పెళ్లికి ముందే గుడ్ న్యూస్ చెప్పిన జబర్దస్త్ వర్ష, ఇమ్మానుయేల్.. షాక్‌లో ఫ్యాన్స్!

జబర్దస్త్ షో గురించి అందులో పాల్గొంటున్న కమెడియన్ల గురించి బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అసరం లేదు. అద్భుతమైన కామెడీతో అందరినీ కడుపుబ్బా నవ్వించే ఈ షోలోని కమెడియన్లు అందరికీ పెద్ద ఎత్తున గుర్తింపు వచ్చింది. చిన్న పాటి సెలబ్రిటీలుగా మారిపోయిన వీళ్లకు రెండు తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఈ షో ద్వారా పాపులర్ అయిన వాళ్లు చాలా ఎక్కువే. అలాంటి వాళ్లలోనే ఇమ్మానుయేల్, వర్ష జంట ఒకటి. అయితే చాలా కాలంగా తమ మధ్య ప్రేమ ఉన్నట్లు చెబుతున్న వీళ్లు పెళ్లికి ముందే గుడ్ న్యూస్ చెప్పారు. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

జబర్దస్త్ షో ద్వారా లవ్ ట్రాక్ చేసి విపరీతమైన పాపులారిటీ తెచ్చుకున్న కమెడియన్లు.. వర్ష, ఇమ్మానుయేల్ గురించి అందరికీ తెలిసిందే. అయితే వీరిద్దరి మధ్య లవ్ ట్రాక్ బాగా పండగా.. వీరి జంటకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. దీంతో వాళ్లు కూడా ఈ ట్రాక్ ను కొనసాగిస్తూ షోలు చేస్తున్నారు. అయితే ఇటీవలే వీరిద్దరూ యాంకర్లుగా మారి ప్రేమ కావాలి అనే షో చేస్తున్నారు. ఒక్కో ఎపిసోడ్ లో ఒక్కో గెస్టులను తీసుకు వస్తూ తెగ సందడి చేస్తున్నారు.

Jabardasth varsha And Immanuel Says Good News to Fans Check Details

ఇలా కెరియర్ లో దూసుకు వెళ్తున్న ఈ జంట తాజాగా ఎక్స్ ట్రా జబర్దస్త్ షోలో ఓ స్కిట్ చేసింది. అయితే ముందుగా స్టేజీ మీదకు వచ్చిన వీళ్లు అందరికీ గుడ్ న్యూస్ చెప్పారు. ఇదే విషయాన్ని ముందుగా యాంకర్ రష్మికి పిలిచి చెప్పగా.. నా దగ్గర కూడా కొన్ని టిప్స్ తీసుకోండి అని వివరించింది. అంతేకాకుండా నా ఆశీర్వాదం తీసుకోండి అంటూ ఆశీర్వదించింది. ఇక ఆ తర్వాత వర్ష, ఇమ్మానుయేల్ కలిసి ఇదే విషయాన్ని రాకింగ్ రాకేష్ కు చెప్పేందుకు వెళ్లారు.

వెళ్లే సరికి రాకేష్ బట్టలు ఆరేస్తూ కనిపించగా.. ఓ గుడ్ న్యూస్ అన్నయ్యా అని ఇమ్ము, మీకో గుడ్ న్యూస్ చెప్పాలని వర్ష అంటారు. పెళ్లి అయినా మేమే ఇప్పటి వరకు ఎలాంటి గుడ్ న్యూస్ చెప్పలేదు.. పెళ్లికి ముందే మీరు గుడ్ న్యూస్ చెప్పేస్తున్నారా కంగ్రాట్స్ అంటూ వివరిస్తాడు. ఇదంతా విన్న అందరూ ఫుల్ గా నవ్వుతారు. అప్పుడే వర్ష, ఇమ్ములు క్లారిటీ ఇచ్చారు. మేము చెప్పబోయేది, మీరు అనుకుంటున్నది వేరు అని అనగానే.. మరేంటి అంటాడు రాకేష్.

అప్పుడే ఇమ్మానుయేల్.. నేను టీం లీడర్ అయ్యాను అన్నాయ్యా అంటూ వివరిస్తాడు. ఓ కంగ్రాట్స్ అని చెప్పగా.. అదే విషయాన్ని వదిన సుజాతకు కూడా చెబుతామంటూ చెప్పుకొస్తారు. వెంటనే వదినా వదినా అని పిలిచి మరీ ఆమెకు ఈ విషయం గురించి వివరిస్తారు. బాగా కామెడీ చేసి అందరినీ బాగా నవ్వించండి అంటుంది. మరి ఇంతకాలం నాకు చెప్పేలేదేందే ఈ విషయం అంటూ రాకేష్ అనగానే.. చేసే వాళ్లకు చెప్పొచ్చు, మీకు ఎందుకు అంటూ పంచ్ వేస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X