For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  జబర్ధస్త్ షోలోకి వెళ్లాలని ఉందా? అయితే ఈ అవకాశం మీకోసం.. ఇలా చేస్తే స్టార్స్ అవడం ఖాయం!

  |

  తెలుగు బుల్లితెరపై ఎన్నో రకాల కామెడీ షోలు వస్తున్నాయి.. పోతున్నాయి. కానీ, సుదీర్ఘ కాలంగా టెలివిజన్ రంగంలో హవాను చూపిస్తూ నెంబర్ వన్ ప్లేస్‌లో ఉన్న ఏకైక షో జబర్ధస్త్. ఈ మధ్య కాలంలో దీనికి పోటీగా ఎన్నో షోలు వచ్చినా.. అవన్నీ మధ్యలోనే ఆగిపోయాయి. కానీ, జబర్ధస్త్ మాత్రం సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతూనే ఉంది. ఇక, ఈ షో వల్ల ఎంతో మంది బిగ్ సెలెబ్రిటీలుగా మారిపోయారు. తద్వారా బుల్లితెరపై హవాను చూపిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు జబర్ధస్త్ మరికొందరిని స్టార్లుగా చేయబోతుంది. దానికి సంబంధించిన వివరాలు మీ అందరి కోసం!

  ఎంతో మందికి లైఫ్ ఇచ్చిన షో

  ఎంతో మందికి లైఫ్ ఇచ్చిన షో

  టెలివిజన్ రంగంలో ప్రత్యేకమైన ముద్రను వేసుకుని నెంబర్ వన్ కామెడీ షోగా వెలుగొందుతోంది జబర్ధస్త్. దీని ద్వారా ఎంతో మంది ఆర్టిస్టులు, టెక్నీషియన్లు వెలుగులోకి వచ్చారు. అలా ఎంట్రీ ఇచ్చిన వారిలో చాలా మంది తమ టాలెంట్లను నిరూపించుకుని స్టార్లుగా ఎదిగారు. తద్వారా వరుసగా ఆఫర్లను దక్కించుకుంటూ దూసుకెళ్తోన్నారు. దీంతో వాళ్ల కెరీర్ జబర్ధస్త్‌గా సాగుతోంది.

  కార్తీక దీపం హీరోయిన్ టాలీవుడ్ ఎంట్రీ: అక్కినేని హీరోతో వంటలక్క.. ఏ పాత్ర చేస్తుందంటే!

   వాళ్లకు కూడా ప్లస్ అయిందిగా

  వాళ్లకు కూడా ప్లస్ అయిందిగా


  జబర్ధస్త్ షో ద్వారా చాలా మంది ఆర్టిస్టులు మిగిలిన రంగాల్లో కూడా సత్తా చాటుతున్నారు. అదే సమయంలో ఈ షోకు జడ్జ్‌లుగా వ్యవహరించిన సీనియర్ హీరోయిన్ రోజా, మెగా బ్రదర్ నాగబాబు కూడా మరింతగా హైలైట్ అయ్యారు. ఇక, ఇందులో యాంకర్లుగా చేస్తున్న అనసూయ భరద్వాజ్, రష్మీ గౌతమ్‌ కెరీర్‌ ఎదుగుదలకు కూడా జబర్ధస్త్ షో బాగా ప్లస్ అయిందన్నది తెలిసిందే.

  కొత్త కంటెంట్‌తో సక్సెస్‌ఫుల్‌గా

  కొత్త కంటెంట్‌తో సక్సెస్‌ఫుల్‌గా

  దాదాపు తొమ్మిదేళ్లుగా తిరుగులేని షోగా వెలుగొందుతోన్న జబర్ధస్త్.. అప్పటి నుంచీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. అంతేకాదు, క్రమంగా కామెడీ డోసును పెంచేందుకు టీమ్ లీడర్లు అందరూ విశ్వ ప్రయత్నాలు చేస్తూ కొత్త కొత్త కంటెంట్‌తో వస్తున్నారు. అదే సమయంలో షో నిర్వహకులు కూడా కొన్ని హంగులను జోడిస్తూ షోను మరింత సక్సెస్‌ఫుల్‌గా నడుపుతున్నారని చెప్పొచ్చు.

