హుధూద్ తుఫాన్ బాధితులకోసం జబర్దస్త్ టీం విరాళం!
హైదరాబాద్: ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అతలాకుతలంన చేసిన హుధూద్ తుఫాన్ అక్కడ తీవ్రమైన నష్టాన్ని మిగిల్చిన సంగతి తెలిసిందే. హుధూద్ తుఫాన్ బాధితులను ఆదుకునేందుకు అన్నిరంగాలకు చెందిన వారు ముందకు వస్తున్నారు. సినిమా సెలబ్రిటీలు, టీవీ సెలబ్రిటీలు తమ శక్తిమేర సహాయం అందిస్తున్నారు.

తాజాగా బుల్లితెరపై పాపులర్ అయిన ‘జబర్దస్త్' కామెడీ షో....టీం సభ్యులు వేణు, తాగుబోతు రమేష్, ధనరాజ్, వైవా హర్ష, చమ్మక్ చంద్ర, రాఘవ, రఘు, చంటి, శ్రీను తదితరులు చంద్రబాబును నాయుడిని కలిసి వారాళం అందించారు. అంతా కలిసి దాదాపు రూ. 41 లక్షల విరాళం సేకరించినట్లు సమాచారం. అందుకు సంబంధించిన ఫోటో ఇక్కడ చూడొచ్చు.
హుధూద్ తుఫాన్ బాధితుల కోసం తెలుగు సినిమా స్టార్స్ అందరూ భారీ ఎత్తున విరాళాలు అందించారు. సాటి తెలుగు వారిని ఆదుకోవాలంటూ అభిమానులకు ఆదర్శనంగా నిలిచారు.


Click it and Unblock the Notifications











