For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  రవి షోలో రెచ్చిపోయిన జబర్ధస్త్ వర్ష: స్టేజ్‌ పైనే లిప్ కిస్ రచ్చ.. యవ్వారం మామూలుగా లేదే!

  |

  తెలుగు బుల్లితెరపైకి ఎంతో మంది అమ్మాయిలు ఎంట్రీ ఇస్తున్నారు. కానీ, వారిలో చాలా తక్కువ మందే విశేషమైన ఆదరణను అందుకుని సత్తా చాటుతున్నారు. తద్వారా వరుస అవకాశాలను అందుకుంటున్నారు. అలాంటి వారిలో హాట్ బ్యూటీ వర్ష ఒకరు. సీరియల్ నటిగా మొదలైన ఆమె ప్రస్థానం.. జబర్ధస్త్ షోతో భారీ స్థాయిలో గుర్తింపును అందుకుంది. అదే సమయంలో ఎన్నో షోలలో చేస్తూ హవాను చూపిస్తోంది. ఈ నేపథ్యంలోనే యాంకర్ రవి.. అషు రెడ్డి కలిసి చేస్తున్న 'హ్యాపీడేస్' షోలో వర్ష ఓ స్టూడెంట్‌కు లిప్ కిస్ ఇచ్చేసింది. ఇంకెందుకు ఆలస్యం మీరూ చూడండి!

  Anchor Anasuya జబర్దస్త్ క్రేజ్.. చేతినిండా ప్రెస్టీజియస్ సినిమాలు | #HBDAnasuya | Filmibeat Telugu
   అలా మొదలైన కెరీర్.. ఇలా ఫేమస్

  అలా మొదలైన కెరీర్.. ఇలా ఫేమస్

  నటిగా రాణించాలన్న లక్ష్యంతో మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది వర్ష. ఈ క్రమంలోనే ఎన్నో ఈవెంట్లలో క్యాట్ వాక్‌లు చేసిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత దర్శక నిర్మాతల దృష్టిలో పడింది. ఇలా పలు సీరియళ్లలో మంచి మంచి పాత్రలు చేసింది. తన కెరీర్‌లో ‘అభిషేకం', ‘తూర్పు పడమర', ‘ప్రేమ ఎంత మధురం' వంటి సీరియళ్లలో నటించింది. ఫలితంగా వరుస ఆఫర్లను అందుకుంటోంది.

   అతడి కోసం వచ్చింది.. అదరగొట్టింది

  అతడి కోసం వచ్చింది.. అదరగొట్టింది

  జబర్ధస్త్ షోలో లేడీ ఆర్టిస్టులు పెద్దగా కనిపించరు. అందుకే మగవాళ్లే అమ్మాయిల వేషాలు వేసుకుని స్కిట్లు చేస్తుంటారు. ఇలాంటి షోలో టాప్ టీమ్ లీడర్ హైపర్ ఆది తరచూ ఎవరో ఒక అమ్మాయిని తన టీమ్‌లోకి తీసుకొస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే చాలా రోజుల క్రితం వర్షను ఓ స్కిట్ కోసం తీసుకొచ్చాడు. ఆరంభంలోనే అందంతో పాటు యాక్టింగ్‌తో ఆకట్టుకుందీ బ్యూటీ.

  పర్మినెంట్ మెంబర్.. అందులో ఎంట్రీ

  పర్మినెంట్ మెంబర్.. అందులో ఎంట్రీ

  ఒకటి రెండు స్కిట్ల కోసం జబర్ధస్త్ షోలోకి ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ వర్ష.. చాలా తక్కువ సమయంలోనే ప్రేక్షకుల గుర్తింపును దక్కించుకుంది. తద్వారా షో నిర్వహకులనూ మెప్పించింది. దీంతో ఈమె అందులో పర్మినెంట్ ఆర్టిస్టుగా మారిపోయింది. అప్పటి నుంచి రాకింగ్ రాకేష్, కెవ్వు కార్తీక్ టీమ్‌లలో చేస్తూ అలరిస్తోంది. అలాగే, ‘శ్రీదేవీ డ్రామా కంపెనీ' అనే షోలోనూ చేస్తోందీ భామ.

