Don't Miss!
- News
Budget 2023: తినబోతూ రుచులెందుకు..!!
- Finance
Jio laptop: మార్కెట్లోకి Jio ల్యాప్ ట్యాప్.. ఫీచర్లు, ధర చూస్తే వావ్ అనాల్సిందే !!
- Sports
INDvsNZ : మూడో టీ20లో ఈ రికార్డులు బద్దలవడం ఖాయం.. సూర్య సాధిస్తాడా?
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
- Lifestyle
'ఆ' సమయంలో ఈ ప్రదేశాల్లో మీ భర్త & భార్యను టచ్ చేయండి...ఆ ఆనందం మరోస్థాయిలో ఉంటుంది!
- Technology
ఆపిల్ నుంచి ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్ వివరాలు! కొత్త ఫీచర్లు!
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
జబర్ధస్త్ వర్షపై దారుణమైన ప్రచారం: సంచలనంగా మారిన షాకింగ్ న్యూస్
తెలుగు బుల్లితెరపై ప్రస్తుతం ఎంతో మంది లోకల్ అమ్మాయిలు సందడి చేస్తున్నారు. తద్వారా భారీ స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకోవడంతో పాటు వరుసగా అవకాశాలను కూడా అందుకుంటున్నారు. అందులో జబర్ధస్త్ బ్యూటీ వర్ష ఒకరు. సాదాసీదాగానే ప్రయాణాన్ని మొదలెట్టిన ఈ బ్యూటీ.. తక్కువ సమయంలోనే ఎనలేని గుర్తింపును దక్కించుకుంది. తద్వారా బుల్లితెరపై హవాను చూపిస్తూ దూసుకుపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా వర్షపై సోషల్ మీడియాలో దారుణమైన ప్రచారం జరుగుతోంది. ఇంతకీ ఏం జరిగిందో మీరే చూసేయండి!

సీరియల్ నటిగా ఫుల్ ఫేమస్
మోడల్‌గా కెరీర్‌ను ప్రారంభించిన వర్ష.. నటిగా అవకాశాలను అందుకోవడం కోసం ప్రయత్నాలు చేసింది. ఈ క్రమంలోనే తనదైన అందంతో అందరి దృష్టినీ ఆకర్షించింది. ఈ క్రమంలోనే 'అభిషేకం' అనే సీరియల్ ద్వారా నటిగా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 'తూర్పు పడమర', 'ప్రేమ ఎంత మధురం' వంటి సీరియళ్లలో నటించి ఫుల్ ఫేమస్ అయిపోయింది.
Bigg Boss: భార్య కాకుండా ఎవరైనా ఉన్నారా? పెళ్లికి ముందు ఆ పని చేయలేదా? మగాళ్లతో శ్రీ సత్య అసభ్యంగా!

జబర్ధస్త్‌గా వర్ష యాక్టింగ్ కెరీర్
తెలుగు బుల్లితెరపై వరుసగా సీరియళ్లు చేస్తూ బిజీగా గడుపుతోన్న సమయంలోనే వర్ష.. జబర్ధస్త్ షోలోకి వచ్చి ఓ స్కిట్ చేసింది. అది సూపర్ హిట్ అవడంతో పాటు ఆమె బాగా హైలైట్ అయిపోయింది. దీంతో అదే షోలో మరిన్ని స్కిట్లు చేసే ఛాన్స్ దక్కించుకుంది. అలా అందులోనే కొనసాగుతోంది. దీంతో ఆమె కెరీర్ కూడా జబర్ధస్త్‌గానే సాగుతుందని చెప్పుకోవచ్చు.

వరుస షోలతో ఫుల్ బిజీగానే
అందంతో పాటు అభినయం చూపిస్తూ విశేషమైన ఆదరణను సొంతం చేసుకున్న వర్ష.. తన ఫాలోయింగ్‌ను అంతకంతకూ పెంచుకుంటూనే ఉంది. అదే సమయంలో ఆఫర్లను కూడా దక్కించుకుంటోంది. ఇలా ఇప్పటికే ఈ బ్యూటీ 'జబర్ధస్త్', 'ఎక్స్‌స్ట్రా జబర్ధస్త్', 'శ్రీదేవీ డ్రామా కంపెనీ'తో పాటు పలు ఈవెంట్లు, షోలలో కూడా భాగం అవుతూ హవాను చూపిస్తోంది.
క్లీవేజ్ షోతో కాకరేపుతోన్న శివాత్మిక: అబ్బో టాప్ అందాలతో అరాచకం!

లవ్ ట్రాక్‌తో మరింత క్రేజీగా
జబర్ధస్త్ షోలో నటిగా పాపులర్ అయిన వర్ష తన క్రేజ్‌ను మరింతగా పెంచుకుంటోంది. దీనికి ఆమె యంగ్ కమెడియన్ ఇమాన్యూయేల్‌తో ప్రేమాయణం కూడా ఒక కారణం అని చెప్పొచ్చు. అతడితో ట్రాక్ నడుపుతున్నట్లు చేసే స్కిట్ల వల్లే భారీ స్థాయిలో క్రేజ్ వచ్చింది. ఇక, తరచూ అతడితో హగ్గులు, ముద్దులతో రెచ్చిపోతూ హైలైట్ అయింది. దీంతో ఆమె క్రేజ్ బాగా పెరిగింది.

సోషల్ మీడియాలో సందడి
చాలా కాలంగా బుల్లితెరపై వరుస పెట్టి షోలు, సీరియళ్లు, స్పెషల్ ఈవెంట్లు చేస్తూ కెరీర్ పరంగా ఫుల్ బిజీగా గడుపుతోన్న జబర్ధస్త్ వర్ష సోషల్ మీడియాలో సైతం ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే నిత్యం తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అదే సమయంలో ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ మరింత హైలైట్ అవుతోంది.
యాంకర్ వర్షిణి ఎద అందాల జాతర: ఘోరంగా చూపిస్తూ ఇలా తెగించిందేంటి!

వర్ష చనిపోయిందని పుకార్లు
వరుస పెట్టి ఆఫర్లను అందుకోవడంతో పాటు సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతోన్న జబర్ధస్త్ వర్ష తరచూ వార్తల్లోనే ఉంటోంది. ఈ క్రమంలోనే తాజాగా ఆమె గురించి ఓ షాకింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. అదేమిటంటే.. వర్ష చనిపోయిందంటూ కొన్ని వెబ్‌సైట్లలో కథనాలు వస్తున్నాయి. తాజాగా దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్లను ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది.

చావు వార్తలపై వర్ష రియాక్షన్
తాను చనిపోయానని కొన్ని వెబ్‌సైట్లలో వస్తున్న కథనాలపై జబర్ధస్త్ వర్ష సోషల్ మీడియా వేదికగా స్పందించింది. ఈ మేరకు ఆ స్క్రీన్ షాట్లను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన ఈ బ్యూటీ... 'హ హా హా' అంటూ నవ్వుతూ స్పందించింది. దీంతో ఇప్పుడీ న్యూస్ హాట్ టాపిక్‌గా మారింది. అదే సమయంలో వర్ష సుతిమెత్తగా స్పందించిన తీరును చాలా మంది ప్రశంసిస్తున్నారు.