జబర్దస్త్‌లో స్టార్ కమెడియన్.. అదరగొట్టిన అనసూయ.. మరింత డోసు పెంచి!
లాక్‌డౌన్ తర్వాత బుల్లితెరపై వినోదాన్ని పంచడానికి జబర్దస్త్ కామెడీ షో సిద్ధమైంది. తాజాగా జరిపిన షూటింగుకు సంబంధించిన ప్రోమోను నిర్వహకులు విడుదల చేశారు. ఎప్పటిలానే యాంకర్ అనసూయ ప్రోమోతోనే హల్‌చల్ మొదలుపెట్టారు. తాజాగా ఓ స్టార్ కమెడియన్ జబర్దస్త్‌లోకి ఎంట్రీ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. ప్రోమోలో ఇంట్రెస్టింగ్ విషయాలు ఏమిటంటే..

ఆరు టీమ్స్.. వన్ ఓన్లీ అనసూయ
అనసూయ తన జబర్దస్త్ గురించి మరోసారి పరిచయం చేస్తూ ఆరు టీమ్స్, ఐదుగురు కంటెస్టెంట్స్ సపోర్ట్, నలుగురిని నవ్వించే పంచులు, ఎలాంటి పరిస్థితుల్లోనైనా రూట్ మారే ప్రస్తకిలేదు అంటూ ఇద్దరు జడ్జీలు, ఒకే ఒక యాంకర్ అంటూ వన్ ఓన్లీ కామెడీ షో జబర్దస్త్ .. ఖతర్నాక్ కామెడీ షో అంటూ ప్రోమోను అదరగొట్టింది.

హైపర్ ఆది, అభి, రాఘవ స్కిట్స్
హైపర్ ఆది టీమ్ కామెడీ ఎలా ఉంటుందనే విషయాన్ని చెప్పడానికి శాంపిల్‌గా చిన్న ఝలక్ ఇచ్చింది. అలాగే అభి, రాకెట్ రాఘవ అదరగొట్టేలా స్కిట్స్ ప్లాన్ చేసుకొన్నారు. లాక్‌డౌన్ తర్వాత ప్రతీ స్కిట్‌లోను మాటలు తూటాల్లా పేలే విధంగా షోను డిజైన్ చేసుకొన్నట్టు కనిపిస్తున్నది. గ్యాప్ తర్వాత వస్తున్న క్రమంలో మంచి ఎనర్జీ కూడా కనిపించింది.

మనోతోపాటు రోజా
జబర్దస్త్ నుంచి నాగబాబు వెళ్లిపోయిన తర్వాత ఆయన స్థానంలో గాయకుడు మనో ఎంట్రీ ఇచ్చారు. ఎప్పటి మాదిరిగానే రోజా హోస్ట్‌గా కంటిన్యూ అవుతున్నది. ఇలా కొంత రొటీన్‌గా కనిపించినప్పటికీ అసలు షో చూస్తే సరికొత్తగా ఏముంటుందనే విషయం స్పష్టమవుుతుంది.

జబర్దస్త్ స్టేజ్ ఎక్కితే గర్వం
జబర్దస్త్‌లో ఎంట్రీ గురించి తాగుబోతు రమేష్ ఎంట్రీ ఇస్తూ.. ఒక క్రికెటర్‌కు వరల్డ్ కప్ ఆడితే గర్వం.. ఒక పొలిటిషియ్‌కు సీఎం కుర్చీ ఎక్కితే గర్వం.. ఒక కమెడియన్‌కు జబర్దస్త్ స్టేజ్ ఎక్కితే గర్వం అంటూ పంచ్ పేల్చాడు. ఇంకా తన స్కిట్‌లో తాగుబోతు రమేష్ అదరగొట్టే పంచులతో ఆకట్టుకొన్నారు.
Recommended Video

జూన్ 25న మళ్లీ
ఇక ఇప్పటి వరకు బుల్లితెరపై జబర్దస్త్‌దే అధిపత్యం. కానీ నాగబాబు వెళ్లి అదిరింది షో ప్రారంభించిన తర్వాత ఈ షోకు కాస్త పోటీ కనిపిస్తున్నది. ఇలాంటి నేపథ్యంలో జబర్దస్త్‌ను పోటీ తగినట్టుగా ఎలా మార్చారో వేచి చూడాల్సిందే. ఇక షో జూన్ 25వ తేదీన ప్రసారం కానున్నట్టు తెలుస్తున్నది.


Click it and Unblock the Notifications











