For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Jabardasth ప్రమాదానికి గురైన జబర్ధస్త్ వర్ష: .. షాకిస్తోన్న వీడియో

  |

  తెలుగు బుల్లితెరపై ఎంతో మంది అమ్మాయిలు తెగ సందడి చేస్తున్నారు. అందులో కొందరు మాత్రం అంచనాలు లేకుండానే ఎంట్రీ ఇచ్చి.. భారీ స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకుంటున్నారు. అలాంటి వారిలో జబర్ధస్త్ బ్యూటీ వర్ష ఒకరు. మోడలింగ్ నుంచి టెలివిజన్ రంగంలోకి అడుగు పెట్టిన ఈ భామ.. చాలా తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును అందుకుంది. అదే సమయంలో తన అందం, అభినయంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. అలాగే, వరుసగా ఆఫర్లను కూడా అందుకుంటోంది. తద్వారా తెలుగు రాష్ట్రాల్లో బిగ్ సెలెబ్రిటీగా మారిపోయింది. ఇలాంటి తరుణంలో తాజాగా వర్ష ఓ షోలో ప్రమాదానికి గురైంది. దీంతో ఆ షో నిర్వహకులతో పాటు సెలెబ్రిటీలు అందరూ భయపడిపోయారు. దానికి సంబంధించిన వీడియోపై మీరూ కూడా ఓ లుక్కేయండి!

  అలా మొదలు పెట్టి.. ఇలా పాపులర్

  అలా మొదలు పెట్టి.. ఇలా పాపులర్

  పెద్ద నటి అవ్వాలన్న లక్ష్యంతో హైదరాబాద్‌లో అడుగు పెట్టి.. ముందుగా మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది తెలుగు అమ్మాయి వర్ష. ఈ క్రమంలోనే చాలా కాలం పాటు ఆ రంగంలో తన అందచందాలతో సత్తా చాటింది. ఆ తర్వాత సీరియల్ దర్శక నిర్మాతల దృష్టిలో పడడంతో బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలోనే 'అభిషేకం', 'తూర్పు పడమర', 'ప్రేమ ఎంత మధురం' వంటి సీరియళ్లలో మంచి మంచి పాత్రలను చేస్తోంది. వీటిలో అందంతో పాటు యాక్టింగ్‌లోనూ రాణిస్తూ సత్తా చాటుతోంది. తద్వారా మరిన్ని అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోందీ భామ.

  సునీతకు దారుణ అవమానం: అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తి తనే.. సీక్రెట్ రివీల్ చేసి బాధ పడిన సింగర్

  మామూలుగా వచ్చి... పర్మినెంట్‌గా

  మామూలుగా వచ్చి... పర్మినెంట్‌గా

  సుదీర్ఘ కాలంగా బుల్లితెరపై హవాను చూపిస్తూ నెంబర్ వన్ షోగా వెలుగొందుతోంది జబర్ధస్త్. ఈ షో ద్వారా ఎంతో మంది వెలుగులోకి వచ్చారు. కానీ, ఇందులో లేడీ ఆర్టిస్టులు మాత్రం కనిపించరు. కేవలం లేడీ గెటప్‌లతోనే స్కిట్లను చేస్తుంటారు. అలాంటిది వర్ష మాత్రం ఈ షోలో పర్మినెంట్ ఆర్టిస్టుగా మారిపోయింది. టాప్ టీమ్ లీడర్ హైపర్ ఆది తరచూ ఎవరో ఒక అమ్మాయిని తన టీమ్‌లోకి తీసుకొస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే వర్షను తీసుకుని వచ్చాడు. ఆరంభంలోనే ఆకట్టుకున్న ఈ బ్యూటీ.. అప్పటి నుంచి షోలో కొనసాగుతూ పర్మినెంట్ ఆర్టిస్టు కూడా అయిపోయింది.

   అన్నింట్లోనూ ఉంటూ రచ్చ చేస్తుంది

  అన్నింట్లోనూ ఉంటూ రచ్చ చేస్తుంది

  ఏమాత్రం అంచనాలు లేకుండానే జబర్ధస్త్‌లోకి ప్రవేశించిన వర్ష.. చాలా తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఆకట్టుకునే అందంతో పాటు యాక్టింగ్ చేయగల సామర్థ్యం ఉండడంతో ఈ బ్యూటీ వెనుదిరిగి చూడకుండా దూసుకుపోతోంది. అదే సమయంలో తెలుగు రాష్ట్రాల్లో ఎనలేని క్రేజ్‌ను సొంతం చేసుకుంది. ఫలితంగా ఇందులో వరుసగా స్కిట్లు చేస్తూ మెప్పిస్తోంది. అదే సమయంలో పలు స్పెషల్ ఈవెంట్లలోనూ సందడి చేస్తోంది. వీటితో పాటు అదే ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'శ్రీదేవీ డ్రామా కంపెనీ' అనే షోలోనూ భాగమై, ఫుల్ బిజీగా గడుపుతోంది.

  సింగర్ సునీత పర్సనల్ ఫొటోలు: హీరోయిన్లకు ఏమాత్రం తగ్గకుండా.. ఆమెను మీరెప్పుడూ ఇలా చూసుండరు!

