నడుము చూపించు.. ఇంత పొట్టి బట్టలా? ఇమ్ము నోటి దూల.. స్టేజి మీద ఏడ్చేసిన జబర్దస్త్ వర్ష!
జబర్దస్త్ ఎంతోమంది నటులకు లైఫ్ ఇచ్చింది. అందులో ఒక చిన్న స్కిట్ లో రెండు నిముషాలు చేసినవారే ఇప్పుడు స్టార్స్ గా కొనసాగుతున్నారు. ఇక అలా రెండు నిముషాలు స్కిట్ లో కనిపించి.. ఆ తరువాత జబర్దస్త్ లో పాతుకుపోయిన ఆర్టిస్ట్ లలో వర్ష ఒకరు. లేడీ కమెడియన్ గా మానెను చెప్పలేం కానీ, ఒక ఆర్టిస్ట్ గా ఆమె జబర్దస్త్ కు ఎంట్రీ ఇచ్చింది. అలా వచ్చిందో లేదో.. ఇమ్మానియేల్ తో లవ్ ట్రాక్ పెట్టారు. రష్మీ, సుధీర్ లవ్ ట్రాక్ తరువాత అంతగా హిట్ అయిన లవ్ ట్రాక్ అయితే వీరిదే చెప్పాలి.
ఇమ్మానియేల్ దూరమైతే కష్టం మేడమ్ అంటూ ఏడ్చిన వీడియో ఇప్పటికీ నెట్టింట వైరల్ గా మారింది. అలా వర్ష ఒక స్టార్ సెలబ్రిటీగా మారిపోయింది. ఇక ఈ లవ్ ట్రాక్ తరువాత బయట కూడా వర్ష- ఇమ్ము పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు కూడా వచ్చాయి. అయితే అందులో నిజం లేదని, తాము కేవలం రీల్ వరకే లవర్స్ లా నటిస్తున్నామని, బయట ఇమ్ము తనకు మంచి స్నేహితుడు అని వర్ష చెప్పుకొచ్చింది. ఇవన్నీ పక్కన పెడితే ప్రస్తుతం వర్ష వరుస షోస్ తో బిజీగా మారింది. ఇమ్ము- వర్ష కలిసి మనసంతా నువ్వే అనే షో చేస్తున్నారు.

తాజాగా ఈ షోకు సంబంధించిన ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. మనసంతా నువ్వే షో థీమ్ ఏంటంటే.. కొంతమంది కాలేజ్ స్టూడెంట్స్ ను పిలిచి.. వారితో సరదాగా ఆటలు ఆడిస్తారు. అంతేకాకుండా ఒరిజినల్ గా విడిపోయిన జంటలు ఉంటే.. వారి కథలను స్కిట్ రూపం లో చేసి.. అందరికి చూపిస్తారు. ఇక ఈ ప్రోమోలో వర్షను ఇమ్ము ఆడేసుకున్నాడు.

మనసంతా నువ్వే షో రెండు ఎపిసోడ్స్ రిలీజ్ అయ్యాయి కదా.. నీకు ఎవరైనా ఫోన్ చేసి ఏమైనా అన్నారా అని ఇమ్ము అడగ్గా .. మీ షో సూపర్ అన్నారు అని వర్ష చెప్పింది. మరి నీకు ఫోన్ చేసి ఏం చెప్పారు అని వర్ష అడగ్గా.. ఫ్రీ షో ఆపేయమన్నారు.. నేను చూపించింది చిన్న నడుమే కదా అని వర్ష అంటే.. నువ్వు నడుము చూపించడం లేదమ్మా.. బట్టలు ఇంత చిన్నగా చూపిస్తున్నావు అని సెటైర్ వేశాడు.
ఇక ఈ షోలో వర్ష ఎమోషనల్ అయ్యింది. స్కిట్ లో భాగంగా ఒక జంట ప్రేమ కథను చూపించారు. అందులో అబ్బాయి.. అమ్మాయిని అనుమానిస్తాడు. ఆ అనుమానంతోనే వాటి ప్రేమ విడిపోయింది అని చెప్పారు. ఇక స్కిట్ తరువాత వర్ష మాట్లాడుతూ.. ఒక అమ్మాయి మీద తెలిసీతెలియనట్లు ఊరికే మాట అనేస్తారు.. ఆడవాళ్లంటే అంత లోకువ.. ఎక్కడపడితే అక్కడ ఏదిపడితే అది మాట్లాడేస్తారు అంటూ స్టేజిపైనే ఏడ్చేసింది. ఈ ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది.


Click it and Unblock the Notifications











