For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  జబర్ధస్త్ వర్షకు ఊహించని ఎదురుదెబ్బ: రక్తం కారుతూ ఆస్పత్రి బెడ్‌పై.. ఆ ముగ్గురి వల్లే అంటూ!

  |

  తెలుగు బుల్లితెరపై కొంత కాలంగా ఎంతో మంది లోకల్ అమ్మాయిలు ఎంట్రీ ఇస్తున్నారు. వారిలో చాలా తక్కువ మంది మాత్రమే విశేషమైన గుర్తింపును సొంతం చేసుకుంటున్నారు. తద్వారా ఆఫర్ల మీద ఆఫర్లు అందుకుంటూ దూసుకుపోతున్నారు. అలాంటి వారిలో జబర్ధస్త్ బ్యూటీ వర్ష ఒకరు. మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించి.. ఆ తర్వాత బుల్లితెరపైకి వచ్చిందీ భామ. అందానికి అందం.. టాలెంట్‌కు టాలెంట్ ఉండడంతో సక్సెస్ అయింది. దీంతో ఇప్పుడు చేతి నిండా షోలు, సీరియళ్లు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా వర్షకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఆమె కుటుంబంలో ఒకరికి ప్రమాదం జరిగింది. అసలేమైంది? దానికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే...

  అలా వచ్చింది.. ఇలా పాపులర్

  అలా వచ్చింది.. ఇలా పాపులర్

  కెరీర్ ఆరంభంలో మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది తెలుగు అమ్మాయి వర్ష. ఈ క్రమంలోనే చాలా కాలం పాటు ఆ రంగంలో తన అందచందాలతో సత్తా చాటింది. ఆ తర్వాత సీరియల్ దర్శక నిర్మాతల దృష్టిలో పడడంతో బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలోనే ‘అభిషేకం', ‘తూర్పు పడమర', ‘ప్రేమ ఎంత మధురం' వంటి సీరియళ్లలో నటించి మెప్పించింది.

  Deepika Padukone: వింత డ్రెస్‌తో అందాల ఆరబోత.. మొన్న రొమాన్స్ ఇప్పుడు ఘోరంగా!

  జబర్ధస్త్ ఎంట్రీతో ఫుల్ ఫేమస్

  జబర్ధస్త్ ఎంట్రీతో ఫుల్ ఫేమస్

  దాదాపు తొమ్మిదేళ్లుగా బుల్లితెరపై హవాను చూపిస్తూ నెంబర్ వన్ షోగా వెలుగొందుతోంది జబర్ధస్త్. కానీ, ఈ షో చరిత్రలో ఆడవాళ్లు ఆర్టిస్టులుగా వచ్చిన దాఖలాలు లేవు. ఇలాంటి పరిస్థితుల్లో వర్ష మాత్రం ఈ షోలో పర్మినెంట్ ఆర్టిస్టుగా మారిపోయింది. టాప్ టీమ్ లీడర్ హైపర్ ఆది వర్షను తీసుకుని వచ్చాడు. ఆరంభంలోనే ఆకట్టుకున్న ఈ బ్యూటీ.. అప్పటి నుంచి షోలో కొనసాగుతోంది.

  అన్నింట్లోనూ ఉంటూ సందడి

  అన్నింట్లోనూ ఉంటూ సందడి

  అందంతో పాటు అద్భుతమైన నటనతో వర్ష చాలా తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును సంపాదించుకుంది. కామెడీ షోకు కావాల్సిన టైమింగ్ కూడా పుష్కలంగా ఉండడంతో ఈ బ్యూటీ వెనుదిరిగి చూడకుండా దూసుకుపోతోంది. దీంతో జబర్ధస్త్‌తో పాటు పలు స్పెషల్ ఈవెంట్లలోనూ విపరీతంగా సందడి చేస్తోంది. వీటితో పాటు ‘శ్రీదేవీ డ్రామా కంపెనీ' అనే షోలోనూ భాగమైంది.

  హాట్ షోలో బౌండరీ దాటిన సరయు: లోపలి అందాలన్నీ కనిపించేలా బిగ్ బాస్ బ్యూటీ రచ్చ

  అతడితో లవ్ ట్రాక్ మొదలెట్టి

  అతడితో లవ్ ట్రాక్ మొదలెట్టి

  జబర్ధస్త్ వర్ష.. యంగ్ కమెడియన్ ఇమాన్యూయేల్‌తో లవ్ ట్రాక్ వల్ల మరింత పాపులర్ అయింది. అతడితో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ చేసే స్కిట్ల వల్లే భారీ స్థాయిలో క్రేజ్ వచ్చింది. ఇక, తరచూ అతడితో హగ్గులు, ముద్దులతో రెచ్చిపోతూ హాట్ టాపిక్ అయిపోయింది. ఇక, కొద్ది రోజుల క్రితం వీళ్లిద్దరికీ పెళ్లి జరిగినట్లు కూడా చూపించారు. దీంతో అతడి జోడీగా హైలైట్ అయింది.

  అందులో అప్‌డేట్లు ఇస్తుంది

  అందులో అప్‌డేట్లు ఇస్తుంది

  కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నా.. జబర్ధస్త్ వర్ష సోషల్ మీడియాలో సైతం ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే నిత్యం తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. అదే సమయంలో ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. ఇలా నిత్యం ఫాలోవర్లతో సంభాషిస్తోంది. దీంతో ఈ అమ్మడు సోషల్ మీడియాలో సెన్సేషన్ అయిపోతోంది.

  మరోసారి రెచ్చిపోయిన యాంకర్ వర్షిణి: ముందు వెనుక మొత్తం చూపిస్తూ రచ్చ

  ప్రమాదానికి గురైన వర్ష బ్రదర్

  ప్రమాదానికి గురైన వర్ష బ్రదర్

  వరుసగా షోలు, సీరియళ్లు చేస్తూ కెరీర్ పరంగా యమ హ్యాపీగా ఉంది వర్ష. దీంతో రెట్టించిన ఉత్సాహంతో ప్రాజెక్టులను చేస్తూ ముందుకు సాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఈ అమ్మాయికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆమె సోదరుడు తాజాగా రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఈ విషయాన్ని వర్షనే స్వయంగా వెల్లడించింది. అలాగే, ఆ ఫొటోలను కూడా ఇన్‌స్టాలో షేర్ చేసింది.

  Recommended Video

  Varsha Bollamma, Anand Devarakonda Interview Part 3 | Middle Class Melodies
  ఆ ముగ్గురి వల్లే అంటూ పోస్ట్

  ఆ ముగ్గురి వల్లే అంటూ పోస్ట్

  తన బ్రదర్ యాక్సిడెంట్ ఫొటోలు షేర్ చేసిన వర్ష.. ‘అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా. మీరు డ్రైవ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ముగ్గురు నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయడం వల్ల నా బ్రదర్‌కు యాక్సిడెంట్ అయింది. కుటుంబమంతా బాధపడుతున్నాం. కాబట్టి అందరూ జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. దీనివల్ల అందరూ సంతోషంగా ఉంటారు. ఇప్పుడు నా బ్రదర్ బాగానే ఉన్నాడు' అని చెప్పింది.

  English summary
  Telugu Actress, Model Jabardasth Varsha Full Busy with Shows ans Serials. Now Her Brother Met with an Accident
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X