For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నడిరోడ్డుపై జబర్ధస్త్ వర్ష హల్‌చల్: ప్రేమించమంటూ వెంట పడుతూ.. మరీ ఇంత ఘోరంగానా!

  |

  ఈ మధ్య కాలంలోనే తెలుగు బుల్లితెరపైకి ఎంతో మంది అమ్మాయిలు ఆర్టిస్టులుగా ఎంట్రీ ఇచ్చారు. దీనికి కారణం గతంతో పోలిస్తే ఇప్పుడు అవకాశాలు ఎక్కువగా దొరుకుతుండడమే. అంతేకాదు, సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎంతో మంది తమ అందం, అభినయంతో ఫాలోయింగ్‌ను పెంచుకుంటున్నారు. ఇలా పలు షోల ద్వారా మినీ స్క్రీన్ మీదకు ఎంట్రీ ఇస్తున్నారు. ఇలా వచ్చి చాలా తక్కువ కాలంలోనే పాపులర్ అయిన వారిలో జబర్ధస్త్ బ్యూటీ వర్ష ఒకరు.

  అందంతో మాయ చేస్తోన్న ఈ అమ్మడు.. ఇప్పుడు చేతి నిండా షోలతో ఫుల్ బిజీగా గడుపుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా వర్ష హైదరాబాద్‌ రోడ్లపై హల్‌చల్ చేసింది. ప్రేమించమంటూ వెంట పడుతూ ఇబ్బంది పెట్టేసింది. దీనికి సంబంధించిన వీడియోపై మీరూ కూడా ఓ లుక్కేయండి మరి!

  అలా మొదలైన కెరీర్.. ఇలా పాపులర్

  అలా మొదలైన కెరీర్.. ఇలా పాపులర్

  సినిమాల్లోకి ప్రవేశించాలన్న లక్ష్యంతో హైదరాబాద్‌లో అడుగు పెట్టి.. ముందుగా మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది తెలుగు అమ్మాయి వర్ష. ఈ క్రమంలోనే చాలా కాలం పాటు ఆ రంగంలో తన అందచందాలతో సత్తా చాటింది. ఆ తర్వాత సీరియల్ దర్శక నిర్మాతల దృష్టిలో పడడంతో బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలోనే ‘అభిషేకం', ‘తూర్పు పడమర', ‘ప్రేమ ఎంత మధురం' వంటి సీరియళ్లలో మంచి మంచి పాత్రలను చేస్తోంది. వీటిలో అందంతో పాటు యాక్టింగ్‌లోనూ రాణిస్తూ సత్తా చాటుతోంది. తద్వారా మరిన్ని అవకాశాలను అందిపుచ్చుకుంటూ దూసుకుపోతోంది.

  Happy Birthday Nagarjuna: తెలుగులో ఆ రికార్డు నాగార్జునదే.. సినీ చరిత్రలోనే అరుదైన ఘనత సొంతం

  మామూలుగా ఎంట్రీ... జబర్ధస్త్‌గా కెరీర్

  మామూలుగా ఎంట్రీ... జబర్ధస్త్‌గా కెరీర్

  దాదాపు తొమ్మిదేళ్లుగా బుల్లితెరపై హవాను చూపిస్తూ నెంబర్ వన్ షోగా వెలుగొందుతోంది జబర్ధస్త్. ఈ షో ద్వారా ఎంతో మంది తమ టాలెంట్లను బయట పెట్టుకున్నారు. కానీ, ఈ షో చరిత్రలో ఆడవాళ్లు ఆర్టిస్టులుగా వచ్చిన దాఖలాలు లేవు. ఇలాంటి పరిస్థితుల్లో వర్ష మాత్రం ఈ షోలో పర్మినెంట్ ఆర్టిస్టుగా మారిపోయింది. టాప్ టీమ్ లీడర్ హైపర్ ఆది తరచూ ఎవరో ఒక అమ్మాయిని తన టీమ్‌లోకి తీసుకొస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే వర్షను తీసుకుని వచ్చాడు. ఆరంభంలోనే ఆకట్టుకున్న ఈ బ్యూటీ.. అప్పటి నుంచి షోలో కొనసాగుతూ తన టైమింగ్‌తో అందరినీ అలరిస్తోంది.

  అన్నింట్లోనూ సందడి చేస్తోన్న బ్యూటీ

  అన్నింట్లోనూ సందడి చేస్తోన్న బ్యూటీ

  ఆకట్టుకునే అందం.. అద్భుతమైన నటనతో వర్ష చాలా తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును సంపాదించుకుంది. కామెడీ షోకు కావాల్సిన టైమింగ్ కూడా పుష్కలంగా ఉండడంతో ఈ బ్యూటీ వెనుదిరిగి చూడకుండా దూసుకుపోతోంది. అదే సమయంలో తెలుగు రాష్ట్రాల్లో ఎనలేని క్రేజ్‌ను సొంతం చేసుకుంది. ఫలితంగా ఇందులో వరుసగా స్కిట్లు చేస్తూ మెప్పిస్తోంది. అలాగే, పలు స్పెషల్ ఈవెంట్లలోనూ విపరీతంగా సందడి చేస్తోంది. వీటితో పాటు అదే ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న ‘శ్రీదేవీ డ్రామా కంపెనీ' అనే షోలోనూ భాగమైంది. అంతేకాదు, మరిన్ని షోలకూ గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది.

  ఘాటు ఫోజులతో రెచ్చిపోయిన సుస్మితా సేన్: 45 ఏళ్ల వయసులో మరీ ఇంత దారుణంగానా!

