జబర్ధస్త్ వర్ష బండారం బయట పెట్టిన మల్లెమాల: ఏకంగా ఆ వీడియో రిలీజ్.. అడ్డంగా బుక్కైపోయిన బ్యూటీ

కొంత కాలంగా జబర్ధస్త్ షోలో సందడి చేస్తూ తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన రీతిలో పాపులర్ అయిన బ్యూటీ వర్ష. మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించిన ఈమె.. ఆ తర్వాత నటిగానూ మారింది. ఇక, ఎప్పుడైతే జబర్ధస్త్ షోలోకి ఎంట్రీ ఇచ్చిందో.. అప్పటి నుంచి ఎనలేని క్రేజ్‌ను సొంతం చేసుకుంది. అదే సమయంలో సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తోంది. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం ఎంగేజ్‌మెంట్, మ్యారేజ్ అంటూ కొన్ని పోస్టులతో షాకిచ్చిందామె. ఇలాంటి సమయంలో తాజాగా మల్లెమాల యూనిట్ ఓ వీడియోను షేర్ చేసి వర్ష బండారం బయట పెట్టింది. ఆ వివరాలు మీకోసం!

సీరియల్ నటిగా మొదలైన ప్రయాణం

సీరియల్ నటిగా మొదలైన ప్రయాణం

మోడల్‌గా కెరీర్‌ను సాగిస్తోన్న సమయంలోనే వర్షకు పలు టీవీ సీరియళ్లలో నటించే అవకాశం దక్కింది. అలా తన యాక్టింగ్ కెరీర్‌ను బుల్లితెరపై ప్రారంభించిందామె. ఈ క్రమంలోనే పలు ఛానెళ్లలో ప్రసారం అయిన అవుతోన్న 'అభిషేకం', 'తూర్పు పడమర', 'ప్రేమ ఎంత మధురం' వంటి సీరియళ్లలో భాగం అయింది. వీటిలో అందంతో పాటు యాక్టింగ్‌లోనూ మెప్పిస్తూ సత్తా చాటుతోందీ భామ.

జబర్ధస్త్ ఎంట్రీతో కెరీర్ మారిపోయింది

జబర్ధస్త్ ఎంట్రీతో కెరీర్ మారిపోయింది

సీరియల్ నటిగా ఫుల్ బిజీగా గడుపుతోన్న సమయంలోనే వర్షకు జబర్ధస్త్‌ షోలో గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చే అవకాశం వచ్చింది. హైపర్ ఆదితో ఆమె పలు స్కిట్లు చేసి మెప్పించింది. ఈ క్రమంలోనే యంగ్ కమెడియన్ ఇమాన్యూయేల్‌తో ప్రేమాయణం అంటూ ఎంతగానో ఫేమస్ అయింది. దీంతో వర్ష ఈ షోలో పర్మినెంట్ మెంబర్ అయిపోవడంతో పాటు ఊహించని రీతిలో గుర్తింపు అందుకుంది.

 అందులో యమ యాక్టివ్‌గా ఉంటోంది

అందులో యమ యాక్టివ్‌గా ఉంటోంది

ప్రస్తుతం వర్ష జబర్ధస్త్‌తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ అనే షోలోనూ చేస్తోంది. వీటితో పాటు కొన్ని సీరియళ్లలోనూ నటిస్తోంది. ఇలా కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ.. సోషల్ మీడియాలో కూడా ఆమె ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తరచూ తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలు వెల్లడించడంతో పాటు అప్పుడప్పుడూ అందాల విందు చేస్తూ సెన్సేషన్ అవుతోంది.

 ఎంగేజ్‌మెంట్, మ్యారేజ్‌పై వర్ష పోస్టులు

ఎంగేజ్‌మెంట్, మ్యారేజ్‌పై వర్ష పోస్టులు

సోషల్ మీడియాలో ఎప్పుడూ రచ్చ చేస్తూ ఉండే వర్ష.. రెండు రోజుల క్రితం షాకింగ్ పోస్టులు పెట్టి హాట్ టాపిక్ అయిపోయింది. వాటిలో తనకు ఎంగేజ్‌మెంట్ జరిగిపోయిందని అనిపించేలా రింగ్ ధరించిన ఓ ఫొటోను ఇన్‌స్టాలో షేర్ చేసింది. అంతేకాదు, జూలై 4న బిగ్ అనౌన్స్‌మెంట్ అంటూ మరో పోస్టును కూడా పెట్టింది. అందులో అయితే పెళ్లికి సంబంధించిన స్టిక్కర్లను కూడా వాడింది.

వర్ష బండారం బయట పెట్టిన యూనిట్

వర్ష బండారం బయట పెట్టిన యూనిట్

వర్ష ఆ పోస్టులు చేసిన తర్వాత అందరూ ఆమెకు నిజంగానే ఎంగేజ్‌మెంట్ అయిపోయిందని.. పెళ్లికి రెడీ అయిందని అనుకున్నారు. ఈ క్రమంలోనే అసలు ఆమె ఎవరిని వివాహం ఆడబోతుందని ఆలోచనలో పడిపోయారు. అంతేకాదు, జూలై 4న ఎలాంటి ప్రకటన చేయబోతుందో అని వేచి చూస్తున్నారు. ఈ నేపథ్యంలో మల్లెమాట యూనిట్ జబర్ధస్త్ వర్ష బండారాన్ని బయట పెట్టేసింది.

ఏకంగా ఆ వీడియోను రిలీజ్ చేసి మరీ

మల్లెమాల యూనిట్ ప్రస్తుతం జబర్ధస్త్‌తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ అనే షోను కూడా నడిపిస్తోంది. ఈ క్రమంలోనే దీనికి సంబంధించిన ఓ ప్రోమో వీడియోను తాజాగా షేర్ చేసింది. అయితే, ఇది వచ్చే వారం ప్రసారం అయ్యే ఎపిసోడ్‌కు సంబంధించినది కాదు.. జూలై 4న రాబోయే ఎపిసోడ్‌ది. అవును.. వర్ష చెప్పి తేదీదే. ఇక, ఇందులో ఆమెకు ఇమాన్యూయేల్‌తో పెళ్లి జరిగినట్లు చూపించారు.

Recommended Video

Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!
అడ్డంగా బుక్కైన బ్యూటీ.. విమర్శలతో

అడ్డంగా బుక్కైన బ్యూటీ.. విమర్శలతో

ఈ వీడియో చూసిన తర్వాత వర్ష శ్రీదేవి డ్రామా కంపెనీ షో కోసం డ్రామా ఆడిందన్న విషయం అందరికీ తెలిసిపోయింది. దీంతో ఈ అమ్మడు అడ్డంగా దొరికిపోయింది. ఫలితంగా ఈ బ్యూటీపై నెటిజన్లు ఓ రేంజ్‌లో విరుచుకుపడుతున్నారు. షో కోసమో, ప్రమోషన్ కోసమో ఇలాంటి చీప్ ట్రిక్స్ ఎందుకు అంటూ ఆమెను విమర్శిస్తున్నారు. అలాగే, మీమ్స్ క్రియేట్ చేసి తెగ ట్రోల్స్ చేసేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X