  కమెడియన్‌తో లవ్ ట్రాకుతో ఫేమస్

  కమెడియన్‌తో లవ్ ట్రాకుతో ఫేమస్

  బుల్లితెరపై అడుగు పెట్టినప్పటి నుంచే తన అందంతో కుర్రాళ్ల గుండెళ్లో గాయాలు చేసిన వర్ష.. అనతి కాలంలోనే ఊహించని రీతిలో ఫేమస్ అయిపోయింది. అదే సమయంలో యంగ్ కమెడియన్ ఇమాన్యూయేల్‌తో లవ్ ట్రాక్ వల్ల మరింత పాపులర్ అయింది. అతడితో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ చేసే స్కిట్ల వల్లే భారీ స్థాయిలో క్రేజ్ వచ్చింది. ఇక, తరచూ అతడితో హగ్గులు, ముద్దులతో రెచ్చిపోతూ హాట్ టాపిక్ అయిపోయింది. ఇక, కొద్ది రోజుల క్రితం వీళ్లిద్దరికీ పెళ్లి జరిగినట్లు కూడా చూపించారు. అంతకు ముందు దీన్ని హైలైట్ చేయడానికి వర్ష సర్‌ప్రైజ్ అంటూ పోస్టులు పెట్టింది.

  సినీ నటితో ఓంకార్‌కు రిలేషన్: సుడిగాలి సుధీర్‌ షాకింగ్ కామెంట్స్.. ఆ మాటతో ఇరుక్కున్న కమెడియన్

  ఆ సీరియల్ టీమ్‌తో సందడి చేస్తూ

  ఆ సీరియల్ టీమ్‌తో సందడి చేస్తూ

  ప్రస్తుతం జీ తెలుగులో 'సూపర్ సీరియల్ ఛాంపియన్‌షిప్' అనే షో వస్తున్న విషయం తెలిసిందే. ప్రతి ఆదివారం ఇది ప్రసారం అవుతుంటుంది. ఒక్కో ఎపిసోడ్‌లో రెండు సీరియళ్లకు సంబంధించిన టీమ్‌లు వచ్చి గేమ్స్ ఆడుతుంటాయి. దీనికి యాంకర్‌గా ప్రదీప్ మాచిరాజు వ్యవహరిస్తున్నాడు. వచ్చే ఆదివారం రాత్రి ఇందులో 'ప్రేమ ఎంత మధురం', 'రామ సక్కని సీత' సీరియల్ నటీనటుల మధ్య పోటీ జరగబోతుంది. దీనికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ఇందులో జబర్ధస్త్ వర్ష తాను నటిస్తోన్న సీరియల్ 'ప్రేమ ఎంత మధురం' టీమ్‌తో వచ్చి తెగ సందడి చేసేసింది.

  జబర్ధస్త్ వర్ష పాట.. తర్వాత ప్రమాదం

  'సూపర్ సీరియల్ ఛాంపియన్‌షిప్'లో భాగంగా వచ్చే ఆదివారం సూపర్ స్టార్ మహేశ్ బాబు బర్త్‌డే స్పెషల్ ఎపిసోడ్ జరగబోతుంది. ఈ విషయాన్ని చెప్పిన ప్రదీప్.. ఎవరినైనా ఆయన పాటను పాడమని అడుగుతాడు. అంతలో జబర్ధస్త్ వర్ష 'గల గల పారుతున్న గోదారిలా' అంటూ స్వరం కలిపింది. దీంతో అందరూ షాక్ అవుతారు. అప్పుడు ప్రదీప్ 'మహేశ్ బాబు సార్.. ఈమెను నేను పాడమని చెప్పలేదు' అంటూ ఫన్ క్రియేట్ చేశాడు. ఇక, ఈ షోలో తన టీమ్ తరపున గేమ్ ఆడడానికి వచ్చిన ఈ బ్యూటీ చివర్లో ప్రమాదానికి గురైంది. దీన్ని ప్రోమోలో చూపించారు.

  Recommended Video

  Sanjana Galrani డ్రగ్స్‌ కేసు పై స్పందించిన హీరోయిన్ సంజన | Interview Part 3
  ఆ నటుడు గట్టిగా నెట్టడంతో ఘటన

  ఆ నటుడు గట్టిగా నెట్టడంతో ఘటన


  'సూపర్ సీరియల్ ఛాంపియన్‌షిప్' షోలో భాగంగా ఓ రౌండ్‌లో రోలర్ మీద ఒక చెక్కలాంటి దాన్ని పెట్టారు. దానిపై ఒకరు నిల్చుని బాల్ పట్టుకుని ఉండగా.. మరొకరు ముందుకు నెట్టాలి. ఈ గేమ్ కోసం 'ప్రేమ ఎంత మధురం' టీమ్ నుంచి మరో నటుడితో కలిసి వర్ష ముందుకు వచ్చింది. ఇక, ఈ గేమ్ జరుగుతోన్న సమయంలో కింద ఉన్న నటుడు అనుకోకుండా రోలర్‌ను గట్టిగా నెట్టేశాడు. దీంతో పైన ఉన్న వర్ష ఒక్కసారిగా పడిపోయింది. దీంతో ఆమెకు స్వల్ప గాయాలు కూడా అయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో పక్కనే ఉన్న ప్రదీప్‌తో పాటు సెలెబ్రిటీలంతా షాక్‌కు గురయ్యారు

  English summary
  Telugu Actress, Model Jabardasth Recently Participated in Super Serial Championship Season 3 Show. She Fell Down In This Show. This Video Gone Viral in Youtube.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X