For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఇమ్మానియేల్ కు వర్ష గ్రీన్ సిగ్నల్.. ఆ మాటతో అందరి ఫ్యూజ్ లు ఔట్!

  |

  తెలుగు బుల్లితెరలో ఎప్పటి నుంచో ఆడియన్స్‌ను అలరిస్తూ ఎంతో కమంది మెడియన్స్‌కు జీవితాన్ని ఇచ్చింది జబర్దస్త్ కామెడీ షో. ఈ షో ద్వారా పరిచయం అయిన ఎందరో కమెడియన్లు కొంతమంది ఇప్పుడు సినిమాల్లో రాణిస్తున్నారు. అలా ఎంతో మంది ఈ వేదికపై హిట్ అయ్యి బయటకు వెళ్ళిపోతూ ఉండటంతో కొత్త కొత్త జోడీలను తెర మీదకు తీసుకు వస్తున్నారు. అలా సుధీర్-రష్మీ జంట ఎంత ఫేమస్ అయిందో ఇప్పుడు ఇమ్మానుయేల్-వర్ష జంట కూడా అంతే ఫేమస్ అయింది. తాజాగా ఈ విషయంలో వర్ష ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆ వివరాల్లోకి వెళితే

  హిట్ అయిందని

  హిట్ అయిందని


  ఇమ్మానుయేల్-వర్ష జంట స్క్రీన్ ప్రెజెన్స్ కి కూడా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ దక్కుతోంది. దీంతో జబర్దస్త్ ఎపిసోడ్స్, స్పెషల్ షోస్‌లో ఇమ్మానుయేల్-వర్ష పెయిర్ గట్టిగానే హల్చల్ చేసింది. ఇద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్నారని వార్తలు కూడా బయటకి వచ్చాయి. డానికి తోడు కొన్ని ఇంటర్వ్యూలలో వర్ష కూడా అనుమానం వచ్చేలానే కామెంట్లు చేసింది. ఒక్క డైలాగ్ ఇమ్మానుయేల్‌తో చేస్తే అది హిట్ అయిందని వర్ష చెప్పుకొచ్చింది.

  ఎమోషనల్ అవుతా

  ఎమోషనల్ అవుతా

  ఇమ్మూ నాకు మంచి ఫ్రెండ్ అని చెప్పలేనని, మా ఇద్దరి రిలేషన్ షిప్ ఏంటి అని నేను చెప్పలేకపోతున్నానని ఆమధ్య పేర్కొంది. మా ఇద్దరిది ఓ బాండింగ్, అది స్కిట్ తరువాత కూడా ఉంటుంది. భవిష్యత్‌లో నిజమవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు. నేనంటే అతనికి చాలా అభిమానం, ఇమ్ము అంటే నాక్కూడా చాలా అభిమానమని ఆమె పేర్కొంది. మేమంతా ఒక ఫ్యామిలీగా కలిసిపోయామన్న ఆమె సెట్‌లో ఒక్కోసారి మేం నిజంగానే ఎమోషనల్ అవుతామని కూడా చెప్పుకొచ్చింది.

  సమస్య లేదని

  సమస్య లేదని

  ఇక అదలా ఉంచితే తాజాగా రిలీజ్ అయిన ఎక్స్ ట్రా జబర్దస్త్ ప్రోమోలో ఆమె చేసిన కామెంట్లు ఆసక్తికరంగా మారాయి. జడ్జిగా ఉన్న ఇంద్రజ స్కిట్ అయిపోయిన తర్వాత సాధారణంగా ప్రేమించుకున్న వాళ్ళ మధ్య అనుమానాలు రావడం సహజమే ఎప్పుడైనా మీ మధ్య అటువంటిది వచ్చిందా అని వర్ష ని అడిగింది. దానికి ఇక వర్ష సమాధానంగా నా జీవితంలో ఏదైనా అదృష్టం ఉంది అంటే అది నా ఇమ్మూ మాత్రమే .. ఎవరు ఏమనుకున్నా.. నాకు ఎటువంటి సమస్య లేదని చెప్పుకొచ్చింది.

  బయట పెట్టేసి

  బయట పెట్టేసి

  వాడు ఏంటి, ఆ అమ్మాయి ఏంటి, అది - ఇది, వీళ్ళిద్దరికి అలా ఎలా కుదిరింది అని ఇలా ఎవరు ఎన్ని అనుకున్నా నాకు సమస్య లేదనబి ఆమె కుండబద్దలు కొట్టేసింది. ఈ రోజు నేను చెబుతున్నా ఇమ్మూ అంటే నిజంగా నాకు ఇష్టం అంటూ అతని వైపు చూస్తూ తన ప్రేమను బయట పెట్టేసింది వర్ష.

  ప్రోమో కోసమేనా

  ప్రోమో కోసమేనా

  ఇక స్టేజి మీద నుంచి వర్ష కిందకు వెళుతూ మీ అమ్మకు చెప్పు కోడలు వస్తుందని అంటూ ఇమ్మాన్యుయేల్ తో చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అయితే ఇమ్మాన్యూయేల్ మాత్రం షాక్ లో ఉండగా ఇదంతా చూసి అందరూ షాకవుతారు. ఇదంతా నిజమేనా లేక ప్రోమో కోసమేనా అనేది పూర్తి ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకూ తెలియదు.

  English summary
  Jabardasth varsha intresting comments with emmanueal in extra jabardasth promo gone viral in social media.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X