Bigg Boss 7 Telugu: బిగ్ బాస్‌లోకి జబర్దస్త్ టాప్ టీమ్ లీడర్.. రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే షాకే!
బిగ్ బ్రదర్ అనే షో ఆధారంగా వచ్చి.. ఇండియాలోని చాలా భాషల్లో ప్రసారం అవుతోన్న షోనే బిగ్ బాస్. అన్నింటి కంటే తెలుగులో అదిరిపోయే స్పందనను సొంతం చేసుకుంటోన్న ఈ కార్యక్రమం.. సక్సెస్‌ఫుల్‌గా సీజన్ల మీద సీజన్లను జరుపుకుంటూ వస్తోంది. ఇలా ఇప్పటికే ఆరు రెగ్యూలర్, ఒక ఓటీటీ వెర్షన్‌ను విజయవంతంగా కంప్లీట్ చేశారు. ఈ క్రమంలోనే అతి త్వరలోనే బిగ్ బాస్ ఏడో సీజన్‌ను కూడా ప్రారంభించబోతున్నారు. ఇందులోకి జబర్ధస్త్‌లో స్టార్‌గా వెలుగొందుతోన్న కమెడియన్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడట. దానికి సంబంధించిన వివరాలు మీరే చూడండి!
ఏడో సీజన్ అప్పటి నుంచే : బిగ్ బాస్ షో తెలుగులో ఎప్పుడు ప్రసారం అయినా సూపర్ డూపర్ సక్సెస్ అవుతుంది. అందుకే నిర్వహకులు ఏమాత్రం గ్యాప్ తీసుకోకుండా దీన్ని ప్రతి ఏడాదీ తీసుకు వస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఏడో సీజన్‌ను కూడా మొదలెట్టబోతున్నారు. దీన్ని సెప్టెంబర్ మొదటి వారంలో స్టార్ట్ చేస్తున్నారు. ఈ సీజన్‌కు కూడా నాగార్జునే హోస్టుగా చేస్తున్న విషయం తెలిసిందే.

ఆ ప్రోమోలు.. ఉల్టాపల్టాగా : బిగ్ బాస్ ఏడో సీజన్‌కు సంబంధించి చాలా రోజులుగా ఎన్నో రకాల ప్రచారాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటీవలే దీని నుంచి లోగో, సీజన్ ప్రోమోలు విడుదల అయ్యాయి. వీటికి అన్ని వర్గాల వాళ్ల నుంచి భారీ స్పందన దక్కింది. మరీ ముఖ్యంగా ఈ సీజన్ గతంలో ఎన్నడూ చూడని విధంగా ఉల్టాపల్టాగా ఉండబోతుందని నాగార్జున చెప్పడంతో అంచనాలు పెరిగాయి.

ఆ పనులు.. కంటెస్టెంట్లతో : సెప్టెంబర్ మొదటి వారం నుంచి మొదలు అవుతున్న బిగ్ బాస్ ఏడో సీజన్ పనులు మొత్తం పూర్తైనట్లు బుల్లితెర వర్గాల ద్వారా తెలిసింది. ఇప్పటికే షో హౌస్ సెట్ వర్కును, స్టేజ్‌ను కూడా సుందరంగా తీర్చిదిద్దే పనులను చాలా వరకూ చేశారు. అదే సమయంలో కంటెస్టెంట్ల ఎంపికపైన కూడా ఫుల్‌గా ఫోకస్ చేశారు. ఇప్పుడు చాలా మందితో చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది.

20 మంది.. జంటలు కూడా : ఎంతో గ్రాండ్‌గా ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ ఏడో సీజన్‌కు సంబంధించిన కంటెస్టెంట్ల ఎంపిక ప్రక్రియను నిర్వహకులు ఎప్పుడో మొదలు పెట్టారు. ప్రారంభంలో ఆన్‌లైన్ ద్వారా ఇంటర్వ్యూలు చేశారు. తర్వాత నేరుగా మాట్లాడి డీల్స్ చేసుకున్నారు. ఇలా ఈ సీజన్ కోసం 20 మంది కంటెస్టెంట్లను ఎంపిక చేసుకున్నారు. ఇందులో కొన్ని జంటలు కూడా ఉన్నాయని టాక్.

షోలోకి జబర్ధస్త్ స్టార్ రాక : భారీ అంచనాలతో వైభవంగా ప్రారంభం కాబోతున్న ఏడో సీజన్‌లో పాల్గొనే కంటెస్టెంట్ల విషయంలో నిర్వహకులు ఎన్నో వ్యూహాలను అమలు చేస్తున్నారట. ముఖ్యంగా ప్రజాదరణ ఉన్న వాళ్లను ఎక్కువగా తీసుకుంటున్నారని తెలిసింది. ఇందులో భాగంగానే ఈ సీజన్ కోసం జబర్ధస్త్ కమెడియన్, నటుడు బుల్లెట్ భాస్కర్‌ను కంటెస్టెంట్‌గా తీసుకు వస్తున్నారని తాజాగా న్యూస్ లీకైంది.

ఎక్కువ రెమ్యూనరేషన్‌తో : ప్రస్తుతం జబర్ధస్త్‌లో ఉన్న టాప్ టీమ్ లీడర్లలో ఒకడైన బుల్లెట్ భాస్కర్‌ను అత్యధిక రెమ్యూనరేషన్ ఇచ్చి మరీ తీసుకు వస్తున్నారని బుల్లితెర వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. అతడికి ఈ సీజన్‌లో పాల్గొనేందుకు గానూ వారానికి రూ. 2.50 లక్షలు ఇచ్చేందుకు నిర్వహకులు ఒప్పుకున్నారట. దీంతో జబర్ధస్త్‌ను వదిలి వచ్చేందుకు భాస్కర్ రెడీ అయ్యాడనే టాక్ వినిపిస్తోంది.


Click it and Unblock the Notifications











