచ్చింది. ఆటో రాంప్రసాద్ స్కిట్ లో కూడా తన ఆటో పంచ్ లతో ప్రేక్షకులను ఎంతగానో నవ్విస్తూ వస్తున్నాడు.

వారికి ప్రత్యేకంగా

వారికి ప్రత్యేకంగా

అయితే జబర్దస్త్ కు ఎంతో బలమైన సుడిగాలి సుధీర్ టీం కు నిర్వాహకులు ఏ స్థాయిలో పారితోషికాలు ఇస్తారు అనేది హాట్ టాపిక్ గా మారింది. సాధారణంగా కొన్ని టీమ్స్ కు అయితే టీమ్ లీడర్ కు ఒక అమౌంట్ ఇచ్చి టీమ్ సెట్ సివేసుకునేదాన్ని బట్టి మిగతా సభ్యులకు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ సుడిగాలి టీమ్ లో అలా కాదు. వారి రేంజ్ ని బట్టి డిమాండ్ ను బట్టి ప్రత్యేకంగా రెమ్యునరేషన్స్ ఇస్తున్నారు.

రెమ్యునరేషన్ ఎంతంటే?

రెమ్యునరేషన్ ఎంతంటే?

సీనియర్టిని బట్టి గెటప్ శ్రీను, అలాగే సుడిగాలి సుధీర్ ఇద్దరికి కూడా ఒకే తరహా రెమ్యునరేషన్స్ అందుతున్నట్లు సమాచారం. ఒక్కొక్కరికి రెండు లక్షలకు పైగానే ఇస్తున్నట్లు టాక్. ఇక స్క్రిప్ట్ లో కూడా టీమ్ కు ఎంతగానో హెల్ప్ అవుతున్న ఆటో రామ్ ప్రసాద్ కు దాదాపు లక్షకు పైగానే ఇస్తున్నట్లు సమాచారం.

 అలా కూడా మంచి ఆదాయం

అలా కూడా మంచి ఆదాయం

కేవలం జబర్దస్త్ ద్వారానే కాకుండా సుడిగాలి టీమ్ శ్రీదేవి డ్రామా కంపెనీ, అలాగే ఢీ షో ద్వారా కూడా మంచి ఆదాయాన్ని అందుకుంటున్నారు. ఇక పండగలు వస్తే స్పెషల్ షోలకు కూడా అంతకంటే ఎక్కువ రెమ్యునరేషన్స్ ఇస్తారని సమాచారం. ఎలా చూసుకున్నా కూడా సుడిగాలి సుధీర్ టీమ్ కంటెస్టెంట్స్ ముగ్గురు కూడా అత్యధిక స్థాయిలో రెమ్యునరేషన్ అందికుంటున్నట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X