For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ ఒక్క మాటతో మొత్తం పరువుతీసేసింది.. ఇమాన్యుయేల్‌పై వర్ష కామెంట్స్

    |

    జబర్దస్త్ స్టేజ్ మీద నుంచి ఎంతో మంది వెలుగులోకి వచ్చారు. ఇప్పుడు స్టార్స్‌లా దూసుకుపోతోన్నారు. అయితే జబర్దస్త్ షోలో కొన్ని జంటలు బాగానే క్లిక్ అయ్యాయి. అన్నింట్లోకెల్లా రష్మీ సుధీర్ జోడి గురించే అందరూ చెప్పుకుంటారు.అయితే ఆ రేంజ్‌లో క్లిక్ జంట మరొక్కటి లేకుండాపోయింది. కానీ ఈ మధ్య వర్ష ఇమాన్యుయేల్ జోడి, ఆ జంట మధ్య ఉన్న కెమిస్ట్రీ కూడా బాగానే క్లిక్ అయింది. జబర్దస్త్ షోలో బాగానే వైరల్ అయిన ఈ జంట సోషల్ మీడియాలోనూ దుమ్ములేపుతోంది.

    అలా ఫేమస్..

    అలా ఫేమస్..

    ఇమాన్యుయేల్ ఎప్పటి నుంచో జబర్దస్త్‌లో ఉన్నాడు.తనకంటూ ఓ ప్రత్యేక ముద్రను వేసుకున్నాడు. కానీ జనాలు అంతగా గుర్తించే వారు కాదు. కానీ వర్ష ఎంట్రీ ఇవ్వడం,ఈ ఇద్దరి మధ్య ఏదో ఉందని క్రియేట్ అయ్యేలా స్కిట్లు వేయడంతో ఇద్దరికిద్దరూ బాగా ట్రెండ్ అయ్యారు. కలర్ ఫోటో కాంబో అంటూ ఇద్దరూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్అయ్యారు.

    ఆ మధ్య మరీ ఎక్కువ..

    ఆ మధ్య మరీ ఎక్కువ..

    వర్ష ఇమాన్యుయేల్ మధ్య కెమిస్ట్రీ బాగానే క్లిక్ అవ్వడంతో నిత్యం అదే కాన్సెప్ట్‌తో స్కిట్లు వేసేవారు. మధ్యలో అది కాస్తా శ్రుతి మించడంతో దాన్ని ఆపేశారు. అయితే రోజా, జబర్దస్త్ టీం మాత్రం వర్ష ఇమాన్యుయేల్ జంటను బాగానే ప్రమోట్ చేసేందుకు తాపత్రయ పడుతున్నట్టు కనిపిస్తుంటుంది. స్కిట్లు మధ్యలో, స్కిట్లకు జడ్జ్ మెంట్ ఇచ్చే సమయంలో పదే పదే గుచ్చి గుచ్చి ఆ ట్రాకు గురించి అడుగుతుంటారు.

    కొత్త షోలో అలా..

    కొత్త షోలో అలా..


    ప్రస్తుతం వర్ష ఇమాన్యుయలే ఇద్దరూ కూడా కొత్త షోతో బిజీగా ఉన్నారు. శ్రీదేవీ డ్రామా కంపెనీ అంటూ కొత్తగా ప్రారంభించిన ఈ షోలో వర్ష ఇమాన్యుయేల్ రొమాన్స్ కూడా మరీ ఎక్కువైనట్టు కామెంట్లు వినిపిస్తున్నాయి. మొత్తానికి ఈ ఇద్దరూ మాత్రం జనాల నోళ్లలో బాగానే నానుతున్నారు. తాజాగా వర్ష ఇమాన్యుయేల్‌పై ఓ కామెంట్ చేసింది.

    కేక్ తినడంపై..

    కేక్ తినడంపై..

    తాజాగా వర్ష ఓ వీడియోను షేర్ చేసింది. అందులో ఇమాన్యుయేల్‌ను దారుణంగా ఆడుకుంది. ఎవరిదో బర్త్ డే అవుతుంటే.. ఇమాన్యుయల్, వర్షలు గెస్ట్‌లుగా వెళ్లినట్టున్నారు. అక్కడ ఇమాన్యుయేల్ కేక్ తింటుంటే వీడియో తీసింది. కేక్ తినడం అంటే.. కేక్ మీద పడి తినడం కాదంటూ ఇమాన్యుయేల్‌కు వర్ష కౌంటర్ వేసింది. ఇక వర్ష తీసిన వీడియోలో ఇమాన్యుయేల్ ఫుల్ కామెడీగా ఉండటంతో బాగా వైరల్ అవుతోంది.

    English summary
    jabardasth varsha Comments on Emmanuel..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X