శవమై ఇంటికొచ్చాడు.. మా బావ మరణం వెనుక వాళ్లే.. జబర్దస్త్ వర్ష జీవితంలో విషాదం

ప్రముఖ తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్‌లో ప్రసారమయ్యే జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంది ప్రతిభావంతులు పరిచయమయ్యారు. వీరిలో వర్ష కూడా ఒకరు. మేల్ డామినేషన్ ఉన్న ఈ కార్యక్రమంలో వర్ష తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. అన్నింటికి మించి తన అంద చందాలతో యాంకర్లు అనసూయ, రష్మీ గౌతమ్‌లకు పోటీ ఇచ్చేవారు. సోషల్ మీడియాలో జబర్డస్త్ వర్తకు భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. హాట్ హాట్ ఫోటో షూట్‌లతో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది వర్ష.

సీరియల్స్‌తో ఇండస్ట్రీలోకి
జబర్దస్త్‌కు ముందు పలు సీరియల్స్‌లో చిన్న చిన్న పాత్రలు పోషించింది వర్ష. జబర్దస్త్‌ను పలువురు కమెడియన్లు విడిచిపెట్టినప్పటికీ తను మాత్రం కార్యక్రమాన్ని నమ్ముకున్నారు. సెలబ్రెటీలకు మించి తెలుగు రాష్ట్రాల్లో షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్, ఇతర కార్యక్రమాలతో తన హవా చూపిస్తున్నారు. సినిమాలు, జబర్దస్త్ షో, ఇతర ఈవెంట్స్, బ్రాండ్ అండార్స్‌మెంట్స్‌తో రెండు చేతుల సంపాదిస్తున్నారు జబర్దస్త్ వర్ష. తాను ఈ స్థాయికి చేరుకోవడం వెనుక ఎంతో కష్టం, ఎన్ని అవమానాలు ఉన్నాయని పలుమార్లు చెప్పింది. ఇక జబర్దస్త్‌లోనే తన సహ నటుడు ఇమ్మాన్యుయేల్‌తో వర్ష ప్రేమాయణం నడుపుతోందని, త్వరలోనే వీరిద్దరి పెళ్లి అంటూ మీడియాలో రకరకాల కథనాలు వస్తున్నాయి. వీరిద్దరి లవ్ ట్రాక్ ఇప్పటికీ చర్చనీయాంశమే.

Jabardasth Varsha Revealed tragedy Story in her life

పిలిచి అవమానించారు
ప్రత్యక్షంగా, పరోక్షంగా కొందరు తన జీవితంపై దెబ్బకొట్టాలని చూశారని వర్ష పేర్కొంది. బయటివాళ్ల కంటే తెలిసినవాళ్లే ఇలా చేశారని తెలిసి తట్టుకోలేకపోయనని ఆవేదన వ్యక్తం చేసింది. కొన్నేళ్ల క్రితం ఓ ఈవెంట్ లేకపోయినా ఉందని చెప్పి.. పిలిచి మరీ అవమానకరంగా ప్రవర్తించారంటూ వాపోయింది వర్ష. స్కిట్స్‌లో తన మీద పంచ్‌లు వేస్తూ కామెడీ చేసినప్పుడు స్పోర్టివ్‌గానే తీసుకున్నానని.. కానీ ఎప్పుడైతే నిజంగా తిడుతున్నారని తెలిసిందో అప్పటి నుంచి తీసుకోలేకపోయానని ఆవేదన వ్యక్తం చేసింది.

మా బావ శవమై ఇంటికొచ్చాడు
జబర్దస్త్ చేస్తూనే ఇటీవల ఓ ఛానెల్‌లో పాడ్‌కాస్ట్‌ను హోస్ట్ చేస్తోంది వర్ష. ఈ క్రమంలోనే తన జీవితంలో చోటు చేసుకున్న విషాద ఘటనను పంచుకుంది. మా అక్కా బావ నన్ను ఎంతో ప్రేమగా చూసుకునేవారని.. ఓ రోజున పనిమీద బావగారు బయటికి వెళ్లారు. ఇంతలో ఓ బైక్ ఆయనను ఢీకొట్టడంతో స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయారని వర్ష ఆవేదన వ్యక్తం చేసింది. భర్త మరణవార్త తెలుసుకున్న మా అక్క డిప్రెషన్‌లోకి వెళ్లిపోయిందని.. మా బావగారి బట్టల్ని పట్టుకుని గదిలో ఏడుస్తూ ఉండిపోయిందని తెలిపింది.

నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయొద్దు
ఆయన శవాన్ని ఇంటికి తీసుకురాగా.. మా అక్క కొడుకు బాధతో నన్ను పట్టుకుని ఏడ్చేశాడని గుర్తుచేసుకుంది. మాకు బయటికెళ్లి టిఫిన్ తెచ్చుకోవడం కూడా తెలియదని, ఇక ఎవర్ని అడగాలి అంటూ అమాయకంగా అడిగేసరికి నాకు ఏడుపు ఆగలేదని వాపోయింది వర్ష. వాహనాలు నడిపేవారు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయొద్దని, మరొకరి ప్రాణాలు తీసేంత శాపంగా మారొద్దని ఆమె వేడుకుంది. ప్రస్తుతం వర్ష వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జీవితంలో ఇంత విషాదం, గుండెల్లో ఇంత బాధ పెట్టుకుని నవ్వుతూ నవ్విస్తున్నారా? అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X