జబర్దస్త్ వర్షకు 35 పెళ్లిళ్లు.. అతనితో కలిసి.. అసలు విషయం బయటపెట్టిన నటుడు

బుల్లితెర ప్రేక్షకులకు ఎంతగానో పరిచయం అయింది వర్ష. జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎంతో మందికి మంచి జీవితం వరించిన సంగతి తెలిసిందే. ఈ వేదిక నుంచి కామెడీ ఆర్టిస్టులుగా గుర్తింపు పొందడమే కాకుండా హీరోలుగా, ప్రముఖ నటులుగా అవకాశాలు అందుకుంటున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, అనసూయ, వేణు, హైపర్ ఆది సినిమా రంగంలో సక్సెస్ సాధించిన సంగతి విధితమే. ఇదే క్రమంలో జబర్దస్త్ వేదికపై ప్రస్తుతం వర్ష సందడి చేస్తోంది. తనదైన శైలిలో కామెడీ పంచుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

జబర్దస్త్ కమెడియన్ ఇమ్మానుయేల్ టీం లో వర్ష లేడీ ఆర్టిస్ట్ గా ఎన్నో కామెడీ స్కిట్లలో నటించింది. అలా క్రమక్రమంగా తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఓవైపు కామెడీ స్కిట్లతో అదరగొడుతూనే.. మరోవైపు తన పంచులు, ప్రాసలు వదులుతూ ఆకట్టుకుంటుంది. అలాగే ట్రెండీ వేర్స్, లేటెస్ట్ ఫ్యాషన్ ను ఫాలో అవుతూ రకరకాల దుస్తులు ధరిస్తూ జబర్దస్త్ వేదికపై మెరుస్తుంది. తన అందంతో ప్రేక్షకులను ఇట్టే కట్టిపడిస్తోంది. ఈ వేదికపై నవ్వులు పంచడమే కాకుండా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ తో ఆడియన్స్ దృష్టిని తన వైపు తిప్పుకునేలా చేస్తోంది.

Jabardasth Varsha Latest comedy skit

ఇక తాజాగా జబర్దస్త్ కామెడీ షోకు సంబంధించిన లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమో ఆకట్టుకుంటుంది. తాజాగా విడుదలైన జబర్దస్త్ కామెడీ షో ప్రోమోలో వర్ష మాట్లాడిన మాటలు ఆసక్తికరంగా మారాయి. బుల్లెట్ భాస్కర్ టీంలో ఈసారి వర్ష మరింత కామెడీని పంచింది. అయితే తాజా స్క్రిప్ట్ లో వర్ష తన పెళ్లి గురించి మాట్లాడింది. ఇప్పటికే పలుమార్లు ఆయా స్కిట్లలో పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. పలువురితో రిలేషన్ షిప్ అంటూ వార్తలు కూడా ఆ మధ్యలో ప్రచారం అయ్యాయి.

కానీ వాటన్నిటిని వర్ష కొట్టిపారేసింది. అలాంటిది ఏమీ లేదని పలు ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. అయితే తాజా స్కిట్ లో వర్ష కు మరోసారి పెళ్లి అంటూ డైలాగ్ వచ్చింది. దాంతో బుల్లెట్ భాస్కర్ వర్షకి ఇది మొదటి పెళ్లినా? అని జబర్దస్త్ కమెడియన్ నరేష్ ను ప్రశ్నిస్తాడు. కాదు ఇది 34 అంటాడు. వారి మాటలకు కోపం తెచ్చుకున్న వర్ష.. కాదు 35 పెళ్లిళ్లు జరిగాయనీ మండిపడుతుంది. ఇక వెంటనే నరేష్ ఆ వెస్టిండీస్ వాడితో కలిపి 35 పెళ్లిళ్లు సరిగానే చెప్పావు అంటూ కౌంటర్ ఇస్తాడు. దానికి వర్ష ఎలా స్పందించిందనేది ఆసక్తికరంగా మారింది.

దశాబ్దానికి పైగా జబర్దస్త్ కామెడీ షో తెలుగు ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. టెలివిజన్ రంగంలో అంతకంతకు సంచలనంగా మారుతుంది. ప్రస్తుతం ఈ కామెడీ షోకు టాలీవుడ్ ప్రముఖ నటుడు, బిగ్ బాస్ శివాజీ జడ్జిగా వ్యవహరిస్తున్నారు. టాలీవుడ్ సీనియర్ లయ లేడీ జడ్జిగా తీర్పులిస్తున్నారు. మరోవైపు వర్ష జబర్దస్త్ తో పాటు కిసిక్క్ టాక్స్ అనే టాక్ షోకు యాంకర్ గా వ్యవహరిస్తుంది. పలువురు సెలబ్రిటీలను ఆహ్వానిస్తూ వారి వ్యక్తిగత విషయాలను ఆడియన్స్ కు తెలియజేస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X