షాకింగ్: జబర్ధస్త్ నుంచి మరో ఇద్దరు ఔట్.. అందుకే ఈ వ్యవహారం బయటకు రాలేదా.?

By Manoj

తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న షోలలో 'జబర్ధస్త్'కు ప్రత్యేకమైన స్థానం ఉంది. దీనికి కారణం ఆ షోకు ఉన్న రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రేక్షకుల్లో పాపులారిటీనే. దాదాపు ఏడేళ్లుగా విజయవంతంగా ప్రదర్శితమవుతోన్న ఈ కామెడీ షో వల్ల ఎంతో మంది ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. దీనికి పోటీగా ఎన్నో షోలు వస్తున్నప్పటికీ ట్రెండ్‌కు తగ్గట్లు మార్పులు చేసుకుంటూ వెళ్తూ యూనిట్ సక్సెస్ అవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో జబర్ధస్త్ షో నుంచి ఇద్దరు బయటకు వెళ్లిపోయారు. అయితే, ఈ సీక్రెట్ రివీల్ కాకపోడానికి ఓ కారణం ఉందట. ఆ వివరాలు మీకోసం.!

వాళ్లతో పాటు ఆ ఇద్దరికీ కలిసొచ్చింది

వాళ్లతో పాటు ఆ ఇద్దరికీ కలిసొచ్చింది

జబర్ధస్త్ షో టాలెంట్ ఉన్న వారందరికీ ఓ మంచి ఫ్లాట్‌ఫాంలా మారింది. అందుకే ఈ షో వల్ల ఎంతో మంది ఆర్టిస్టులు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఇప్పుడు వాళ్లంతా సెలెబ్రిటీ హోదాను అనుభవిస్తున్నారు. వాళ్లతో పాటు దీనికి జడ్జ్‌లుగా వ్యవహరించిన సీనియర్ హీరోయిన్ రోజా, మెగా బ్రదర్ నాగేంద్రబాబు (నాగబాబు)కు కూడా బాగా కలిసొచ్చింది.

అందులో కొట్టేదే లేదు.. అందుకే టాప్‌

అందులో కొట్టేదే లేదు.. అందుకే టాప్‌

టీఆర్పీ రేటింగ్ విషయంలో జబర్ధస్త్‌ను కొట్టేదే లేదన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీనికి పోటీగా ఎన్నో కామెడీ షోలు వస్తున్నప్పటికీ.. అవేమీ దరిదాపుల్లోకి కూడా రావడం లేదు. అందుకే వారంలో రెండు రోజులు ప్రసారం అవుతున్న జబర్ధస్త్‌కే టాప్ రేటింగ్ వస్తోంది. ఇక, యూట్యూబ్‌లో కూడా ఈ స్కిట్లకు భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తుందన్న విషయం తెలిసిందే.

జబర్ధస్త్‌ షోలో ఊహించని పరిణామం

జబర్ధస్త్‌ షోలో ఊహించని పరిణామం

జబర్ధస్త్ షో ప్రారంభం అయినప్పటి నుంచి నాగబాబు దానికి జడ్జ్‌గా వ్యవహరించారు. ఆయన వల్ల కూడా షోకు మంచి పేరు వచ్చింది. అలాంటి వ్యక్తి... కొద్ది రోజుల క్రితం జబర్ధస్త్‌కు గుడ్‌బై చెప్పారు. అంతేకాదు, ఆయనతో పాటు డైరెక్టర్లు నితిన్, భరత్ కూడా బయటకు వెళ్లిపోయారు. వీళ్ల వెంటే చమ్మక్ చంద్ర, కిర్రాక్ ఆర్పీ సహా పలువురు ఆర్టిస్టులు బ్యాగులు సర్దేశారు.

అదిరిపోయే ప్లాన్ వేసిన నాగబాబు

అదిరిపోయే ప్లాన్ వేసిన నాగబాబు


చాలా కాలం పాటు జబర్ధస్త్‌ను ముందుండి నడిపించిన నాగబాబు.. ఆ షోకు గుడ్‌బై చెప్పిన వెంటనే మరో చానెల్‌లోకి జంప్ అయ్యారు. ఈ క్రమంలోనే ‘అదిరింది' అనే షోను ప్రారంభించారు. మొన్నటి వరకు జబర్ధస్త్‌కు డైరెక్టర్లుగా ఉన్న నితిన్, భరత్ నడిపిస్తుండగా.. చమ్మక్ చంద్ర, కిర్రాక్ ఆర్పీ, ధనరాజ్, వేణు, సద్దాంలు టీమ్ లీడర్లుగా వ్యవహరిస్తున్నారు.

జబర్ధస్త్ నుంచి మరో ఇద్దరు ఔట్

జబర్ధస్త్ నుంచి మరో ఇద్దరు ఔట్

నాగబాబు కారణంగా జబర్ధస్త్ నుంచి చాలా మంది వెళ్లిపోయిన విషయం తెలిసిందే. తాజాగా మరో ఇద్దరు కమెడియన్లు కూడా ఆ షో నుంచి బయటకు వెళ్లిపోయారట. అయితే, వీళ్లు జబర్ధస్త్‌కు గుడ్‌బై చెప్పలేదు.. నిర్వహకులే వాళ్లను తప్పించారు. ఇప్పటికే వాళ్లెవరో మీకు అర్థమై ఉంటుంది. వాళ్లే... కొద్ది రోజుల క్రితం వ్యభిచారం చేస్తూ దొరికిన దొరబాబు, పరదేశీ.

Recommended Video

Jabardasth Comedy Show Management New Rules To Comedians
అందుకే ఈ వ్యవహారం బయటకు రాలేదా.?

అందుకే ఈ వ్యవహారం బయటకు రాలేదా.?


వాస్తవానికి ఈ కేసు జరిగిన సమయంలో వాళ్లిద్దరిని షోను తప్పించారని తాజాగా ఓ న్యూస్ లీక్ అయింది. అయితే, ఆ తర్వాత మరో షెడ్యూల్ జరగకపోవడం.. అంతలో కరోనా కారణంగా షూటింగులు నిలిచిపోవడంతో ఆ విషయం బయటకు రాలేదని అంటున్నారు. దొరబాబు, పరదేశీ ఇద్దరూ హైపర్ ఆది టీమ్‌లో సభ్యులుగా పని చేసిన సంగతి విధితమే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X