   కమెడియన్‌తో లవ్‌తో యమ ఫేమస్

  కమెడియన్‌తో లవ్‌తో యమ ఫేమస్

  వర్ష తెలుగు రాష్ట్రాల్లో ఎనలేని క్రేజ్‌ను సంపాదించుకోవడానికి ఆమె టాలెంట్ ఒక కారణం అయితే.. యంగ్ కమెడియన్ ఇమాన్యూయేల్‌తో లవ్ ట్రాక్ మరో రీజన్ అని చెప్పొచ్చు. అతడితో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ చేసే స్కిట్ల వల్లే ఆమెకు భారీ స్థాయిలో ఫాలోయింగ్ వచ్చింది. ఇక, తరచూ అతడితో హగ్గులు, ముద్దులతో రెచ్చిపోతూ అమ్మడు వార్తల్లో నిలుస్తూ వస్తోంది.

   అందులో బిజీగా ఉంటూ రచ్చ చేస్తూ

  అందులో బిజీగా ఉంటూ రచ్చ చేస్తూ

  గతంలో వరుస సీరియళ్లు.. ఇప్పుడు జబర్ధస్త్, శ్రీదేవీ డ్రామా కంపెనీతో పాటు స్పెషల్ ఈవెంట్లలో పాల్గొంటూ ఫుల్ బిజీగా గడుపుతోంది వర్ష. అయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఈ అమ్మాయి ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తరచూ తనకు సంబంధించిన విషయాలతో పాటు కెరీర్‌ విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. తద్వారా ఫాలోవర్లను పెంచుకుంటోంది.

  ఆ షోలోకి ఎంట్రీ ఇచ్చిన జబర్ధస్త్ వర్ష

  యాంకర్ రవి.. అషు రెడ్డి కలయికలో వస్తున్న షో ‘హ్యాపీడేస్'. స్టూడెంట్లను తీసుకొచ్చి నిర్వహించే ఈ కార్యక్రమం ఇటీవలే ప్రారంభం అయింది. ఎంతో ఫన్నీగా సాగే ఈ షోకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందనే వస్తుంది. ఇక, ఈరోజు ప్రసారం కాబోతున్న ఎపిసోడ్ ప్రోమో తాజాగా విడుదలైంది. దీనికి జబర్ధస్త్ వర్ష గెస్టుగా వచ్చింది. ఆద్యంతం ఈ బ్యూటీ తనదైన టైమింగ్‌తో ఆకట్టుకుంది.

   స్టేజ్ మీదే లిప్ కిస్ ఇచ్చి షాకిచ్చింది

  స్టేజ్ మీదే లిప్ కిస్ ఇచ్చి షాకిచ్చింది

  గేమ్‌లో భాగంగా యాంకర్ రవి స్టూడెంట్లను ‘పార్క్ బెటరా? బీచ్ బెటరా' అని అడగగా.. అందులో ఓ అమ్మాయి ‘పార్కే బెటర్. ఎందుకంటే తుప్పలు ఉంటాయి కదా' అంటూ బదులిచ్చి షాకిచ్చింది. ఆ వెంటనే ఆ అమ్మాయి స్టేజ్ మీదకు రాగా.. ఆమెకు వర్ష లిప్ కిస్ ఇచ్చింది. అప్పుడు యాంకర్ రవి ఎంట్రీ ఇవ్వగా.. ఆ స్టూడెంట్ ‘ఇప్పుడే మొదలైంది. పక్కకు పో' అంటూ బెదిరించింది.

  English summary
  Telugu Actress, Model Jabardasth Fame Varsha Recently Participated in Happy Days Daily Show. In This Show She Gave Lip Kiss To Student.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X