ఆ యాంకర్‌ను నరికేస్తా... జబర్తస్త్ కమెడియన్ స్ట్రాంగ్ వార్నింగ్
తెలుగు ప్రేక్షకులకు దాదాపు 12 ఏళ్లుగా వినోదాన్ని పంచుతోంది జబర్దస్త్ షో. ఎప్పటిలాగే ఈ వారం కూడా మరికొన్ని ప్రత్యేకతలతో రెడీ అయ్యింది. వాలంటైన్స్ డేను పురస్కరించుకుని జబర్దస్త్‌లో స్పెషల్‌గా సిద్దమైంది. దీనికి సంబంధించిన ప్రోమోను ఈటీవీ విడుదల చేసింది. మరి ఈ వారం ఎవరెవరు ఎలాంటి స్కిట్లు వేశారు? ఎవరి స్కిట్ గురించి జనం ఏమనుకుంటున్నారు? అసలు ప్రోమోలో హైలైట్‌గా నిలిచింది? ఏం పంచ్‌లు ఎలా పేలాయి? ఈ వివరాల్లోకి వెళితే..
కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ వారం కొత్త వారికి జబర్దస్త్ స్వాగతం పలికింది. స్టార్టింగ్ స్కిట్ వారితోనే జరిగినట్లుగ తెలుస్తోంది. భార్యాభర్తలు, కుటుంబ గొడవల కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ స్కిట్‌లో ఓ అమ్మాయి.. తన భర్త దగ్గరికి వెళ్లి పంచాయతీకి పెద్ద మనుషుల్ని పిలిచినా, వెళ్లి మీ అన్నావదినలకు చెప్పు అని భర్తతో అంటుంది. అతను నెమ్మదిగా పిలవడంతో ఇంకొంచెం మెల్లగా పిలువు, కడుపులోని బిడ్డ కిందకి జారుతుందని సెటైర్లు వేస్తుంది. ఆ వెంటనే ఓ బర్రే దానా, ఓ బద్మాష్ దానా రావే బయటికి అంటూ భర్త వద్దంటున్నా వినిపించుకోకుండా కేకలు పెడుతుంది. దాంతో మరో ఇంట్లో నుంచి ఓ అమ్మాయి బయటికొచ్చి.. బండదానా అని పిలుస్తున్నావేంటీ? లోపల ఉన్నప్పుడ కాదు.. వాకిట్లోకి వచ్చినాంక మాట్లాడు అంటూ వార్నింగ్ ఇస్తుంది. ఇంతలో అన్నయ్య బయటికొచ్చి అరేయ్ తమ్ముడు.. ఈ ఆడోళ్లు బాహుబలి సినిమాలో శివగామి లెక్క, వాళ్ల మాటే శాసనం అంటారు. మొగుళ్లు కనుక వాళ్ల మాట వినకపోతే మామూలుగా ఉండదని వార్నింగ్ ఇస్తాడు.

తర్వాత బుద్ధిమంతుడి గెటప్‌లో ఆటో రాంప్రసాద్ ఎంట్రీ ఇస్తాడు. నా పేరు సహాయం అండీ.. స్నానం చేయకుండా ఉంటాను కానీ, సహాయం చేయకుండా మాత్రం ఉండలేను. ఐ లవ్ కాఫీ అని భార్య ఇచ్చిన కాఫీ తాగుతాడు. ఆ కాఫీ నేనైతే ఏం చేస్తారని భార్య అడగ్గా.. ఒంపేస్తానని కింద పోసేస్తాడు రాంప్రసాద్. ఇంతలో ఆ ఇంటికి బిచ్చగాడు రాగా.. 100 రూపాయలు వేసి నీకు సాయం చేసేశాను కదా, మరి నువ్వు తిరిగి సాయం చేయాలి కదా అని అంటాడు రాంప్రసాద్. ఈ బిచ్చగాడిని తీసుకెళ్లి బట్టలు ఉతికించు, ఇల్లు కడిగించు అని చెబుతాడు. దాంతో బిచ్చగాడు షాక్ అవుతాడు.
