Jabardasth Varsha : చిలకపచ్చ చీరలో జబర్దస్త్ వర్ష సొగసులు .. ఆ స్పాట్‌లో పుట్టుమచ్చ చూపెడుతూ

దాదాపు దశాబ్ధానికి పైగా తెలుగు ప్రేక్షకులను నవ్వుల జల్లులో తడిసి ముద్ధ చేస్తోంది జబర్దస్త్. తెలుగు ఎంటర్‌టైన్మెంట్ ఛానెల్ ఈటీవీలో ప్రసారమవుతున్న ఈ షో.. కామెడీ సెక్టార్‌లో నెంబర్‌వన్‌గా దూసుకెళ్తోంది. దీనికి నకలుగా పలు ఛానెల్స్‌లో కార్యక్రమాలు వచ్చినా జబర్దస్త్‌ను అవీ బీట్ చేయలేకపోయాయి. నేటికీ కళ్లు చెదిరే టీఆర్పీలతో జబర్దస్త్ దూసుకెళ్తోంది. ఈ షో ద్వారా ఎంతో మంది ప్రతిభావంతులు ప్రేక్షకులకు పరిచయమయ్యారు.

టాలెంట్ ఉండి దానిని ఎలా నిరూపించుకోవాలో తెలియని ఎంతో మందికి ఇది ఓ వేదికలా నిలిచింది. జబర్దస్త్ ద్వారా ధనరాజ్, చమ్మక్ చంద్ర, షకలక శంకర్, వేణు , సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, గెటప్ శ్రీను వంటి నటులు సినిమాల్లో అవకాశాలు దక్కించుకుని, హీరోలగాను నటించారు.. ఇంకా నటిస్తున్నారు. వారిలో ఒకరు వర్ష ఒకరు. ఇమ్మానుయేల్‌కు జోడీగా ఎన్నో స్కిట్లు చేసి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు చాలా దగ్గర అయింది ఈ క్యూట్ బ్యూటీ.

Jabardasth Varsha latest Photoshoot with peacock green color saree Her latest photos here

అందం, అభినయం కలగలపిన ఈమె.. చక్కటి కామెడీ టైమింగ్ తో అందరినీ తెగ అలరిస్తుంటుంది. అందుకే అతి తక్కువ కాలంలోనే యూత్‌లో విపరీతమైన క్రేజ్ దక్కించుకుంది. హీరోయిన్లకు ఏమాత్రం తగ్గని అందంతో హల్‌చల్ చేస్తోంది. తారలతో సమానంగా షాపింగ్ మాల్స్ ఓపెనింగ్, బ్రాండ్ అండార్స్‌మెంట్స్‌లో పాల్గొని రెండు చేతులా సంపాదిస్తోంది జబర్దస్త్ వర్త. సుధీర్ - రష్మి తర్వాత జబర్దస్త్‌లో పాపులర్ అయిన జోడి వర్ష - ఇమ్మాన్యుయేలే.

వారిద్దరూ ప్రేమించుకుంటున్నారని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని ఇప్పటికే రకరకాల కథనాలు వైరల్ అవుతూనే ఉన్నాయి. మొన్నామధ్య ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో చిట్ చాట్ నిర్వహించారు వర్ష. ఈ సందర్భంగా ఇమ్మాన్యుయేల్‌తో మీ పెళ్లెప్పుడు అని ఓ నెటిజన్ అడగ్గా .. వర్ష తనదైన శైలిలో ఆన్సర్ ఇచ్చారు. ఇమ్ముతో నా పెళ్లి అనేది నా పర్సనల్ మేటర్ అని.. దాని గురించి మీకెందుకు చెప్పాలని కౌంటర్ ఇచ్చింది.

ఓవైపు టీవీ షోలు చేస్తూనే సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుందీ క్యూట్ బ్యూటీ. తనకు సంబంధించిన పర్సనల్ , ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన అప్ డేట్లను కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఎప్పటికప్పుడు అదిరిపోయే ఔట్ ఫిట్లు ధరిస్తూ... తన అందాలతో కుర్రకారుకు పిచ్చెక్కిస్తుంటుంది. తాజాగా చిలకపచ్చ రంగు చీర కట్టుకుని వర్ష చేసిన ఫోటో షూట్ వైరల్ అవుతోంది. చీరలో తన అందాలు ఆరబోసిన ఈ ముద్దుగుమ్మ.. నడుముపై పుట్టుమచ్చను చూపిస్తూ వింటర్‌లోనూ సెగలు రేపింది. మరి ఈ హట్ బ్యూటీ ఫోటోలను మీరూ చూసేయండి

More from Filmibeat

Read more about: varsha jabardasth
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X