కలకలం రేపుతోన్న జబర్ధస్త్ వర్ష ఇన్‌స్టా స్టోరీ: ఏకంగా ఆ మాట అనడంతో అనుమానాలు

తెలుగు టెలివిజన్ హిస్టరీలోనే భారీ స్థాయిలో ప్రేక్షకాదరణను సొంతం చేసుకుంటూ నెంబర్ వన్ కామెడీ షోగా వెలుగొందుతోంది జబర్ధస్త్. సుదీర్ఘ కాలంగా రన్ అవుతోన్నా ఏమాత్రం తగ్గకుండా ముందుకు సాగుతోంది. ఇక, దీని ద్వారా ఎంతో మంది ఆర్టిస్టులు వెలుగులోకి వచ్చారు. తద్వారా బిగ్ సెలెబ్రిటీలుగా మారిపోయారు. అలాంటి వారిలో క్యూట్ బ్యూటీ వర్ష ఒకరు.

బుల్లితెరపైకి ఎప్పుడో వచ్చిన ఈ భామ.. జబర్ధస్త్ షోలోకి ఎంట్రీ ఇవ్వడం ద్వారా ఫుల్ ఫేమస్ అయిపోయింది. అప్పటి నుంచి ఏమాత్రం వెనక్కి తిరిగి చూడకుండా దూసుకుపోతోంది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ తెగ సందడి చేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా వర్ష ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన స్టోరీ వైరల్ అవుతోంది. అసలేం జరిగిందో మీరే చూడండి!

 అలా మొదలైన వర్ష ప్రయాణం

అలా మొదలైన వర్ష ప్రయాణం

నటిగా మారడానికి ముందే వర్ష మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. అందులో తన అందచందాలతో అందరి దృష్టినీ ఆకర్షించిన ఈ చిన్నది.. ఆ వెంటనే బుల్లితెరపైకి అడుగు పెట్టింది. ఈ క్రమంలోనే 'అభిషేకం', 'తూర్పు పడమర', 'ప్రేమ ఎంత మధురం' వంటి సీరియళ్లలో నటించింది. తద్వారా సీరియల్ నటిగానే వర్ష తెలుగు రాష్ట్రాల్లో గుర్తింపును అందుకుంది.

జబర్ధస్త్‌లోకి రావడంతో ఫేమస్

జబర్ధస్త్‌లోకి రావడంతో ఫేమస్


బుల్లితెరపై చాలా కాలం పాటు సందడి చేస్తోన్న వర్ష.. జబర్ధస్త్ షోలోకి ఓ స్కిట్‌లో గెస్టుగా వచ్చి నటించింది. మొదటి దానిలోనే ఈమె అందరి దృష్టినీ ఆకర్షించి.. గుర్తింపును తెచ్చుకుంది. దీంతో ఆమెకు వరుసగా స్కిట్లు చేసే అవకాశం దక్కింది. దీంతో అందులో వర్ష పర్మినెంట్ ఆర్టిస్టుగా మారిపోయింది. అప్పటి నుంచి ఆ షోలో తెగ హైలైట్ అవుతూ మరింతగా ఫేమస్ అయిపోయింది.

అన్నింట్లోనూ భాగమైన బ్యూటీ

అన్నింట్లోనూ భాగమైన బ్యూటీ


ఆకట్టుకునే అందం, అద్భుతమైన అభినయంతో ఆరంభంలోనే అందరి దృష్టినీ ఆకర్షించిన వర్ష.. చాలా తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను అందుకుంది. కామెడీ షోకు కావాల్సిన టైమింగ్ కూడా ఉండడంతో ఈ బ్యూటీ మరిన్ని అవకాశాలను అందుకుంది. దీంతో జబర్ధస్త్‌, స్పెషల్ ఈవెంట్లతో పాటు 'శ్రీదేవీ డ్రామా కంపెనీ' షోలోనూ భాగం అయింది.

అతడితో లవ్ ట్రాకుతో క్రేజీగా

అతడితో లవ్ ట్రాకుతో క్రేజీగా


జబర్ధస్త్‌లో కమెడియన్‌గా సందడి చేస్తోన్న ఇమాన్యూయేల్‌తో లవ్ ట్రాక్ వల్ల జబర్ధస్త్ వర్ష మరింత పాపులర్ అయింది. అతడితో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ చేసే స్కిట్ల వల్లే భారీ స్థాయిలో క్రేజ్ వచ్చింది. ఇక, తరచూ అతడితో హగ్గులు, ముద్దులతో రెచ్చిపోతూ హైలైట్ అయింది. ఇక, కొద్ది రోజుల క్రితం వీళ్లిద్దరికీ పెళ్లి జరిగినట్లు కూడా చూపించడంతో అతడికి జంటగా మారింది.

సోషల్ మీడియాలో హల్‌చల్

సోషల్ మీడియాలో హల్‌చల్


ఒకవైపు టీవీ షోలు, మరోవైపు సీరియళ్లు చేస్తూ కెరీర్ పరంగా ఎంతో బిజీగా గడుపుతోన్న జబర్ధస్త్ వర్ష సోషల్ మీడియాలో సైతం యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే నిత్యం తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అదే సమయంలో ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. ఇలా తన ఫాలోయింగ్‌ను మరింతగా పెంచుకుంటోంది.

కలకలం రేపేలా ఇన్‌స్టా స్టోరీ

కలకలం రేపేలా ఇన్‌స్టా స్టోరీ


సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే జబర్ధస్త్ వర్ష తరచూ తనకు సంబంధించిన పర్సనల్ విషయాలను కూడా పోస్ట్ చేస్తూ ఉంటోంది. దీంతో ఈ అమ్మడు నిత్యం వార్తల్లోనే ఉంటూ మరింత హైలైట్ అవుతోంది. అలాంటిది తాజాగా జబర్ధస్త్ వర్ష తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో 'ఎవరికి చెప్పాలి నా బాధ' అంటూ ఓ స్టోరీని పెట్టుకుంది. ఇది ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.

ఆ మాటనే అనడంతో డౌట్లు

ఆ మాటనే అనడంతో డౌట్లు


వరుసగా ఆఫర్ల మీద ఆఫర్లు అందుకుంటూ కెరీర్ పరంగా ఎంతో జోష్‌లో ఉన్న వర్ష.. ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో చేసిన పోస్టు చర్చనీయాంశం అవుతోంది. దీంతో ఆమెకు అసలు ఏం బాధ వచ్చింది? ఏదైనా సమస్య వచ్చింది? జబర్ధస్త్‌లో వర్షకు విభేదాలు వచ్చాయా? అంటూ నెటిజన్లు ఆరా తీస్తున్నారు. ఇలా ఈ అమ్మాయి చేసిన పోస్ట్ వల్ల ఎన్నో అనుమానాలు వస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X