ఆ వెంటనే రౌడీ రోహిణి - రాకింగ్ రాకేష్‌లు ఫేమస్ షారుఖ్ ఖాన్ - కాజోల్ ట్రైన్ స్కిట్ చేస్తారు. మీ పేరు ఏంటీ అని రాకేష్ అడగ్గా.. మీనం పాకం అని చెబుతుంది రోహిణి. నా పేరు మీనమ్మ ముద్దుపేరు.. పాకం నాకు ఇష్టమైనది, రోహిణి నా నక్షత్రం, అయ్యంగారి బేకరిలో కేకులు ఉమ్మా అని అంటుంది రోహిణి. ఇంతలో టీ అమ్మేవాడు రావడంతో మీరేమైనా టీ తాగుతారా అని రాకేష్ అడుగుతాడు. ఎనకు టీ అలవాటే ఇల్లే.. కాఫీ మింగుతానని చెప్పి సౌండ్ వచ్చేలా తాగడంతో అంతా నవ్వేస్తారు.
తర్వాత బుల్లెట్ భాస్కర్ వచ్చి.. నాకు పెళ్లి కాకుండా, పెళ్లి అయ్యిందని నిరూపించడానికి ఏదైనా మార్గం ఉందా అని అసిస్టెంట్‌ని అడుగుతాడు. ఛాట్‌జీపీటీలో మీ ఫోటో పెడితే ఎవరితో కావాలంటే వాళ్లతో ఫోటో దిగినట్లుగా వస్తుంది. మీకు పెళ్లి జరిగినట్లు కూడా వస్తుందని చెప్పడంతో అసిస్టెంట్ ఫైమాతో భాస్కర్ పెళ్లి జరిగినట్లు కటౌట్‌లు తీసుకొస్తాడు. అది చూసిన భాస్కర్.. ఎవర్రా ఇది గ్రహంతరవాసిలా ఉందని షాక్ అవుతాడు. ఇంతలో పొట్టి నరేష్ తల్లి గెటప్‌లో ఫైమాతో నీ పెళ్లి జరిగినట్లు సోషల్ మీడియాలో పెట్టడం వల్ల దాని పెళ్లి ఆగిపోయిందని చెప్పడంతో భాస్కర్ షాక్ అవుతాడు. నేను చచ్చిపోతానని పొట్టి నరేష్ అంటుండగా అంతా ఆపుతారు.
మరో స్కిట్‌లో పొకిరి పండు అండ్ టీమ్ అదరగొట్టేసినట్లుగా కనిపిస్తోంది. సిటీ నుంచి రాయలసీమ ప్రాంతానికి వచ్చిన కొడుకు తన తండ్రిని హౌ ఆర్ యూ అని పిలవగా.. ఏందిరా ఔలే అంటున్నాడని అంటున్నాడని చిన్న కొడుకు చెబుతాడు. ఇంగ్లీష్‌లో హౌ ఆర్ యూ అంటే తిన్నావా అని పండు చెబుతుండగా.. పొట్టి కంటెస్టెంట్ వచ్చి వీడి దుంప తెగ అని పంచ్ విసురుతాడు. ఇంతలో తలుపుకొట్టి ఎవరు లోపల అని పండు పిలవగా.. ఎవరైతే నీకెందుకు రా అని లేడీ గెటప్‌లో ఉన్న అబ్బాయి మీద మీదకి వస్తాడు. రష్మీ నా అందం చూసి కుళ్లుకుంటోందని చెప్పడంతో.. నరికేయమంటావా అని అడుగుతాడు ఆమె భర్త. కాళ్లు నొప్పిగా ఉన్నాయని చెప్పడంతో నరికేయమంటావా అని పెళ్లాన్ని అడగటంతో అంతా నవ్వేస్తారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా... మరి ఆటో రాంప్రసాద్ సాయం చేసిన బిచ్చగాడు ఏం చేశాడు? బుల్లెట్ భాస్కర్‌కు ఫైమా బుద్ధి చెప్పిందా? రాయలసీమలో ఏం జరిగిందో తెలియాలంటే ఫిబ్రవరి 13, 14 తేదీలో ప్రసారమయ్యే జబర్దస్త్ ఫుల్ ఎపిసోడ్ చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