  అతడితో లవ్ ట్రాకుతో మరింత ఫేమస్

  అతడితో లవ్ ట్రాకుతో మరింత ఫేమస్

  స్క్రీన్ మీద కనిపించిన నాటి నుంచే తన అందంతో కుర్రాళ్ల గుండెళ్లో గాయాలు చేసిన వర్ష.. అనతి కాలంలోనే ఊహించని రీతిలో ఫేమస్ అయిపోయింది. అదే సమయంలో యంగ్ కమెడియన్ ఇమాన్యూయేల్‌తో లవ్ ట్రాక్ వల్ల మరింత పాపులర్ అయింది. అతడితో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ చేసే స్కిట్ల వల్లే భారీ స్థాయిలో క్రేజ్ వచ్చింది. ఇక, తరచూ అతడితో హగ్గులు, ముద్దులతో రెచ్చిపోతూ హాట్ టాపిక్ అయిపోయింది. ఇక, కొద్ది రోజుల క్రితం వీళ్లిద్దరికీ పెళ్లి జరిగినట్లు కూడా చూపించారు. అంతకు ముందు దీన్ని హైలైట్ చేయడానికి ఎంగేజ్‌మెంట్ అయినట్లు చెప్పింది.

  వాళ్లతో కలిసి వినాయక చవితి చేస్తూ

  వాళ్లతో కలిసి వినాయక చవితి చేస్తూ

  ఈ మధ్య కాలంలో బుల్లితెరపై మల్లెమాల వాళ్లు నిర్వహించే ఏ కార్యక్రమం అయినా.. స్పెషల్ ఈవెంట్ అయినా జబర్ధస్త్ వర్ష కచ్చితంగా భాగం అవుతోంది. ఇప్పటికే ఎన్నో షోలలో స్పెషల్ అట్రాక్షన్ అయిన ఈ బ్యూటీ.. ఇప్పుడు వినాయక చవితి స్పెషల్‌గా చేసిన ‘ఊరిలో వినాయకుడు' అనే ఈవెంట్‌లోనూ పాల్గొంది. ఇందులో సీనియర్ హీరోయిన్లు రోజా, ఇంద్రజ రెండు టీమ్‌లుగా ఏర్పడి పోటీ పడ్డారు. వీళ్లతో పాటు జబర్ధస్త్ కమెడియన్లు, ఢీ షోకు సంబంధించిన డ్యాన్సర్లు, సోషల్ మీడియా సెలెబ్రిటీలు ఇలా ఎంతో మంది భాగం అయ్యారు. దీన్ని సుధీర్, రష్మీ హోస్ట్ చేస్తున్నారు.

  సుడిగాలి సుధీర్ రెమ్యూనరేషన్ లీక్: ఏ షోకు ఎంత వస్తుందంటే.. వామ్మో నెలకే అంత ఆదాయమా!

  ఎవరికి ఎక్కువ హగ్గులు వస్తాయంటూ

  ఎవరికి ఎక్కువ హగ్గులు వస్తాయంటూ

  వినాయక చవితి స్పెషల్‌గా చేసిన ‘ఊరిలో వినాయకుడు' ఈవెంట్‌లో భాగంగా ఒక టీమ్ మరో టీమ్‌లోని సభ్యులకు ఏదైనా రియల్ టాస్క్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇందులో భాగంగానే హైపర్ ఆది, ఆటో రాంప్రసాద్ హైదరాబాద్‌లోని ఓ షాపింగ్ మాల్‌కు వెళ్లి ఆడవాళ్లతో హగ్స్ తీసుకోవాలి. ఇలా ఎవరికి ఎక్కువ కౌగిలింతలు వస్తాయో.. వాళ్లే ఈ టాస్క్ విజేతలు. అందుకు అనుగుణంగానే ఇద్దరూ ఓ మాల్‌లో సందడి చేశారు. ఇక, ఇందులో విజేత ఎవరో తెలియలేదు కానీ.. ఇది వచ్చినంత సేపు ఎంతో సరదాగా సాగింది. వీళ్లకు హగ్స్ ఇచ్చేందుకు అమ్మాయిలు పోటీ పడ్డారు.

  జబర్ధస్త్ వర్ష హల్‌చల్.. మరీ ఘోరంగా

  జబర్ధస్త్ వర్ష హల్‌చల్.. మరీ ఘోరంగా

  ఇదే ఈవెంట్‌లో భాగంగా ఆటో రాంప్రసాద్ వర్షకు ఓ టాస్క్ ఇచ్చాడు. దీని ప్రకారం.. ఆమె ఎవరూ గుర్తు పట్టని విధంగా రోడ్డు మీదకు వెళ్లి ఒక అబ్బాయికి ప్రపోజ్ చేసి.. అతడితో లవ్ యూ టూ అని చెప్పించుకోవాలి. ఈ టాస్క్‌కు సిద్ధం అని చెప్పిన వర్ష.. మరీ ఘోరంగా బెగ్గర్‌గా గెటప్ వేసుకుని రోడ్లపై హల్‌చల్ చేసింది. ఈ క్రమంలోనే ప్రేమించమంటూ ఎంతో మంది వెంట పడింది. చాలా మంది ఆమెను చూసే భయపడిపోయారు. దీంతో ఈ ఈవెంట్‌లోనే ఇది హైలైట్ టాస్క్ అయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో విపరీతంగా వైరల్ అవుతోంది.

  English summary
  Telugu Actress, Model Jabardasth Recently Participated in Oorilo Vinayakudu.. Vinayaka Chavithi Special Event. Became Beggar In This Show.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X