హైపర్ ఆదికి జబర్ధస్త్ టీమ్ షాక్.. షోలో ఉండాల్సిన పరిస్థితి.. అసలు కారణం ఇదేనా.!

By Manoj Kumar P

హైపర్ ఆది.. బుల్లితెర ప్రేక్షకులకు ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రముఖ చానెల్‌లో ప్రసారమయ్యే 'జబర్ధస్త్' షో ద్వారా ఈ యంగ్ కమెడియన్ వెలుగులోకి వచ్చాడు. మొదట వేరే టీమ్‌లో చేసినా ఆ తర్వాత తన టాలెంట్‌తో ఒక టీమ్‌కు కెప్టెన్ అయిపోయాడు. పంచులు, ప్రాసలతో స్కిట్లు చేస్తూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఆది స్కిట్‌కు యూట్యూబ్‌లో సైతం ఎన్నో లక్షల వ్యూస్ వస్తుంటాయి. దీని బట్టే అతడి పాపులారిటీ గురించి తెలుసుకోవచ్చు. ఈ క్రమంలోనే కొన్ని సినిమాల్లో కూడా నటించాడు. అలాగే, అల్లరి నరేష్ 'మేడ మీద అబ్బాయి' అనే సినిమాకు డైలాగులు కూడా రాశాడు. తక్కువ కాలంలోనే ఇంత పేరు సంపాదించుకున్న ఆదికి జబర్ధస్త్ టీమ్ షాక్ ఇచ్చిందట. పూర్తి వివరాల్లోకి వెళితే..

నాగబాబుతో హైపర్ ఆది కూడా

నాగబాబుతో హైపర్ ఆది కూడా

సక్సెస్‌ఫుల్ షో జబర్ధస్త్ విజయవంతంగా ప్రదర్శితమవుతున్న తరుణంలో ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఈ షో నుంచి దర్శకులు నితిన్, భరత్‌తో పాటు జడ్జ్ నాగబాబు, టీమ్ లీడర్లు హైపర్ ఆది, చమ్మక్ చంద్ర సహా పలువురు బయటకు వెళ్లిపోయారనేదే ఆ వార్త సారాంశం. అయితే, మరో జడ్జ్ రోజా మాత్రం తన బాధ్యతలు నిర్వహిస్తూనే ఉంటారని తెలుస్తోంది. మరికొందరు టీమ్ లీడర్లు కూడా కంటిన్యూ అవుతారని అన్నారు.

ఆ స్టేట్‌మెంట్‌తో అనుమానాలు

ఆ స్టేట్‌మెంట్‌తో అనుమానాలు

కొద్ది రోజుల క్రితం ఓ షోలో తాను ఈ స్థాయిలో ఉండడానికి కారణం అదిరే అభినే అని చెప్పాడు ఆది. ‘ఈ స్టేజ్‌ మీదే కాదు.. నేనీ స్థాయిలో ఉండడానికి అదిరే అభి అన్నే కారణం. ఆయనకు అందరి కంటే ముందు థ్యాంక్స్ చెప్పుకోవాలి. అన్న తర్వాత నన్ను ఆ రేంజ్‌లో ఎంకరేజ్ చేసింది మన డైరెక్టర్లు నితిన్ అన్నా, భరత్ అన్నా' అని ఈ యంగ్ కమెడియన్ చెప్పుకొచ్చాడు. దీంతో వాళ్ల బాటలోనే ఆది కూడా వెళ్తాడని అనుకున్నారు.

అందరి అనుమానాలకు పుల్‌స్టాప్

అందరి అనుమానాలకు పుల్‌స్టాప్

హైపర్ ఆది.. జబర్ధస్త్ నుంచి వెళ్లిపోతాడనుకున్న వారందరికీ సమాధానం దొరికేసింది. అతడు వచ్చే వారం ప్రసారం అయ్యే షోలో ఉన్నాడు. దీనికి సంబంధించిన ప్రోమో విడుదల కావడంతో హైపర్ ఆది ఉంటాడన్న దానిపై క్లారిటీ వచ్చేసింది. ఆ ప్రోమోలో ‘నేను కొండపల్లి రాజా.. అక్కడ కూర్చున్నది నగరి ఎమ్మెల్యే రోజా' అంటూ పంచ్ డైలాగ్ పేల్చి ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగించాడు.

ఆదికి షాకిచ్చిన జబర్ధస్త్ టీమ్

ఆదికి షాకిచ్చిన జబర్ధస్త్ టీమ్

హైపర్ ఆదికి జబర్ధస్త్ టీమ్ షాక్ ఇచ్చిందని తాజాగా సోషల్ మీడియాలో ఓ ప్రచారం మొదలైంది. ఈ షో ద్వారానే ప్రపంచానికి పరిచయం అయిన ఆది.. నిర్వహకులకు బాండ్ రాసిచ్చాడట. ఇప్పుడు అందరూ వెళ్లిపోవడంతో అతడు కూడా షోను వదిలి పెట్టాలని భావించాడని అంటున్నారు. అయితే, షో నిర్వహకులు మాత్రం ఆ బాండ్ విషయాన్ని అతడికి గుర్తు చేయడంతో వెనక్కి తగ్గాడనే టాక్ వినిపిస్తోంది. అందుకే ఆది ఆగిపోయాడని వినికిడి.

Recommended Video

#CineBox : Allu Arjun Is taking Huge Remuneration For Trivikram Srinivas's 'Ala Vaikuntapuramlo'?
 జబర్ధస్త్‌ గురించి

జబర్ధస్త్‌ గురించి

‘జబర్ధస్'.. ఓ ప్రముఖ చానెల్‌లో ప్రసారమయ్యే ప్రసారం అయ్యే ఈ కామెడీ షో ద్వారా ఎంతో మంది కమెడియన్లు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. అంతేకాదు, చాలా మంది ఆర్టిస్టులు సెలెబ్రిటీలు అయిపోయారు. ఒకవైపు వినోదాన్ని పంచుతూనే.. మరోవైపు, ఎంతో మంది ఆర్టిస్టులను పరిశ్రమకు అందిస్తోన్న ‘జబర్ధస్త్'కు చాలా మంది అభిమానులు ఉన్నారు. ప్రత్యేకంగా చాలా మంది గురు, శుక్రవారాల్లో ఈ షో కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అంతలా ఈ కామెడీ షో ప్రభావం చూపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X