Jabardasth: తండ్రి చనిపోతే అంత్యక్రియలకు డబ్బులు లేక కమెడియన్ ఆవేదన.. దారుణమైన జీవితం

జబర్దస్త్ మహేష్, కమెడియన్ మహేష్.. ఈ పేరు వినగానే అమాయకంగా కనిపించే మొహంతో పొడుగాటి కాళ్లు గల ఓ అబ్బాయి మనకు గుర్తుకు వస్తాడు. చూసేందుకు చాలా అమాయకంగానే కనిపిస్తూ... డైలాగ్ డెలివరీని మాత్రం పర్ ఫెక్ట్ గా దింపేస్తాడు. తనదైన మాటలు, బాడీ లాంగ్వేజ్ తో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటాడు.

జబర్దస్త్ తో కమెడియన్ గా కెరియర్ ప్రారంభించిన ఇతడు తన టాలెంట్ తో సినిమాల్లో ఛాన్సులు కూడా దక్కించుకున్నాడు. అయితే అతను ఒకానొక సమయంలో చాలా కష్టాలు ఎదుర్కొన్నాడు. ఇటీవల ఇంటర్వ్యూలో ఆ చేదు అనుభవాలను గుర్తు చేసుకొని ఎమోషనల్ అయ్యాడు. ఆ వివరాల్లోకి వెళితే..

Jabardasth telugu comedian mahesh about his sad situations

మహేష్ కన్నీటి పర్యంతం: తెలుగు, కన్నడ సినిమాల్లో నటించి మెప్పించిన మహేష్ కరెంట్ తీగ. క్రాక్, డర్టీ హరి, మహర్షి, గుణ 369, ప్రతిరోజూ పండగే, రంగస్థలం, శ్రీనివాస కల్యాణం, మహానటి, చావు కబురు చల్లగా, అర్జున ఫల్గుణ, పాగల్ వంటి చిత్రాల్లో నటించాడు. తెరపై కనిపిస్తూ అందరినీ కడుపుబ్బా నవ్వించే అతడి జీవితంలో అనేక కష్టాలను ఎదుర్కున్నాడు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన గతంలో తాను పడ్డ కష్టాల గురించి చెప్పి కన్నీటి పర్యంతం అయ్యారు. ఆయనకు సినిమాల్లో గుర్తింపు రావడానికి చాలా కష్ట పడ్డానని.. ఈ సక్సెస్ ఒక్క రోజులో వచ్చిందని కాదని మహేశ్ వివరించాడు. తనకు చిన్నతనం నుంచి సినిమాలు అంటే పిచ్చి అని చెప్పుకొచ్చాడు.

Jabardasth telugu comedian mahesh about his sad situations

అంత్యక్రియలు చేసేందుకు డబ్బులు లేక: ఎప్పటికైనా సినిమాల్లో నటించాలనే కోరికతోనే హైదరాబాద్ కు వచ్చినట్లు చెప్పాడు. సినిమాలను నమ్ముకొని.. జీరోతో తన ప్రయాణాన్ని మొదలు పెట్టినట్లు స్పష్టం చేశాడు. తాను సినిమాల్లో ఛాన్సుల కోసం ప్రయత్నిస్తున్నప్పుడే తన తండ్రి చనిపోయాడని గుర్తు చేసుకున్నాడు. కన్నీళ్లు పెట్టుకుంటూ ఆ సమయంలో ఆయన అంత్యక్రియలు చేసేందుకు కూడా తన దగ్గర డబ్బులు లేవని ఎమోషనల్ అయ్యారు.

Jabardasth telugu comedian mahesh about his sad situations

ఆ ఘటన తరువాత అందరూ తిట్టారు: ఈ సంఘటన తర్వాత సినిమాలు అవసరమా అని ఆయన బంధువులంతా నన్ను తిట్టారని వివరించారు. అప్పుడు తాను చాలా బాధ పడ్డానంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. సినిమాల కోసం హైదరాబాద్ వచ్చిన తనను జబర్దస్త్ షోకి షకలక శంకర్ పరిచయం చేశారని గుర్తు చేశారు. ఓ సైడ్ రోల్ తో కెరియర్ ప్రారంభించిన తాను అతి తక్కువ కాలంలోనే టీమ్ లీడర్ గా ఎదిగానని అన్నారు.

Jabardasth telugu comedian mahesh about his sad situations

ఈ మధ్యే ఇల్లు కూడా కట్టుకున్నా: ఆ తర్వాత సుకుమార్ గారి చుట్టూ తిరిగితే 2017లో రంగస్థలం సినిమాలో ఛాన్స్ ఇచ్చారని మహేష్ చెప్పాడు. ఇన్నేళ్లు ఆగిన ఆ పాత్ర తనకు చాలా మంచి పేరు తెచ్చిపెట్టిందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇంతకు ముందు తనకు సొంత ఇల్లు కూడా లేదని.

ఈ మధ్యే ఇల్లు కూడా కట్టుకున్నానని మహేష్ వివరించాడు. ఒకప్పుడు చాలా కష్టాలు అనుభవించిన మహేష్ కష్టానికి ప్రతిఫలం దక్కింది. ఇప్పుడు చేతినిండా పనితో హ్యాపీ లైఫ్ ను లీడ్ చేస్తున్నాడు. కరోనా సమయంలోనే మహేష్ పెళ్లి చేసుకున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X