Bigg Boss 6: బిగ్ బాస్‌లోకి జబర్ధస్త్ ట్రాన్స్‌జెండర్.. అలా ఆఫర్ అందుకున్న బ్యూటీ

తెలుగు బుల్లితెరపై సంచలనాలకు కేరాఫ్ అడ్రెస్‌గా నిలిస్తూ.. ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్‌ను అందిస్తూ.. ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్‌ను దక్కించుకుంటోన్న ఏకైక రియాలిటీ షో బిగ్ బాస్. ఈ ఉత్సాహంతోనే వరుసగా సీజన్ల మీద సీజన్లను పూర్తి చేసుకుంటూ ముందుకు సాగుతోంది. ఇలా ఇప్పటికే ఐదు రెగ్యూలర్ సీజన్లను, ఒక ఓటీటీ సీజన్‌ను పూర్తి చేసుకుంది. ఈ షో నుంచి త్వరలోనే ఆరో సీజన్‌తో రాబోతుంది. ఇక, ఇందులో పాల్గొనబోయే కంటెస్టెంట్ల గురించి తరచూ ఏదో ఒక వార్త వైరల్ అవుతోంది. ఈ క్రమంలోనే ఎంతో మంది పేర్లు లీక్ అవుతున్నాయి. తాజాగా ఆరో సీజన్‌లో పాల్గొనే మరో సెలెబ్రిటీ వివరాలు బయటకొచ్చాయి. ఆ కంటెస్టెంట్ ఎవరో మీరే తెలుసుకోండి!

సక్సెస్‌ఫుల్.. ఆరో సీజన్‌పై ఆసక్తి

సక్సెస్‌ఫుల్.. ఆరో సీజన్‌పై ఆసక్తి

దేశంలోని ఎన్నో భాషల్లో వస్తున్నా తెలుగు ప్రసారం అవుతోన్న బిగ్ బాస్‌కు మాత్రమే రికార్డు స్థాయిలో రేటింగ్ దక్కుతోంది. ఇలా ఐదు సీజన్లను పూర్తి చేసుకున్న ఈ షో.. ఇప్పుడు ఆరో దానిని కూడా తీసుకు రాబోతుంది. ఇప్పటి వరకూ ఎంతో రంజుగా సాగిన ఈ షో.. త్వరలోనే మరో సీజన్‌ను తీసుకు రాబోతుండడంతో అందరిలో ఆసక్తి నెలకొంది. దీంతో ఇది ట్రెండ్ అవుతోంది.

ఫుల్ కలర్‌ఫుల్‌... సీజన్ అప్పుడే

ఫుల్ కలర్‌ఫుల్‌... సీజన్ అప్పుడే

ఎన్నో అంచనాలతో రాబోతున్న బిగ్ బాస్ ఆరో సీజన్‌కు సంబంధించిన లోగోనే ఇటీవలే విడుదల చేశారు. ఇది గతంలో కంటే ఎంతో కలర్‌ఫుల్‌గా ఉంది. దీంతో ఈ సీజన్‌పై అందరిలో అంచనాలు నెలకొన్నాయి. త్వరలోనే మరో ప్రోమోను కూడా వదలబోతున్నారు. ఇక, ఈ సీజన్ సెప్టెంబర్ 4వ తేదీ నుంచి ప్రారంభం కాబోతుందని ఇప్పటికే ఓ న్యూస్ బయటకు వచ్చింది.

సెట్ వర్క కంప్లీట్.. కొత్త కాన్సెప్ట్

సెట్ వర్క కంప్లీట్.. కొత్త కాన్సెప్ట్


ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న బిగ్ బాస్ ఆరో సీజన్ కోసం నిర్వహకులు పనులను దాదాపుగా పూర్తి చేశారని తెలుస్తోంది. ఇందులో భాగంగానే కంటెస్టెంట్లను ఉంచేందుకు ఏర్పాటు చేసే సెట్‌కు సంబంధించిన వర్క్‌ను కూడా పూర్తి చేశారట. ఇది గతంలో చూడని విధంగా అత్యంత కలర్‌ఫుల్‌గా ఉంటుందట. ఇక, ఈ సీజన్‌లో సరికొత్త కాన్సెప్టును పరిచయం చేస్తున్నారని టాక్.

కంటెస్టెంట్ల లిస్ట్ ఫైనల్ చేశారు

కంటెస్టెంట్ల లిస్ట్ ఫైనల్ చేశారు


వచ్చే నెలలోనే మొదలు కాబోతున్న బిగ్ బాస్ ఆరో సీజన్ కోసం నిర్వహకులు ఎప్పుడో గ్రౌండ్ వర్క్‌ను ప్రారంభించారు. ఇందులో భాగంగానే కంటెస్టెంట్ల ఎంపిక ప్రక్రియలో ఒక రౌండ్‌ను కూడా పూర్తి చేసి షార్ట్ లిస్టును బిగ్ బాస్ టీమ్ రెడీ చేసింది. ఇప్పుడు వాళ్లతో రెమ్యూనరేషన్ డీల్స్ చేసుకుంటున్నారు. అంతేకాదు, ఈ సీజన్ కోసం ఒక కామన్ మ్యాన్‌ను కూడా ఎంపిక చేసుకున్నారు.

ఈ సారి జాగ్రత్త... అయినా లీక్

ఈ సారి జాగ్రత్త... అయినా లీక్

అత్యంత వైభవంగా ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ ఆరో సీజన్‌లో పాల్గొనబోయే కంటెస్టెంట్ గురించి ఎన్నో వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే పలువురు సెలెబ్రిటీల పేర్లు తెరపైకి వస్తున్నాయి. అయితే, ఇందులో ఎవరు పాల్గొంటారన్న దానిపై క్లారిటీ రావట్లేదు. దీనికి కారణం ఈ సారి నిర్వహకులు చాలా జాగ్రత్తలు తీసుకున్నారట. అయినా కొన్ని పేర్లు లీక్ అవుతున్నాయి.

బిగ్ బాస్‌ షోలోకి ట్రాన్స్‌జెండర్

బిగ్ బాస్‌ షోలోకి ట్రాన్స్‌జెండర్

బిగ్ బాస్ ఆరో సీజన్‌లో ఫలానా సెలెబ్రిటీ పాల్గొనే అవకాశం ఉన్నట్లు తరచూ రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎంతో మంది పేర్లు వైరల్ అవుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. ఆరో సీజన్‌లో జబర్ధస్త్ ఫేమ్ ప్రముఖ ట్రాన్స్‌జెండర్ తన్మయి పాల్గొనబోతున్నట్లు తెలిసింది. దీంతో ఆమె పేరు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయిపోతోంది.

అలా ఆఫర్ అందుకున్న భామ

అలా ఆఫర్ అందుకున్న భామ


జబర్ధస్త్‌లో లేడీ గెటప్‌లు వేసుకుంటూ ఫేమస్ అయిన తన్మయ్.. ఆ తర్వాత ట్రాన్స్‌జెండర్‌గా మారినట్లు ప్రముఖ షోలో ప్రకటించింది. దీంతో ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది. ఇక, స్టార్ మాలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత తన్మయికి బిగ్ బాస్ నిర్వహకులు టచ్‌లో ఉన్నారట. ఈ కారణంగానే ఆమె ఆరో సీజన్‌లో అవకాశాన్ని దక్కించుకున్నట్లు ఓ న్యూస్ వైరల్ అవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X