For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Telugu OTT: జబర్ధస్త్ నటికి బిగ్ బాస్ ఆఫర్.. అప్పుడు మిస్సైంది.. ఇప్పుడేమో ఇలా!

  |

  అసలు ఏమాత్రం అంచనాలు లేకుండానే తెలుగులోకి ప్రవేశించి.. చాలా తక్కువ సమయంలోనే ప్రేక్షకుల మన్ననలు అందుకున్న ఏకైక రియాలిటీ బిగ్ బాస్. ఒక ఇంటిని ఏర్పాటు చేసి, అందులో కొందరు కంటెస్టెంట్లను పంపించి, వాళ్లకు కొన్ని టాస్కులు ఇచ్చి, ప్రేక్షకుల హృదయాలు గెలుచుకునేలా చేయడమే ఈ షో విధానం. తెలుగులో మొన్నటితో ఐదు సీజన్లను పూర్తి చేసుకున్న ఈ షో.. భారీ టీఆర్పీ సాధిస్తూ నేషనల్ రేంజ్‌లో పాపులర్ అయింది. ఈ క్రమంలోనే షో నిర్వహకులు ఇప్పుడు బిగ్ బాస్ ఓటీటీ మొదటి సీజన్‌ను ప్రారంభించబోతున్నారు. ఈ నేపథ్యంలో ఇందులో పాల్గొనే కంటెస్టెంట్లు వీళ్లేనంటూ పేర్లు బయటకు వస్తున్నాయి. ఇలా తాజాగా మరో పేరు తెరపైకి వచ్చింది. ఆ వివరాలు మీకోసం!

  ఏకంగా ఐదు సీజన్లు పూర్తి చేసేసి

  ఏకంగా ఐదు సీజన్లు పూర్తి చేసేసి


  ఇంగ్లీష్‌లో వచ్చిన 'బిగ్ బ్రదర్' రియాలిటీ షో ఆధారంగా హిందీలో 'బిగ్ బాస్' ప్రారంభం అయింది. ఆ తర్వాత దేశంలోని చాలా భాషల్లో ఇది మొదలైంది. అలా తెలుగులోకి కూడా పరిచయం అయింది. సాదాసీదా వచ్చినప్పటికీ.. తక్కువ టైమ్‌లోనే ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న ఈ షో ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఐదు సీజన్లను సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసింది.

  తెలుగు హీరోలపై నాని సంచలన వ్యాఖ్యలు: వకీల్ సాబ్ నుంచే అసలు సమస్య.. వాళ్లు అలా చేయడం వల్లేనంటూ!

  ఐదో సీజన్ చివర్లో గుడ్ న్యూస్‌తో

  ఐదో సీజన్ చివర్లో గుడ్ న్యూస్‌తో

  బిగ్ బాస్ ఐదో సీజన్‌కు సంబంధించిన గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్‌ ఇటీవలే ముగిసింది. ఈ వేదికపైనే షో నిర్వహకులు అదిరిపోయే ప్రకటన చేశారు. అది కూడా రెండు గుడ్‌ న్యూస్‌లు చెప్పారు. అందులో ఒకటి ఆరో సీజన్ గురించి తొమ్మిది నెలల తర్వాత అని చెప్పడం గాక.. మరొకటి బిగ్ బాస్ తెలుగు ఓటీటీ సీజన్ వన్ గురించి. ఇది త్వరలోనే ప్రారంభం కాబోతుందని వెల్లడించారు.

  బిగ్ బాస్ తెలుగు ఓటీటీకి ప్లాన్స్

  బిగ్ బాస్ తెలుగు ఓటీటీకి ప్లాన్స్

  హిందీలో బిగ్ బాస్ ఓటీటీని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇది కూడా సూపర్ హిట్ అయింది. ఈ నేపథ్యంలోనే తెలుగులో కూడా దీన్ని పరిచయం చేయబోతున్నారు. బిగ్ బాస్ ఓటీటీ తెలుగు మొదటి సీజన్‌ ఫిబ్రవరి నుంచి ప్రారంభం అవుతుందని తెలుస్తోంది. దీన్ని కూడా టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున హోస్ట్ చేయనున్నారు. ఈ విషయాన్ని ఆయనే చెప్పారు.