  Dethadi Harika Marriage: షాకిస్తోన్న దేత్తడి హారిక పెళ్లి వార్త.. ఆ యూట్యూబర్‌తోనే లవ్ మ్యారేజ్!

  వాళ్లంతా ఔట్... కొత్త వాళ్లతోనే

  వాళ్లంతా ఔట్... కొత్త వాళ్లతోనే

  జబర్ధస్త్ షోలోకి నిత్యం పాత వాళ్లు వెళ్లడం.. కొత్త వాళ్లు రావడం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలోనే అదిరే అభి, చమ్మక్ చంద్ర, కిర్రాక్ ఆర్పీ, సుడిగాలి సుధీర్, ముక్కు అవినాష్, చలాకీ చంటీ సహా ఎంతో మంది టీమ్ లీడర్లు బయటకు వెళ్లిపోయారు. వీళ్ల బాటలోనే మరికొందరు కమెడియన్లు కూడా వెళ్లిపోతున్నారు. అలాగే, కొత్త వాళ్లు కూడా ఎంట్రీలు ఇస్తున్నారు.

   కమెడియన్లు, రైటర్లు కావాలని

  కమెడియన్లు, రైటర్లు కావాలని


  జబర్ధస్త్ టీమ్ తాజాగా కమెడియన్లు, రైటర్ల కోసం ఓ ప్రకటన విడుదల చేసింది. ఇందులో 'ఈటీవీలో ప్రసారమయ్యే జబర్ధస్త్ షోలో పాల్గొనాలని అనుకుంటున్నారా? కామెడీ టైమింగ్‌తో పాటు స్క్రిప్ట్ రైటింగ్ చేసే సత్తా మీలో ఉందా? అయితే, ఈ నెల 16వ తేదీన జరిగే ఆడిషన్స్‌లో పాల్గొనండి. స్టార్స్‌గా మారే అవకాశాన్ని అందుకోండి' అంటూ జబర్ధస్త్ నిర్వహకులు వెల్లడించారు.

  జబర్ధస్త్ రీతూ చౌదరి ఎద అందాల ఆరబోత: హాట్ షోలో గీత దాటేసిందిగా!
  https://telugu.filmibeat.com/television/jabardasth-rithu-chowdary-sizzling-pics-viral-in-internet-113785.html

   ఆడిషన్స్ ఎప్పుడు? ఎక్కడ?

  ఆడిషన్స్ ఎప్పుడు? ఎక్కడ?


  కమెడియన్లు, స్క్రిప్టు రైటర్ల కోసం జబర్ధస్త్ నిర్వహకులు నిర్వహించబోయే ఆడిషన్స్ కార్యక్రమం అక్టోబర్ 16న జరగబోతుంది. దీన్ని హైదరాబాద్ నగరంలోని నానక్‌రామ్‌గూడలో ఉన్న రామానాయుడు స్టూడియోలో జరపబోతున్నారు. ఇక, ఈ ఆడిషన్స్‌ను ఆరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ నిర్వహిస్తారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

   వచ్చేవాళ్లు ఏం చేయాలంటే

  వచ్చేవాళ్లు ఏం చేయాలంటే


  జబర్ధస్త్ నిర్వహకులు జరిపే ఆడిషన్స్‌కు వచ్చే వారిలో కమెడియన్ల విభాగంలో ఉన్న వాళ్లు నాలుగు నిమిషాల కామెడీ కంటెంట్‌ను ప్రిపేర్ అయి రావాల్సి ఉంటుందట. అలాగే, స్క్రిప్ట్ రైటర్ల విభాగంలోని వాళ్లు ఐదు నిమిషాల కామెడి స్క్రిప్టు రాసుకుని రావాలని చెప్పారు. ఇక, ఈ ఆడిషన్స్ కోసం వచ్చే వాళ్లు ఆధార్ కార్డుతో పాటు రెండు ఫొటోలు తీసుకు రావాలని తెలిపారు.

  English summary
  Jabardasth Is Very Famous Comedy Show in Telugu language. Now This SHow Team Casting Call for Comedians and Writers
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X