సీక్రెట్‌గా జబర్ధస్త్ వర్ష ఎంగేజ్‌మెంట్: ఇంట్లో వాళ్లు ఫోర్స్ చేయడంతో.. పెళ్లి కొడుకును చూపించి!

తెలుగు బుల్లితెరపై ఈ మధ్య కాలంలో ఎంతో మంది అమ్మాయిలు తెగ సందడి చేస్తోన్నారు. తద్వారా ఫాలోయింగ్ పెంచుకోవడంతో పాటు వరుసగా ఆఫర్లను దక్కించుకుంటోన్నారు. అందులో జబర్ధస్త్ ఫేం వర్ష ఒకరు. సీరియల్ నటిగా కెరీర్‌ను ప్రారంభించిన ఈ బ్యూటీ.. జబర్ధస్త్ షోతో ఎనలేని క్రేజ్‌ను సొంతం చేసుకుంది. తద్వారా చేతి నిండా అవకాశాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది. అలాగే, సోషల్ మీడియాలోనూ వర్ష తెగ సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఈ అమ్మడు సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్ అయినట్లు చెప్పి షాకిచ్చింది. అసలేం జరిగిందో మీరే చూడండి!

నటిగా వచ్చి ఫుల్ పాపులర్

నటిగా వచ్చి ఫుల్ పాపులర్

బుల్లితెరపైకి రావడానికి ముందే వర్ష మోడల్‌గా ప్రయాణాన్ని మొదలు పెట్టింది. ఇందులో తనదైన అందచందాలతో సందడి చేస్తోన్న సమయంలోనే టీవీ ప్రముఖుల దృష్టిని ఆకర్షించింది. ఫలితంగా 'అభిషేకం' అనే సీరియల్‌తో నటిగా ఎంటరైంది. తర్వాత 'తూర్పు పడమర', 'ప్రేమ ఎంత మధురం' వంటి సీరియళ్లు చేసి వర్ష ఎనలేని గుర్తింపును సొంతం చేసుకుంది.

జబర్ధస్త్‌తో క్రేజ్ రెట్టింపుగా

జబర్ధస్త్‌తో క్రేజ్ రెట్టింపుగా

తెలుగు బుల్లితెరపై సీరియల్ నటిగా ఫుల్ పాపులర్ అయిన వర్ష.. ఆ తర్వాత జబర్ధస్త్ షోలోకి గెస్ట్‌గా వచ్చింది. దీంతో అప్పుడే ఈమె అందరి దృష్టినీ ఆకర్షించి.. గుర్తింపును తెచ్చుకుంది. దీంతో ఆమెకు వరుసగా స్కిట్లు చేసే ఛాన్స్ వచ్చింది. ఫలితంగా ఆ షోలో వర్ష పర్మినెంట్ అయిపోయింది. అప్పటి నుంచి ఆమె కెరీర్ మారిపోయింది. దీంతో వరుస ఆఫర్లతో ముందుకు సాగుతోంది.

వాటిలో కూడా వర్ష సందడి

వాటిలో కూడా వర్ష సందడి

గ్లామర్‌తో పాటు కామెడీ జబర్ధస్త్ షోలో సందడి చేస్తోన్న వర్ష.. వరుసగా ఆఫర్లను దక్కించుకుంటూ ముందుకు వెళ్తోంది. ఇందులో భాగంగానే ఒకవైపు సీరియళ్లు చేస్తూ.. మరోవైపు టీవీ షోలపైనా ఫోకస్ చేస్తోంది. ఫలితంగా జబర్ధస్త్‌, స్పెషల్ ఈవెంట్లతో పాటు 'శ్రీదేవీ డ్రామా కంపెనీ' షోలోనూ భాగమై ప్రేక్షకులను అలరిస్తోంది. అలాగే, చిన్న చిన్న సినిమాల్లో సైతం భాగం అవుతోంది.

అతడితో ప్రేమ.. వార్తల్లోనే

అతడితో ప్రేమ.. వార్తల్లోనే

జబర్ధస్త్ వర్ష యంగ్ కమెడియన్ ఇమాన్యూయేల్‌తో ప్రేమాయణం సాగిస్తుందన్న వార్తలతో మరింత పాపులర్ అయింది. అతడితో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ చేసే స్కిట్ల వల్లే భారీ స్థాయిలో క్రేజ్ దక్కుతోంది. ఇక, తరచూ అతడితో హగ్గులు, ముద్దులతో రెచ్చిపోతూ యమా రెచ్చిపోతోంది. అంతేకాదు, వీళ్లిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది.

సోషల్ మీడియాలో బిజీగా

సోషల్ మీడియాలో బిజీగా

వరుసగా టీవీ షోలు, సీరియళ్లు, స్పెషల్ ఈవెంట్లు చేస్తూ కెరీర్ పరంగా ఫుల్ బిజీగా మారిపోయిన జబర్ధస్త్ వర్ష.. సోషల్ మీడియాలో సైతం ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే నిత్యం తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. అలాగే, ఫొటోలు, వీడియోలను కూడా షేర్ చేస్తూ తన ఫాలోయింగ్‌ను భారీగా పెంచుకుంటోంది.

ఎంగేజ్‌మెంట్ అని పోస్ట్

ఎంగేజ్‌మెంట్ అని పోస్ట్

సోషల్ మీడియాలో యమ హడావిడి చేసే వర్ష తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పూల దండను చేతిలో పెట్టుకుని కనిపించింది. అంతేకాదు, 'ఎంగేజ్‌మెంట్ అయిపోయింది.. పెళ్లికొడుకు ఎవరో తెలుసా' అంటూ ఓ థంబ్‌నెయిన్‌ను షేర్ చేసింది. అంతేకాదు, వీడియో లింక్ కూడా షేర్ చేసింది. అందులో మేకప్ వేసుకుని రెడీ అవడం నుంచి చూపిస్తూ ఆసక్తిని రేకెత్తించింది.

పెళ్లి కొడుకును చూపించి

పెళ్లి కొడుకును చూపించి

తాజాగా విడుదల చేసిన వీడియోలో వర్ష 'ఎంగేజ్‌మెంట్ అని రాత్రికి రాత్రే చెప్పారు. నాకు రెడీ అవడం ఇబ్బంది అయింది. అయినా వీటిలో ఇలా మేనేజ్ చేశా. మా పేరెంట్స్ ఫోర్స్ చేయడం వల్ల తప్పట్లేదు' అంటూ చెప్పుకొచ్చింది. అలా చివర్లో రాకింగ్ రాకేష్ - సుజాత ఎంగేజ్‌మెంట్‌లో ప్రత్యక్షమైంది. అంటే ఆమె చెప్పిన నిశ్చితార్థం వాళ్లదే. ఇక, అసలు విషయం తెలిసి వర్షను నెటిజన్లు ఓ రేంజ్‌లో విమర్శిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X