  Bigg Boss: వీజే సన్నీకి వంద కోట్ల ఆఫర్.. బిగ్ బాస్ చరిత్రలో తొలిసారి.. రిజెక్ట్ చేసి షాకిచ్చాడుగా!

  షో అందులోనే.. రోజు మొత్తంగా

  షో అందులోనే.. రోజు మొత్తంగా

  బిగ్ బాస్ షో మాదిరిగా ఓటీటీ వెర్షన్ టీవీ ఛానెల్‌లో ప్రసారం కాదు. దీన్ని డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. అంతేకాదు, 24 గంటలూ ఇది ప్రసారం అవుతూనే ఉంటుంది. దీంతో కంటెస్టెంట్ల గురించి మరింత సమాచారం తెలియనుంది. వారాంతాల్లో అక్కినేని నాగార్జున దీన్ని హోస్ట్ చేస్తారు. ఇక, ఇందులో ఎలిమినేషన్ ఎప్పుడైనా జరిగే ఛాన్స్ కూడా ఉంటుంది.

  కంటెస్టెంట్ల ఎంపిక కూడా స్టార్ట్

  కంటెస్టెంట్ల ఎంపిక కూడా స్టార్ట్

  ఇప్పుడు అందరి దృష్టి బిగ్ బాస్ ఓటీటీ మొదటి సీజన్ మీద పడింది. దీంతో త్వరలోనే ఈ సీజన్ ప్రారంభం కాబోతుండడంతో.. ఇందులో పలానా సెలెబ్రిటీ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇస్తున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఫలితంగా చాలా రోజులుగా బిగ్ బాస్ ఓటీటీ తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉంటోంది. అలాగే, ఎంతో మంది పేర్లు కూడా తెరపైకి వస్తున్న విషయం తెలిసిందే.

  హాట్ సెల్ఫీ వీడియో వదిలిన శ్రీరెడ్డి: బట్టలన్నీ తీసి పడేసి.. బాగా పెరిగిపోయాయి అంటూ!

  జబర్ధస్త్ నటికి బిగ్ బాస్ ఆఫర్

  జబర్ధస్త్ నటికి బిగ్ బాస్ ఆఫర్

  బిగ్ బాస్ ఓటీటీలో పాల్గొనే కంటెస్టెంట్ల గురించి రోజుకో వార్త తెగ వైరల్ అవుతోంది. ఇందులో భాగంగానే ఇప్పుడు మరో పేరు బయటకు వచ్చింది. తాజా సమాచారం ప్రకారం.. సీరియల్స్‌తో పాటు జబర్ధస్త్‌లో సందడి చేస్తోన్న బ్యూటీ వర్షను షో నిర్వహకులు సంప్రదించారట. అయితే, ఇందుకోసం ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా? తిరస్కరించిందా? అన్నది మాత్రం తెలయాల్సి ఉంది.

  అప్పుడలా మిస్సైపోయిన వర్ష

  అప్పుడలా మిస్సైపోయిన వర్ష


  జబర్ధస్త్ వర్ష ప్రస్తుతం వరుస షోలతో ఫుల్ బిజీగా గడుపుతోంది. అదే సమయంలో కొన్ని సీరియళ్లు కూడా చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల ముగిసిన ఐదో సీజన్‌లో ఆమె కంటెస్టెంట్‌గా వస్తుందని జోరుగా ప్రచారం జరిగింది. అందుకు అనుగుణంగానే ఆమె కూడా బిగ్ బాస్‌పై పోస్ట్ చేసింది. కానీ, అప్పుడు మిస్సైంది. మరి ఇప్పుడు మాత్రం ఎంట్రీ ఇస్తుందో లేదో చూడాలి.

  English summary
  Bigg Boss Show Completed Five Seasons Successfully. Now Makers Planing for OTT Season. Jabardasth Varsha Will Enter The Show.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X