Don't Miss!
- News
కేసీఆర్ వర్సెస్ గవర్నర్ తమిళి సై; కేంద్రానికి నివేదిక; కేంద్రం సీరియస్ గా తీసుకుంటుందా?
- Lifestyle
ఉస్త్రాసనం క్యామెల్ పోజ్: నడుముకు బలం చేకూర్చి శరీరానికి శక్తినిస్తుంది
- Finance
world richest: ప్రపంచంలో అత్యంత ధనవంతులు వీళ్లే.. మరి అంబానీ, అదానీల స్థానమెంతో తెలుసా ?
- Sports
INDvsNZ : తొలి టీ20లో గిల్ ఆడతాడు.. పృథ్వీ షాకు ఛాన్స్ లేదు: హార్దిక్ పాండ్యా
- Automobiles
అప్డేటెడ్ హోండా యాక్టివా కొనేవారు తప్పకుండా తెలుసుకోవాల్సిన 5 విషయాలు
- Technology
Poco X5 Pro 5G ఇండియా లాంచ్ తేదీ మరియు ధర లీక్ అయింది! వివరాలు
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
ఆ ఒక్క మాటతో మొత్తం పరువుతీసేసింది.. ఇమాన్యుయేల్‌పై వర్ష కామెంట్స్
జబర్దస్త్ స్టేజ్ మీద నుంచి ఎంతో మంది వెలుగులోకి వచ్చారు. ఇప్పుడు స్టార్స్‌లా దూసుకుపోతోన్నారు. అయితే జబర్దస్త్ షోలో కొన్ని జంటలు బాగానే క్లిక్ అయ్యాయి. అన్నింట్లోకెల్లా రష్మీ సుధీర్ జోడి గురించే అందరూ చెప్పుకుంటారు.అయితే ఆ రేంజ్‌లో క్లిక్ జంట మరొక్కటి లేకుండాపోయింది. కానీ ఈ మధ్య వర్ష ఇమాన్యుయేల్ జోడి, ఆ జంట మధ్య ఉన్న కెమిస్ట్రీ కూడా బాగానే క్లిక్ అయింది. జబర్దస్త్ షోలో బాగానే వైరల్ అయిన ఈ జంట సోషల్ మీడియాలోనూ దుమ్ములేపుతోంది.

అలా ఫేమస్..
ఇమాన్యుయేల్ ఎప్పటి నుంచో జబర్దస్త్‌లో ఉన్నాడు.తనకంటూ ఓ ప్రత్యేక ముద్రను వేసుకున్నాడు. కానీ జనాలు అంతగా గుర్తించే వారు కాదు. కానీ వర్ష ఎంట్రీ ఇవ్వడం,ఈ ఇద్దరి మధ్య ఏదో ఉందని క్రియేట్ అయ్యేలా స్కిట్లు వేయడంతో ఇద్దరికిద్దరూ బాగా ట్రెండ్ అయ్యారు. కలర్ ఫోటో కాంబో అంటూ ఇద్దరూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్అయ్యారు.

ఆ మధ్య మరీ ఎక్కువ..
వర్ష ఇమాన్యుయేల్ మధ్య కెమిస్ట్రీ బాగానే క్లిక్ అవ్వడంతో నిత్యం అదే కాన్సెప్ట్‌తో స్కిట్లు వేసేవారు. మధ్యలో అది కాస్తా శ్రుతి మించడంతో దాన్ని ఆపేశారు. అయితే రోజా, జబర్దస్త్ టీం మాత్రం వర్ష ఇమాన్యుయేల్ జంటను బాగానే ప్రమోట్ చేసేందుకు తాపత్రయ పడుతున్నట్టు కనిపిస్తుంటుంది. స్కిట్లు మధ్యలో, స్కిట్లకు జడ్జ్ మెంట్ ఇచ్చే సమయంలో పదే పదే గుచ్చి గుచ్చి ఆ ట్రాకు గురించి అడుగుతుంటారు.

కొత్త షోలో అలా..
ప్రస్తుతం
వర్ష
ఇమాన్యుయలే
ఇద్దరూ
కూడా
కొత్త
షోతో
బిజీగా
ఉన్నారు.
శ్రీదేవీ
డ్రామా
కంపెనీ
అంటూ
కొత్తగా
ప్రారంభించిన
ఈ
షోలో
వర్ష
ఇమాన్యుయేల్
రొమాన్స్
కూడా
మరీ
ఎక్కువైనట్టు
కామెంట్లు
వినిపిస్తున్నాయి.
మొత్తానికి
ఈ
ఇద్దరూ
మాత్రం
జనాల
నోళ్లలో
బాగానే
నానుతున్నారు.
తాజాగా
వర్ష
ఇమాన్యుయేల్‌పై
ఓ
కామెంట్
చేసింది.

కేక్ తినడంపై..
తాజాగా వర్ష ఓ వీడియోను షేర్ చేసింది. అందులో ఇమాన్యుయేల్‌ను దారుణంగా ఆడుకుంది. ఎవరిదో బర్త్ డే అవుతుంటే.. ఇమాన్యుయల్, వర్షలు గెస్ట్‌లుగా వెళ్లినట్టున్నారు. అక్కడ ఇమాన్యుయేల్ కేక్ తింటుంటే వీడియో తీసింది. కేక్ తినడం అంటే.. కేక్ మీద పడి తినడం కాదంటూ ఇమాన్యుయేల్‌కు వర్ష కౌంటర్ వేసింది. ఇక వర్ష తీసిన వీడియోలో ఇమాన్యుయేల్ ఫుల్ కామెడీగా ఉండటంతో బాగా వైరల్ అవుతోంది.