Don't Miss!
- News
శ్రీనగర్ లాల్‌చౌక్‌లో రేవంత్ రెడ్డి- భరతమాత ముద్దుబిడ్డగా అది నా బాధ్యత
- Sports
IND vs NZ: చెలరేగిన స్పిన్నర్లు.. చేతులెత్తేసిన న్యూజిలాండ్ బ్యాటర్లు! భారత్ టార్గెట్ ఏక్‌సౌ!
- Lifestyle
హాట్ అరోమా ఆయిల్ మేనిక్యూర్ గురించి మీకు తెలుసా? రఫ్ హ్యాండ్స్ ని చేతిని మృదువుగా చేస్తుంది!
- Finance
BharatPe: భారత్ పే వ్యవస్థాపకుడి జీతం ఎంతో తెలుసా..? మిగిలిన వారి జీతాలు ఇలా..
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
పెళ్లికి ముందు జబర్దస్త్ సుజాత ప్రేమ యాత్రలు.. రాకేష్ తో రొమాంటిక్ వీడియోలు వైరల్
జబర్దస్త్ ద్వారా మంచి క్రేజ్ అందుకున్న వారిలో రాకింగ్ రాకేష్ అలాగే సుజాత మంచి జోడి అని చెప్పవచ్చు. కొన్ని రియాల్టీ షోలలో గత కొంతకాలంగా వీరు హైలైట్ అవుతూ వస్తున్నారు. అయితే మొదట వీరు కేవలం రియాల్టీ షోల కోసమే ప్రేమికుల తరహాలో కనిపిస్తున్నారు అని అనిపించింది. కానీ ఆ తర్వాత మాత్రం వారిది నిజమైన ప్రేమ అని అధికారికంగా క్లారిటీ ఇచ్చేశారు. ఇక ప్రస్తుతం అయితే జబర్దస్త్ సుజాత అలాగే రాకేష్ ఇద్దరు కూడా ప్రేమ యాత్రలలో మునిగి తెలుపుతున్నారు. వారికి సంబంధించిన కొన్ని వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ వివరాలలోకి వెళితే..

జబర్దస్త్ లో అలా..
జబర్దస్త్ రాకేష్ మొదట మిమిక్రీ ఆర్టిస్ట్ గా గుర్తింపును అందుకుని ఆ తర్వాత జబర్దస్త్ లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. మొదట్లో తను కేవలం ఒక సైడ్ క్యారెక్టర్ తరహాలో కనిపించాడు. ఇక తర్వాత మెల్లగా అతని కామెడీ వర్కౌట్ కావడంతో టీమ్ లీడర్ గా కూడా అవకాశం ఇచ్చారు. ఎక్కువగా చిన్న పిల్లలతో రాకింగ్ రాకేష్ జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు అందుకున్నాడు.

అప్పట్లోనే రూమర్స్
ఇక మరికొన్నాళ్లకు రాకేష్ తీన్మార్ వార్తలతో బాగా పాపులర్ అయిన సుజాతను టీమ్ లో జాయిన్ చేసుకొని మరింత భిన్నమైన తరహాలో కామెడీని క్రియేట్ చేసుకుంటూ వెళ్ళాడు. అయితే వీరి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా వర్కౌట్ కావడంతో మంచి క్రేజ్ అయితే వచ్చింది. ఇక సుజాత రాకింగ్ రాకేష్ మధ్యలో ఏదో నడుస్తోంది అని కూడా మధ్య మధ్యలో అనేక రకాల రూమర్స్ అయితే వినిపించాయి.

మొదట్లో డ్రామా అనుకున్నారు
కానీ ఎప్పుడూ కూడా ఆ విషయంలో వీరు పెద్దగా క్లారిటీ ఇచ్చింది లేదు. కానీ ఆ తర్వాత వీరిద్దరి మధ్యలో ప్రేమ ఉన్నట్లుగా రియాలిటీ షోలలో కనిపించడంతో అది కూడా టిఆర్పి కోసమే అనుకున్నారు. ఎందుకంటే జబర్దస్త్ అలాగే శ్రీదేవి డ్రామా కంపెనీ ఇలా కొన్ని షోలలో చాలా జంటలు వివిధ తరహాలో వైరల్ అయ్యాయి. రష్మీ సుధీర్ జంట ఎలా ఉందో ఇప్పుడు సుజాత రాకేష్ కూడా అదే తరహాలో టిఆర్పి కోసం డ్రామా క్రియేట్ చేస్తున్నట్లు టాక్ వినిపించింది.

రోజా ముందు ప్రేమ గుట్టు
కానీ ఆ తర్వాత పలు ఇంటర్వ్యూలలో వీరి స్నేహం గురించి కొంత డీప్ గా అయితే వివరణ ఇచ్చారు. ఆ తరువాత మళ్ళీ ఈ జబర్దస్త్ జంట ప్రేమలో ఉన్నట్లు అధికారికంగా ప్రకటించేశారు. అంతే కాకుండా రోజా ముందు కూడా వీరి ప్రేమ గుట్టు బయటపడింది. ఇక త్వరలో వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు ఒక క్లారిటీ అయితే ఇచ్చారు.
దుబాయ్ లో ప్రేమ యాత్రలు
అయితే అప్పుడప్పుడు సుజాత రాకింగ్ రాకేష్ తో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తూ ఉంటుంది. అయితే ఇటీవల ఇద్దరు కలిసి దుబాయ్ కూడా వెళ్లారు. అక్కడికి ఎందుకు వెళ్లారు అనేది క్లారిటీ ఇవ్వలేదు కానీ ప్రస్తుతం మాత్రం చాలా రొమాంటిక్ గా ప్రేమలో మునిగితేలుతున్నట్లుగా అర్థం అవుతుంది.
ఒక వీడియోలో అయితే సుజాత రాకేష్ తో సరదాగా డాన్స్ చేస్తూ కనిపిస్తుంది. అంతేకాకుండా అతన్ని సరదాగా ఆటపాటిస్తున్నట్లు కూడా ఉంది. ఏదేమైనా కూడా మరోసారి ఈ జంట సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.