సుడిగాలి సుధీర్ మరో కొత్త సినిమా .. ఆ బిగ్‌బాస్ బ్యూటీ హీరోయిన్‌గా..

సుడిగాలి సుధీర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జబర్దస్త్ ద్వారా కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు సుధీర్. తన టైమింగ్, డ్యాన్స్, సింగింగ్, హోస్టింగ్ స్కిల్స్‌తో మల్టీటాలెంటెడ్ ఎంటర్‌టైనర్‌గా నిలిచాడు. బుల్లితెరపై అతనికి ఉన్న క్రేజ్ ఇప్పటికీ తగ్గలేదు. అయితే అదే స్థాయి సక్సెస్‌ను సిల్వర్ స్క్రీన్‌పై అందుకోవడంలో మాత్రం కొంత వెనుకబడ్డాడు. ఈ నేపథ్యంలో అతని కొత్త సినిమా ప్రకటన వెలువడింది. ఇంతకీ ఆ సినిమా ఏంటీ? ఇంతకీ హీరోయిన్ ఎవరు?

బుల్లితెర స్టార్ నుంచి హీరోగా ప్రయాణం
సుధీర్ కెరీర్‌ను పరిశీలిస్తే, మొదట చిన్న చిన్న పాత్రలతో ప్రారంభించి, తర్వాత 'జబర్దస్త్' ద్వారా స్టార్‌డమ్ సంపాదించాడు. అక్కడి నుంచి హీరోగా మారి 'సాఫ్ట్‌వేర్ సుధీర్', '3 మంకీస్', 'వాంటెడ్ పండుగాడ్', 'కాలింగ్ సహస్ర' వంటి సినిమాల్లో నటించాడు. అయితే ఇవి కమర్షియల్‌గా పెద్దగా సక్సెస్ కాలేకపోయాయి. మధ్యలో వచ్చిన 'గాలోడు' మాత్రం ఊహించని హిట్ అందించి సుధీర్‌కు ఆశలు నింపింది. అయినా కూడా, టీవీలో ఉన్నంత ఫాలోయింగ్‌ను థియేటర్లలోకి మార్చడం కష్టం అవుతుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

Jabardasth Sudigali Sudheer s Joker Movie Announced Bigg Boss Beauty Ayesha as Heroine

ఈ నేపథ్యంలో సుధీర్ తాజాగా 'సుధీర్ జోకర్' అనే కొత్త ప్రాజెక్ట్‌తో ముందుకు వస్తున్నాడు. ఈ సినిమాకి పీఎస్ సునీల్ పుప్పాల దర్శకత్వం వహిస్తుండగా, విజయ్ డొంకాడ, శ్రీధర్ మక్కువ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా పూర్తిగా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోందని సమాచారం. తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌లో సుధీర్ ప్లేయింగ్ కార్డ్స్ మధ్య కనిపించడం కథలో ఒక గేమ్, థ్రిల్ లేదా ట్విస్ట్ ఎలిమెంట్స్ ఉండొచ్చనే సంకేతాలు ఇస్తోంది. పోస్టర్‌కు మంచి స్పందన రావడం విశేషం.

హీరోయిన్‌గా బిగ్‌బాస్ బ్యూటీ
ఈ సినిమాలో సుధీర్ సరసన హీరోయిన్‌గా అయేషా (Ayesha Zeenath)నటిస్తోంది. తమిళ 'బిగ్ బాస్'తో గుర్తింపు తెచ్చుకున్న ఆమె, తెలుగు బిగ్ బాస్‌లో కూడా పాల్గొంది. అయితే ఆరోగ్య సమస్యల కారణంగా మధ్యలోనే షో నుంచి బయటకు రావాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ సినిమా ద్వారా ఆమెకు హీరోయిన్‌గా పెద్ద అవకాశం రావడం విశేషం. తక్కువ కాలం బిగ్ బాస్‌లో ఉన్నప్పటికీ, ఈ ఛాన్స్ దక్కించుకోవడం ఆమెకు కెరీర్ టర్నింగ్ పాయింట్ అవుతుందా అన్నది చూడాలి.

'సుధీర్ జోకర్' సినిమాలో అనుభవజ్ఞులైన నటీనటులు కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మురళి శర్మ, అజయ్ ఘోష్, అభిరామి, రమేష్ ఇందిరా, విష్ణు ఓయ్, మురళీధర్ గౌడ్ వంటి వారు నటిస్తున్నారు. ఈ స్టార్ క్యాస్టింగ్ సినిమాకు మరింత బలం చేకూర్చే అవకాశం ఉంది. సుధీర్.. బుల్లితెరపై అతను టాప్ ఎంటర్‌టైనర్‌గా ఉన్నా, సినిమాల్లో మాత్రం అదే స్థాయి రిజల్ట్ రావడం లేదు. దీనికి ప్రధాన కారణం కంటెంట్, కథ, ప్రెజెంటేషన్ అని విశ్లేషకులు చెబుతున్నారు.

అయితే సరైన కథ, బలమైన స్క్రీన్‌ప్లే ఉంటే సుధీర్ కూడా సిల్వర్ స్క్రీన్‌పై పెద్ద సక్సెస్ సాధించే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. మరి ఈ సినిమాతోనైనా సరైన హిట్ అందుకుని, హీరోగా రాణిస్తారా? లేదో వేచి చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X