జబర్ధస్త్ వర్ష కుటుంబంలో విషాదం: బ్యాడ్ న్యూస్ చెప్పి బోరుమన్న బ్యూటీ.. ఏకంగా పైనుంచి దూకేయడంతో!
ఆకట్టుకునే అందం.. అద్భుతమైన యాక్టింగ్.. సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్.. ఇలా కొంత కాలంగా తెలుగు రాష్ట్రాల్లో ఎనలేని క్రేజ్‌ను సంపాదించుకున్న అమ్మాయి వర్ష. కెరీర్ ఆరంభంలోనే పలు సీరియళ్లలో నటించిన ఈమె.. జబర్ధస్త్ షోలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాతనే ఫేమస్ అయింది. అప్పటి నుంచి ఏదో ఒక విధంగా తరచూ వార్తల్లో నిలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె జీవితంలో ఓ విషాదకర సంఘటన జరిగింది. ఆ విషయాన్ని వర్ష స్వయంగా వెల్లడించింది. బ్యాడ్ న్యూస్‌ను చెబుతూ బోరున విలపించింది. అసలేం జరిగింది? ఆ వివరాలు మీకోసం!

అలా మొదలైన ప్రయాణం.. ఆ సీరియళ్లలో
యాక్టింగ్ మీద ఉన్న ఆసక్తితో మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది వర్ష. ఆ తర్వాత కొందరు ఇండస్ట్రీ పెద్దల దృష్టిలో పడడంతో సీరియళ్లలో నటించే అవకాశాన్ని అందుకుంది. ఈ క్రమంలోనే ప్రముఖ చానెళ్లలో ప్రసారం అవుతోన్న 'అభిషేకం', 'తూర్పు పడమర', 'ప్రేమ ఎంత మధురం' వంటి సీరియళ్లలో నటించి మెప్పించింది. తద్వారా నటిగా మంచి గుర్తింపును సంపాదించుకుంది.

జబర్ధస్త్‌లోకి ఎంట్రీ... ఆ కమెడియన్ హెల్ప్
సీరియల్ యాక్టర్‌గా ఫుల్ బిజీగా గడుపుతోన్న వర్షకు.. జబర్ధస్త్ షోలో పాల్గొనే అవకాశాన్ని కల్పించాడు టాప్ టీమ్ లీడర్ హైపర్ ఆది. మొదటి స్కిట్‌లోనే మెప్పించిన ఈ బ్యూటీ.. అప్పటి నుంచి ఆ షోలో భాగం అయిపోయింది. ఈ క్రమంలోనే ఎన్నో స్కిట్లో భాగం అవుతూ వస్తోంది. హైపర్ ఆదితో పాటు రాకింగ్ రాకేష్, కెవ్వు కార్తీక్ టీమ్‌లలో సైతం చేస్తూ అలరిస్తోందీ ముద్దుగుమ్మ.

అతడితో లవ్ ట్రాకుతో వర్షకు పాపులారిటీ
జబర్ధస్త్‌లో లేడీ కంటెస్టెంట్‌గా వెలుగొందుతోన్న వర్ష.. ఆ షోలోని టాలెంటెడ్ కమెడియన్ ఇమాన్యూయేల్‌తో ప్రేమాయణం సాగిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనికి కారణం.. కొంత కాలంగా వీళ్లిద్దరూ కలిసి రొమాంటిక్ యాక్టులు చేస్తుండడమే. అంతేకాదు, తరచూ ముద్దులు, హగ్గులతో రచ్చ రచ్చ చేస్తున్నారు. ఈ కారణంగానే ఈ జంట విపరీతమైన స్థాయిలో పాపులర్ అయిపోతోంది.

అందులోనే ఉంటోంది.. నిత్యం వార్తల్లో వర్ష
జబర్ధస్త్‌లోకి ఎంట్రీ ఇచ్చిన చాలా తక్కువ సమయంలోనే ఎవరికీ సాధ్యం కాని రీతిలో పాపులారిటీని సొంతం చేసుకుంది వర్ష. కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం యమ యాక్టివ్‌గా ఉంటోందామె. ఈ క్రమంలోనే తన వ్యక్తిగత విషయాలతో పాటు కెరీర్‌కు సంబంధించిన విశేషాలను పంచుకుంటోంది. దీంతో తరచూ వార్తల్లో నిలుస్తూ హాట్ టాపిక్ అవుతోంది.

ఎక్కువగా అవే.. అందుకే ఆమె హాట్ టాపిక్
తెలుగు అమ్మాయిలు స్కిన్ షో చేయరు అన్న టాక్ ఇండస్ట్రీలో ఉంది. అందుకే ఉత్తరాది అమ్మాయిలను ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. ఆ బౌండరీలను దాటేస్తూ అందాలను ఒలకబోస్తోంది వర్ష. సోషల్ మీడియాలో తన హాట్ ఫొటోలను ఒక్కొక్కటిగా వదులుతూ కుర్రకారు గుండెల్లో గాయాలు చేస్తోంది. దీంతో ఆమెను ఫాలో అయ్యే వారి సంఖ్య కూడా రోజురోజుకూ భారీగా పెరిగిపోతోంది.

వర్ష కుటుంబంలో విషాదం.. బ్యాడ్ న్యూస్‌తో
వరుస షోలతో కెరీర్ పరంగా సత్తా చాటుతోంది వర్ష. ఇందులో భాగంగానే 'శ్రీదేవి డ్రామా కంపెనీ' పేరుతో ఈటీవీలో ప్రసారం అవుతోన్న కార్యక్రమంలో పాల్గొంటోంది. ఈ షోలోనూ కమెడియన్ ఇమ్మానుయేల్, వర్ష జోడీగా కనిపిస్తున్నారు. ఎక్కువగా వీళ్లిద్దరినే హైలైట్ చేస్తూ వస్తున్నారు నిర్వహకులు. ఇలాంటి పరిస్థితుల్లో తన జీవితంలో జరిగిన విషాదం గురించి తాజాగా వెల్లడించింది.

ఏకంగా పైనుంచి దూకేయడంతో అంతా షాక్
'శ్రీదేవి డ్రామా కంపెనీ' షోలో మాట్లాడుతూ.. తాజాగా తన తండ్రి మరణించాడన్న చేదు వార్తను వెల్లడించింది. అంతేకాదు, తొలిసారి షోలో బోరు బోరున విలపించింది. అంతకు ముందు 'నాన్నకు ప్రేమతో' అంటూ సాగే పాటకు ప్రశాంత్ మాస్టర్‌తో కలిసి ఎమోషనల్‌గా డ్యాన్స్ కూడా చేసింది. ఈ సమయంలోనే స్టేజ్ పైనుంచి కిందకి దూకి పడిపోయింది. దీంతో అందరూ షాకైపోయారు.


Click it and Unblock the Notifications











