రష్మీ, సుధీర్‌తో అదిరిపోయే స్కెచ్.. జబర్ధస్త్ టీమ్ ఐడియా మామూలుగా లేదుగా.!
తెలుగులో బుల్లితెరను ఫాలో అయ్యే ప్రేక్షకులకు సుడిగాలి సుధీర్, రష్మీ గౌతమ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతలా వీళ్లు పాపులర్ అయిపోయారు. ప్రస్తుతం సక్సెస్‌ఫుల్ షోగా వెలుగొందుతున్న 'జబర్ధస్త్' కామెడీ షో ద్వారా టెలివిజన్‌లోకి ఎంటరైన ఈ జంట.. ఎంతో క్రేజ్ సంపాదించుకుంది. అంతేకాదు, కొన్నేళ్లుగా వీళ్లపై వచ్చినన్ని పుకార్లు మరెవరిపై వచ్చి ఉండవు. దీనికి కారణం ఇద్దరూ కలిసి జంటగా షోలు చేయడం.. వాటిలో క్లోజ్‌గా కలిసి స్కిట్లు చేయడమే అన్నది తెలిసిందే. ఈ క్రమంలోనే వీళ్లిద్దరూ ప్రేమించుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ జంటకు సంబంధించిన ఓ వార్త బయటకు వచ్చింది. ఇంతకీ ఆ వార్త ఏంటి..? పూర్తి వివరాల్లోకి వెళితే..

రష్మీ - సుధీర్.. అక్కడ బాగా పాపులర్
యాంకర్ రష్మీ.. యాక్టర్ సుడిగాలి సుధీర్ తమ ప్రొఫెషన్ కోసం కలిసి పని చేస్తున్నారు. అప్పటి నుంచి వీళ్లిద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే వీళ్లపై యూట్యూబ్‌లో ఎన్నో గాసిప్స్ వస్తున్నాయి. దీంతో వీళ్లిద్దరినీ యూట్యూబ్ జోడీ అని పిలుస్తుంటారు. ఇదే విషయాన్ని చాలా మంది జబర్ధస్త్ స్కిట్లలో కూడా ప్రస్తావించారు..

ఎంత మొత్తుకున్నా ఆగట్లేదు
తమపై వస్తున్న వార్తలను అటు సుధీర్, ఇటు రష్మీ ఖండిస్తూనే ఉన్నారు. తామిద్దరం ప్రేమించుకోవడం లేదని ఎన్నో సార్లు క్లారిటీ కూడా ఇచ్చారు. అంతేకాదు, సోషల్ మీడియా వేదికగా తామిద్దరం స్నేహితులం మాత్రమేనని చాలా సార్లు వెల్లడించారు. అయినా.. ఏదో ఒక ప్రోగ్రాంలో వచ్చిన సన్నివేశాలు చూసి వీళ్ల మధ్య ఏదో ఉందని ప్రచారం చేసేస్తున్నారు.

సుధీర్ మాత్రం అస్సలు తగ్గట్లేదు
రష్మీ ఈ విషయంలో కొంత మొహమాటంగా ఉంటున్నప్పటికీ.. సుధీర్ మాత్రం తరచూ ఏదో ఒక పని చేసి హైలైట్ అవుతున్నాడు. తాను ఈ స్టేజ్‌లో ఉండడానికి రష్మీనే కారణం అని గతంలో చెప్పాడు. అంతేకాదు, ఇటీవల బాలీవుడ్ హీరోయిన్లు వచ్చినా.. రష్మీనే హగ్ చేసుకుంటానని చెప్పాడు. దీంతో ఈ జంట మరోసారి వార్తల్లోకి ఎక్కింది.

మేకర్ల టార్గెట్ కూడా వీళ్లిద్దరే
ప్రస్తుతం బుల్లితెరపై వీళ్లు చేస్తున్న షోలు టాప్ రేటింగ్స్‌ను దక్కించుకుంటున్నాయి. దానికి ఈ జంట కూడా ఒక కారణం అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయా షోలకు చెందిన రైటర్లు, డైరెక్టర్లు వీళ్ల మధ్య ఏదో ఉన్నట్లు చూపించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ జంట మధ్య రొమాంటిక్ సాంగ్స్ పెట్టడమో.. లవ్ ప్రపోజల్స్ ఇలా ఏదోటి క్రియేట్ చేసి రేటింగ్ సంపాదించుకుంటున్నారు.
రష్మీ, సుధీర్‌తో అదిరిపోయే జబర్ధస్త్ స్కెచ్
జబర్ధస్త్ షో నుంచి నాగబాబు వెళ్లిపోయిన తర్వాత ఆ యూనిట్ ఎన్నో సరికొత్త ప్లాన్స్ వేస్తోంది. ఇందులో భాగంగానే రష్మీ, సుధీర్‌ను వాడుకుంటున్నారని తాజా సమాచారం. ఇందులో భాగంగానే ఈ వారం ఎక్స్‌ట్రా జబర్ధస్త్‌లో వీళ్లిద్దరి మధ్య రొమాంటిక్ సీన్స్ క్రియేట్ చేశారని ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించిన ప్రొమో కూడా ట్రెండ్ అయిపోయింది.


Click it and Unblock the Notifications











