కొత్త రుచులకు మరిగావు.. జబర్దస్త్ వర్ష‌‌పై ఇమ్మాన్యుయేల్‌ షాకింగ్ కామెంట్స్

దశాబ్ధానికి పైగా తెలుగు వారిని నవ్వుల్లో ముంచెత్తుతూ అలరిస్తున్న మెగా కామెడీ షో జబర్దస్త్. ఏళ్లు గడుస్తున్నా ఈ కార్యక్రమానికి ఏమాత్రం ఆదరణ తగ్గడం లేదు. జడ్జిలు, యాంకర్లు, కంటెస్టెంట్స్ అంతా మారిపోయినా జబర్దస్త్ ఇప్పటికీ నెంబర్ వన్ కామెడీ షోగా తన స్థానాన్ని నిలబెట్టుకుంటూనే ఉంది. తెలుగు బుల్లితెరపై టాప్ టీఆర్పీతో ఈ కార్యక్రమం దూసుకెళ్తోంది. ఎప్పటిలాగే ఈ వారం కూడా జబర్దస్త్ ప్రోమోను రిలీజ్ చేసింది ఈటీవీ.

జబర్దస్త్ షో ద్వారా ఎంతోమంది ప్రతిభావంతులు తమ ప్రతిభ నిరూపించుకుని బుల్లితెర, వెండితెరపై అవకాశాలు దక్కించుకుని హీరోలుగా, దర్శకులుగా, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా , కమెడియన్లుగా వెలుగొందుతున్నారు. కొత్తగా ఈ షోకు కంటెస్టెంట్స్‌గా వచ్చిన వారు కొత్తరకం హాస్యంతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్నారు. తాజా ప్రోమో విషయానికి వస్తే.. ప్రారంభంలో తాగుబోతు రమేష్ - నూకరాజులు తమ స్కిట్‌తో వస్తారు. నేను సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌నని నెలకు రూ.40 వేల జీతమని రమేశ్ అనగా.. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, దండెం మీద ఆరేసిన అండర్‌వేర్ రెండూ ఒకటేనని ఎప్పుడూ పడిపోతాయో తెలియదని నూకరాజ్ పంచ్ విసురుతాడు.

jabardasth latest promo of January 31st and 1st Feb released rashmi Gautham shocking comments on emmanuel and varsha

తర్వత పటాస్ ఫైమా తన టీమ్‌తో వచ్చి సందడి చేస్తుంది. టీ ఇవ్వమని అడగ్గా.. టీ అంటే క్యాపిటల్ టీనా, లేక స్మాల్ టీనా అంటూ పంచ్ విసరగా అతని చెంప పగలగొడుతుంది ఫైమా. నేను నిన్నే పెళ్లి చేసుకుంటానని బుల్లెట్ భాస్కర్‌ని ఫైమా వేధించగా.. నేను చేసుకోనని చెబుతాడు భాస్కర్. మా అక్కని పెళ్లి చేసుకోకుంటే చంపేస్తామని ఫైమా అనుచరులు కత్తితో బెదిరించగా.. ఫైమా వచ్చి బావ అమాయకుడని , ఏం అనొద్దని అంటుంది. ఇంతలో డాక్టర్ వచ్చి ఈ ట్రైన్ పట్టాలెక్కదని.. సైకిల్ ఓకే గానీ బెల్ కొట్టలేదని చెప్పడంతో అంతా నవ్వేస్తారు .

మేమిద్దరం మొగుడు పెళ్లాలమని వర్ష - ఇమ్మాన్యుయేల్ ఎంట్రీ ఇస్తారు. నీతో స్కిట్ చేస్తుంటే ఏదో కొత్త కొత్తగా ఉందని వర్ష అనగా.. నువ్వు కొత్త కొత్త రుచులు మరిగాక, మాతో చేయాలంటే కొత్తగానే ఉంటుందని పంచ్ వేస్తాడు. ఇద్దరు పెళ్లికి ముందు ప్రేమ గురించి మాట్లాడుకుంటుండగా.. శివాజీ గారు రోజు పాలకు వెళ్తున్నా ఆయన టవల్‌ను ఏ రోజు చూడలేదని అంటుంది వర్ష. ఇక్కడ నిప్పుల గుండం పెడితే పతివ్రతలా లేచొస్తానని వర్ష చెప్పగా.. ఓసేయ్ కాలిపోతావే అంటూ పంచ్ వేస్తుంది రష్మి.

రాకెట్ రాఘవ, చలాకీ చంటీలు వింటే లుక్‌లో ఎంట్రీ ఇచ్చి తమ ప్రేమ కథను గుర్తుచేస్తారు. రామ్ ప్రసాద్ - దొరబాబులు ఒకరి భార్యలకు మరొకరు సైట్ కొడుతూ ఎంట్రీ ఇస్తారు. మా కష్టాలు, కోర్కెలు తీర్చాలని దేవుడిని కోరుకుంటారు. రాఘవ - చంటీల జీవితంలో ఏం జరిగింది? రామ్ ప్రసాద్ - దొరబాబులకు దేవుడు ప్రత్యక్షమయ్యాడా? వర్ష తన పాతివ్రత్యాన్ని నిరూపించుకుందో లేదో తెలియాలంటే ఈ శనివారం వరకు వెయిట్ చేయాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X