దేవుడా! మరో జన్మలో మనిషిగా పుట్టించకు.. ఈ ఫీల్డ్‌కు రావొద్దు, ఈ లైఫ్ వద్దు: జబర్దస్త్ వర్ష కంటతడి
వినోద రంగంలో ఎంతో మంది కమెడియన్లు రియాలిటీ షో ద్వారా పేరు, ప్రఖ్యాతులు సాధించారు. బుల్లితెరపై జబర్దస్త్ ద్వారా పాపులారిటీ సంపాదించిన వారిలో వర్ష ఒకరు. జబర్దస్త్ షో పేరునే తన ఇంటి పేరు పెట్టుకొని జబర్దస్ వర్ష అని పిలిపించుకొనే స్థాయికి ఎదిగారు. ఈ ఫీల్డ్‌లో జరిగే అవమానాలను కిస్సిక్ షోలో వెల్లడిస్తూ కన్నీరుమున్నీరైంది. ఆమె చెప్పిన బాధల విషయానికి వెళ్తే
ఒకనొక సమయంలో ఓ ఈవెంట్ పిలిచి డ్యాన్స్ పెర్ఫార్మ్ చేయాలన్నారు. దాంతో సరే అని సొంతంగా ఫ్లయిట్ టికెట్ వేసుకొని వెళ్లాను. ఆర్టిస్టులు అందరూ స్టేజ్‌పైనే కూర్చొబెట్టారు. నన్ను మాత్రం వెనుకనే కూర్చొబెట్టారు. అందరూ పెర్ఫార్మ్ చేస్తున్నారు. కానీ నన్ను పిలవలేదు. అంతలో ఓ ఆర్టిస్టు వచ్చి.. మేకప్ చేసుకొంటూ.. అద్దం పట్టుకోవాలని అన్నారు. దాంతో సరే అని గంటసేపు అద్దం పట్టుకొన్నాను. ఆ ఈవెంట్‌లో నన్ను అవమానించడానికే అక్కడికి పిలిచారని అర్ధమైంది. ఆ సమయంలో జబర్దస్త్‌లో అవకాశం రావడం, దాని ద్వారా నాకు పేరు రావడం, అందరికి తెలియడం సంతోషమేసింది. అందుకు వారికి నేను జీవితాంతం రుణపడి ఉంటాను అని అన్నారు.

నాకు ఉండే ఫ్రెండ్ సర్కిల్ వల్ల నేను చాలాసార్లు అవమానాలకు గురి అయ్యాను. నాకు తక్కువ సమయంలోనే నాకంటూ ఎక్కువగా పాపులారిటీ వచ్చింది. నా జీవితాన్ని చూసుకొంటే.. నేనుండే పరిస్థితులను పోల్చుకొంటే.. ఎక్కువ డబ్బు, పేరు వచ్చింది. ఒక సమయంలో నన్ను పొగడ్తలతో ముంచెత్తిన వారే.. మరో సమయంలో నా ముఖం మీదే చెడుగా మాట్లాడటం నాకు చాలా బాధేసింది. వారి బిహేవియర్‌ను తట్టుకోలేకపోయాను అని జబర్దస్త్ వర్ష చెప్పింది.
ఒక సమయంలో ఓ షో ద్వారా నాకు వచ్చిన పేరు చూసి అభినందించిన వారే.. ముఖం చాటేస్తున్నారు. అలాంటి రెండు రకాల బిహేవియర్ వల్ల నేను ఇబ్బంది పడ్డాను. ఆన్ స్క్రీన్ మీద చూసే ఆర్టిస్టులు వేరు. ఆఫ్ స్క్రీన్ ఆర్టిస్టులు వేరు. నేను కష్టాల్లో ఉన్నప్పుడు ఫోన్ చేస్తే ఒకరు కూడా లిఫ్ట్ చేయరు. నేను ప్రాబ్లెంలో ఉన్నానని చెబితే.. అవునా? మళ్లీ చేస్తాను అని కాల్ కట్ చేసి.. నా వెనుకాల బూతులు తిట్టే వారు అని వర్ష తెలిపింది.
రియాలిటీ షోలో నాపై పంచులు వేయడం, సెటైర్లు వేయడాన్ని నేను చాలా ఈజీగా తీసుకొనే దానిని. కానీ ఆఫ్ స్క్రీన్‌కు వచ్చే సరికి దానిని భలే తిట్టానుగా అని అనేవారు. రియాలిటీ షోలో ఏదైతే నాపై భాష వాడారో.. అది రియాలిటీలో నిజమని తెలిసినప్పుడు నేను తట్టుకోలేకపోయాను. ఛీ.. ఈ జీవితాన్ని ఎందుకు ఇచ్చావు దేవుడా? అని అడుగుతాను అని వర్ష తెలిపింది.
డబ్బు, పేరు ఉన్నా సుఖం లేదు అని ఒక్కోసారి అనిపిస్తుంది. నన్ను బిచ్చగాళ్ల ఇంట్లో పుట్టించిన బాగుండు అని అనుకొంటాను. ఈ లైఫ్ నాకు వద్దు. ఈ ఫీల్డ్‌కు ఎందుకు వచ్చాను.. ఈ ఫిల్డ్‌కు మళ్లీ రావొద్దు అనిపిస్తుంటుందని వర్ష కన్నీరు పెట్టుకొన్నారు. కొంతమంది నా చుట్టు పక్కల ఉన్న వాళ్లే నా ముందు ఒక రకంగా.. నా వెనుక ఒక రకంగా మాట్లాడుతారు. దేవుడా మళ్లీ జన్మంటూ ఉంటే..ఆడదానిగా పుట్టించ వద్దు..ఈ ఫీల్డ్‌కు తీసుకు రావొద్దని భగవంతుడికి మొక్కుతాను అని జబర్దస్త్ వర్ష చెప్పింది.


Click it and Unblock the Notifications











