Bigg Boss Season 5: మరో జబర్ధస్త్ స్టార్ ఎంట్రీ.. ఆ ఒక్క పొరపాటుతో మేటర్ లీక్!

ఏమాత్రం అంచనాలు లేకుండానే తెలుగులోకి ప్రవేశించి.. చాలా తక్కువ సమయంలోనే ప్రేక్షకుల మన్ననలు అందుకున్న ఏకైక షో బిగ్ బాస్. ఒక ఇంటిని ఏర్పాటు చేసి, అందులో కొందరు కంటెస్టెంట్లను పంపించి, వాళ్లకు కొన్ని టాస్కులు ఇచ్చి, ప్రేక్షకుల హృదయాలు గెలుచుకునేలా చేయడమే ఈ షో నేపథ్యం.

తెలుగులో నాలుగు సీజన్లను పూర్తి చేసుకున్న ఈ షో.. ఐదో సీజన్‌ గురించి ఎన్నో ఊహాగానాలు ప్రచారం అవుతున్నాయి. ఇలాంటి సమయంలో తాజాగా ఓ సెలెబ్రిటీ చేసిన పొరపాటు కారణంగా ఊహించని న్యూస్ బయటకు వచ్చింది. ఆ వివరాలు మీకోసం!

పెళ్లిపీటల మీదే రొమాన్స్.. వైరల్ అవుతున్న నవ దంపతుల ఫోటో షూట్..

ఒకటి కాదు... రెండు కాదు... నాలుగు

ఒకటి కాదు... రెండు కాదు... నాలుగు

ఇంగ్లీష్‌లో వచ్చిన 'బిగ్ బ్రదర్' రియాలిటీ షో ఆధారంగా హిందీలో 'బిగ్ బాస్' అనే షో ప్రారంభం అయింది. ఆ తర్వాత దేశంలోని చాలా భాషల్లో ఇది మొదలైంది. అలా తెలుగులోకి కూడా పరిచయం అయిందిది. సాదాసీదా వచ్చినప్పటికీ.. తక్కువ టైమ్‌లోనే ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న ఈ షో ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా నాలుగు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది.

నాలుగు సీజన్లు... ముగ్గురు హోస్టులు

నాలుగు సీజన్లు... ముగ్గురు హోస్టులు

బిగ్ బాస్ షో తెలుగులో నాలుగు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇది ఇంతలా సక్సెస్ అయిందంటే దానికి హోస్టులు కూడా కారణమే అని చెప్పొచ్చు. మొదటి సీజన్‌ను జూనియర్ ఎన్టీఆర్, రెండో సీజన్‌ను నేచురల్ స్టార్ నాని, మూడు నాలుగు సీజన్లను సీనియర్ హీరో అక్కినేని నాగార్జున తమదైన శైలి హోస్టింగ్‌తో అద్భుతంగా నడిపించడం వల్లే ఇది ఈ స్థాయిలో ఉంది.

నేషనల్ రికార్డును క్రియేట్ చేసిన బాస్

నేషనల్ రికార్డును క్రియేట్ చేసిన బాస్

తెలుగులో ప్రసారం అయ్యే బిగ్ బాస్‌కు అన్ని భాషల కంటే ఎక్కువ స్పందన వస్తుందన్న విషయం తెలిసిందే. అందుకే ఈ షో ఆరంభం, ఫినాలే ఎపిసోడ్లకు రికార్డు స్థాయిలో రేటింగ్ దక్కుతోంది. మరీ ముఖ్యంగా అక్కినేని నాగార్జున హోస్టు చేసిన నాలుగో సీజన్ ప్రీమియర్ ఎపిసోడ్‌కు 18 పైచిలుకు రేటింగ్ దక్కింది. ఫలితంగా ఇది నేషనల్ రికార్డును క్రియేట్ చేసి సత్తా చాటింది.

ఐదో సీజన్ త్వరలో వస్తుందంటూ టాక్

ఐదో సీజన్ త్వరలో వస్తుందంటూ టాక్

నాలుగు సీజన్లు పూర్తి కావడంతో ఇప్పుడు అందరి దృష్టి బిగ్ బాస్ ఐదో సీజన్ మీద పడింది. దీంతో త్వరలోనే ఈ సీజన్ ప్రారంభం కాబోతుందంటూ ఎన్నో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అదే సమయంలో ఇందులో పలానా సెలెబ్రిటీ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇస్తున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఫలితంగా చాలా రోజులుగా బిగ్ బాస్ ఐదో సీజన్ తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉంటోంది.

కరోనాతో అనుమానాలు.. క్లారిటీ లేదు

కరోనాతో అనుమానాలు.. క్లారిటీ లేదు

తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ ప్రభావం భారీగా పెరిగిపోయింది. దీంతో బిగ్ బాస్ ఐదో సీజన్ ప్రారంభంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఇప్పటికే మలయాళంలో ఈ షోను నిలిపివేశారు. దీంతో తెలుగులో ఇప్పట్లో ఇది మొదలయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. పైగా అసలు ఈ ఏడాది ఉంటుందా? ఉండదా? అన్న టాక్ కూడా వినిపిస్తోంది. దీంతో ఫ్యాన్స్ క్లారిటీ కోరుతున్నారు.

బిగ్ బాస్ సీజన్-5పై ఊహించని న్యూస్

బిగ్ బాస్ సీజన్-5పై ఊహించని న్యూస్

బిగ్ బాస్ ఐదో సీజన్ గురించి ఎన్నో వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల దీన్ని ఆగస్టులో ప్రారంభించబోతున్నారని ఓ న్యూస్ బయటకు వచ్చింది. దీంతో ఈ రియాలిటీ షో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇలాంటి సమయంలో బిగ్ బాస్ ఐదో సీజన్ గురించి ఓ ఊహించని న్యూస్ బయటకు వచ్చింది. దీనికి కారణం ఓ సెలెబ్రిటీ పోస్టు చేసిన అంశమే.

Recommended Video

P Som Shekar, Ram Gopal Varma's Cousin Passes Away | Filmibeat Telugu
ఐదో సీజన్‌లోకి మరో జబర్ధస్త్ స్టార్ ఎంట్రీ

ఐదో సీజన్‌లోకి మరో జబర్ధస్త్ స్టార్ ఎంట్రీ

జబర్ధస్త్ పర్మినెంట్ ఆర్టిస్టుగా వెలుగొందుతోన్న వర్ష.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో 'బిగ్ బాస్ సీజన్ 5' అని రాసి.. దానికి ఆలోచిస్తోన్న ఓ ఎమోజీని జత చేసింది. తద్వారా ఆమెకు ఈ రియాలిటీ షోలో పాల్గొనే అవకాశం వచ్చినట్లు.. ఎంట్రీ ఇస్తున్నట్లు చెప్పకనే చెప్పింది. ఆమె చేసిన ఈ పోస్టు వల్ల బిగ్ బాస్ ఐదో సీజన్ పనులు చకచకా జరుగుతున్నట్లు అర్థం అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X