ఫస్ట్ టైమ్ చేస్తుంటే ఎలా అనిపించింది.. వర్షకు జబర్తస్త్ కమెడియన్ షాక్
దాదాపు దశాబ్ధానికి పైగా తెలుగు ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తుతోంది జబర్దస్త్. ఈటీవీలో ప్రసారమవుతున్న ఈ షో.. కామెడీ సెక్టార్‌లో నెంబర్‌వన్‌గా దూసుకెళ్తోంది. దీని మాదిరిగానే పలు ఛానెల్స్‌లో కార్యక్రమాలు వచ్చినా జబర్దస్త్‌ను అవీ బీట్ చేయలేకపోయాయి. నేటికీ కళ్లు చెదిరే టీఆర్పీలతో ఈ కార్యక్రమం దూసుకెళ్తోంది. తాజాగా ఈ వారానికి సంబంధించిన ప్రోమోను ఈటీవీ రిలీజ్ చేసింది. ఈ వివరాల్లోకి వెళితే..
జబర్దస్త్ షో ద్వారా ఎంతో మంది ప్రతిభావంతులు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. టాలెంట్ ఉండి దానిని ఎలా నిరూపించుకోవాలో తెలియని ఎంతో మందికి ఇది ఓ వేదికలా నిలిచింది. జబర్దస్త్ ద్వారా ధనరాజ్, చమ్మక్ చంద్ర, షకలక శంకర్, వేణు , సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, గెటప్ శ్రీను వంటి నటులు సినిమాల్లో అవకాశాలు దక్కించుకుని, హీరోలగాను నటించారు.. ఇంకా నటిస్తున్నారు. తొలి నుంచి ఈ షోలో ఉన్న కమెడియన్లు ఇప్పుడు లేరు.. అయినప్పటికీ జబర్దస్త్ నిరాటంకంగా కొనసాగుతూనే ఉంది.

నాగబాబు, రోజాలు జడ్జిలుగా తప్పుకున్న తర్వాత మీనా, రంభ, సంగీత, లైలా, ఖుష్భు, ఇంద్రజ, అలీ, మనో, కృష్ణ భగవాన్ తదితరలు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. తాజాగా హీరో శివాజీ జబర్దస్త్ షోకు జడ్జిగా ఎంట్రీ ఇచ్చారు. సీనియర్ హీరోయిన్ ఖుష్భూతో కలిసి ఆయన సందడి చేస్తున్నారు . గతంలో కృష్ణ భగవాన్ జడ్జిగా అలరించారు. కమెడియన్స్‌కు పోటీగా పంచ్‌లు , సెటైర్లు వేస్తూ నవ్వించేవారు. ఆయన తప్పుకుని శివాజీ ఎంట్రీ ఇచ్చారు. మొదట్లో కాస్త ఇబ్బంది పడినా ప్రస్తుతం గాడిలో పడ్డారు.
ఇకపోతే.. జబర్దస్త్ మేకర్స్ ప్రతీవారం ప్రోమోలను రిలీజ్ చేస్తుంటారు. వీటి కోసం ఆడియన్స్ కూడా అంతే స్థాయిలో వెయిట్ చేస్తుంటారు. తాజాగా ఈ వారానికి సంబంధించిన జబర్దస్త్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ వివరాల్లోకి వెళితే.. హీరోయిన్ లయతో కలిసి శివాజీ జడ్జి సీట్‌లో ఉన్నారు. నూకరాజు వెరైటీ గెటప్‌లో వేసిన పంచ్‌లు విసిరాడు. ప్రవీణ్- కెవ్వు కార్తీక్‌లు మా ఇద్దరిలో పెద్ద వెదవ ఎవరో తెలుసా అంటూ గొడవ పడగా.. మీ ఇద్దరూ వెదవలేనని శివాజీ పంచ్‌లు విసురుతాడు.

పిల్లల్ని కనొచ్చుగా అని వాళ్ల ఆవిడ అడగ్గా.. ఆటో రామ్ ప్రసాద్ మనవల్ల కాదు అంటుంది, మీ వల్ల ఏమీ కాదని సెటైర్లు వేస్తుంది. దొంగ గెటప్‌లో రాకెట్ రాఘవ ఎంట్రీ ఇచ్చి రష్మీ దగ్గర ఫోన్ కొట్టేస్తాడు. ఓ సినిమా షూటింగ్‌లో దొంగ క్యారెక్టర్ కోసం రాఘవను పిలవగా.. అతను నిజంగానే జీవిస్తాడు. పెళ్లి కోసం పొట్టి నరేష్‌ను నిలదీస్తుంది ఫైమా. ముందు నిన్న వేటాడి తర్వాత వేటగాడు సినిమాకు తీసుకెళ్తానని అంటాడు. అబ్బాయి పుడితే శివాజీ అని, అమ్మాయి పుడితే లయ అని పేరు పెడదామని నరేష్ అడగ్గా.. ముందు పిల్లలు పుట్టాలిగా అని ఫైమా పంచ్‌లు వేస్తుంది.
అన్నింటిలోకి ఆట పండు - వర్ష స్కిట్ హైలైట్‌గా నిలిచింది. మనిద్దరం మొగుడు - పెళ్లాలం కదా, ఫస్ట్ టైం చేస్తున్నాం కదా ఎలా అనిపిస్తుందని పండు అడగ్గా.. పెద్దగా ఏమి అనిపించడం లేదని వర్ష సెటైర్లు వేస్తుంది. అంతలో వర్షను హగ్ చేసుకుని, నువ్వు బాధపడితే నేను చూడలేనని అంటాడు. నిన్ను డ్యాన్సర్ అన్నారు కదరా నువ్వేంటి ఇలా చేస్తున్నావని వర్ష నిలదీస్తుంది. వాళ్లిచ్చే రెండు వేలు, మూడు వేలు కోసం జబర్దస్త్‌కి వచ్చానని అనుకుంటున్నావా, ఇలాంటి కంఫర్ట్స్ కోసం వచ్చా అంటాడు పండు. పేపర్ తీసుకెళ్లి పక్కింట్లో పడేస్తుంది వర్ష.. దీంతో ఆ ఇంటామె శాపనార్ధాలు, చీవాట్లు పెడుతుంది. సగం బట్టల సుందరి వచ్చిందమ్మా అంటూ ఇమ్మాన్యుయేల్ కూడా బరిలో దిగుతాడు. మరి వారిద్దరి మధ్య తగవు పరిష్కారమైందా ? లేదా? అన్నది తెలియాలంటే ఫుల్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











