జబర్దస్త్ వేదికపై వర్ష పెళ్లి.. ట్విస్ట్ ఏమిటంటే?
జబర్దస్త్ వర్ష టెలివిజన్ రంగంలో అంతకంతకు ఎదుగుతోంది. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షోతో ఈమెకు మంచి గుర్తింపు వస్తోంది. కమెడియన్ ఇమ్మాన్యుయెల్ టీమ్ లో పలు పాత్రలు పోషిస్తూ ఆకట్టుకుంటోంది. విభిన్నమైన స్కిట్లతో ఆకట్టుకుంటోంది. తనదైన శైలిలో పంచులు వేస్తూ టీవీ ఆడియెన్స్ ను ఎంతగానో అలరిస్తోంది. తనదైన శైలిలో స్కిట్లను ప్రదర్శిస్తూ ఆడియెన్స్ ను ఆకట్టుకుంటోంది. బుల్లితెరపై తనకుంటూ స్పెషల్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంది. సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా కనిపిస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటోంది.
ప్రస్తుతం జబర్దస్త్ కామెడీ షో ద్వారా వర్ష ప్రేక్షకులను అలరిస్తోంది. బ్యాక్ టు బ్యాక్ ఎపిసోడ్స్ లో కడుపుబ్బా నవ్విస్తోంది. అలాగే తన గ్లామర్ మెరుపులతోనూ అలరిస్తూ ఉంది. అయితే వర్ష ప్రస్తుతం జబర్దస్త్ షోలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారుతోంది. కాగా జబర్దస్త్ లేటెస్ట్ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ఈ ప్రోమోలో వర్ష షాకింగ్ సర్ ప్రైజ్ ఇచ్చింది. తను రెండు పెళ్లికి సంబంధించిన స్కిట్లను చేసింది. ఒకటి బుల్లెట్ భాస్కర్, మరోటి ఇమ్మాన్యుయెల్ స్కిట్ లో నటించింది.

అయితే, ఈ రెండు స్కిట్లలో వర్ష పెళ్లి కూతురు పాత్రలో నటించింది. ఈ రెండు స్కిట్లలో పెళ్లి చేసుకునే ప్రాపెస్ తోనే నవ్వించే ప్రయత్నం చేస్తుంది. ఇలా ఇద్దరు కమెడియన్లను జబర్దస్త్ వేదికపైన పెళ్లి చేసుకునే స్కిట్లను చేసి ఆకట్టుకుంది. బుల్లెట్ భాస్కర్ స్కిట్ తో పాటు ఇమ్మాన్యుయేల్ స్కిట్ లో నటిస్తున్న వర్ష ఏ స్కిట్ తో అలరిస్తుందనేది వేచి చూడాలి. తాజాగా రిలీజ్ అయిన జబర్దస్త్ ప్రోమోలో మాత్రం వర్షనే హైలెట్ గా నిలిచింది. తనకు ఒక్కతే రెండేసి స్కిట్లలో నటిస్తుండటం తాజాగా షాకింగ్ గా మారింది. ఇక మిగిలిన ఆర్టిస్టులు కూడా తమ స్కిట్లతో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.
మరోవైపు ఆటో రాం ప్రసాద్ స్కిట్ కూడా ఈసారి ఎపిసోడ్ లో హైలెట్ గా నిలిచే అవకాశం ఉంది. అలాగే యాదమ్మ రాజ్, తాగుబోతు రమేశ్, నూకరాజు, రాకెట్ రాఘవా వంటి వారు తమతమ స్కిట్లతో కొత్త పంచులతో అలరించేందుకు ప్రయత్నించారు. ఇక ఏప్రిల్ 4న, 5న సాయంత్రం ఈటీవీ విన్ లో ఈ ఫుల్ ఎపిసోడ్ ప్రసారం కానుంది. దాంతో ఎవరి స్కిట్ ఎలా పండబోతుందనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతానికి ప్రోమో అయితే ఆకట్టుకుంటోంది. ఇక ఈ షోకు యంగ్ బ్యూటీ రష్మీ గౌతమ్ యాంకర్ గా అలరిస్తోంది. తను కూడా స్కిట్ల మధ్యలో తనదైన శైలిలో పంచులు వేస్తూ ఆకట్టుకుంటోంది.
ఇక జబర్దస్త్ కామెడీ షో దశాబ్దకాలంగా నిర్విరామంగా ప్రసారం అవుతూ తెలుగు బుల్లితెర ఆడియెన్స్ ను నవ్విస్తూనే ఉంది. నాగబాబు, రోజాలు జడ్జీగా మొదలైన ఈ షోకు మనో, ఇంద్రజ, కృష్ణ భగవాన్ జడ్జీలుగా వ్యవహరించారు. ప్రస్తుతం శివాజీ, ఖుష్బూ లు జడ్జీలుగా వ్యవహరిస్తూ తీర్పులు ఇస్తున్నారు. కామెడీ షోను విజయ పథంవైపునకు నడిపిస్తున్నారు. ఈ షో ద్వారా యాంకర్ గా అనసూయ అలరించి.. ప్రస్తుతం ఏ రేంజ్ కు వెళ్లిందో తెలిసిందే. బిగ్ ప్రాజెక్ట్స్ ల్లో నటిగా అవకాశాలు అందుకుంటోంది. సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, ధన్ రాజ్, వేణు కూడా సినీ రంగంలో సక్సెస్ ను అందుకుంటున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











