For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఎంగేజ్‌మెంట్ రింగ్‌తో షాకిచ్చిన జబర్ధస్త్ వర్ష: ఆరోజునే బిగ్ అనౌన్స్‌మెంట్.. ఇమాన్యూయేల్‌కు బిగ్ షాక్

  |

  తెలుగు బుల్లితెరపైకి ఈ మధ్య కాలంలో ఎంతో మంది టాలెంట్ ఉన్న ఆర్టిస్టులు, టెక్నీషియన్లు ఎంట్రీ ఇచ్చారు. దీనికి కారణం కొత్త కొత్తగా ఎన్నో షోలు పుట్టుకొస్తుండడమే. అయితే, ఒకే ఒక్క షో మాత్రం వందల మందిని ఇండస్ట్రీకి పరిచయం చేసింది. అదే ప్రముఖ ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న జబర్ధస్త్. ఈ షో ద్వారానే వెలుగులోకి వచ్చిన వారిలో వర్ష ఒకరు. చాలా రోజులుగా ఆ షోలో సందడి చేస్తోన్న ఆమె.. తాజాగా ఓ షాకింగ్ ఫొటోను షేర్ చేసింది. అందులో వర్ష ఏకంగా ఎంగేజ్‌మెంట్ రింగ్‌తో కనిపించింది. అదే సమయంలో మరో ప్రకటన కూడా చేసింది. ఆ వివరాలు మీకోసం!

  అలా మొదలైన కెరీర్.. ఇలా ఫేమస్

  అలా మొదలైన కెరీర్.. ఇలా ఫేమస్

  యాక్టింగ్ మీద ఉన్న ఆసక్తితో మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది వర్ష. ఈ క్రమంలోనే చాలా కాలం పాటు అందులో బిజీగా గడిపింది. ఆ తర్వాత సీరియల్ దర్శక నిర్మాతల దృష్టిలో పడడంతో బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చింంది. ఈ క్రమంలోనే ‘అభిషేకం', ‘తూర్పు పడమర', ‘ప్రేమ ఎంత మధురం' వంటి సీరియళ్లలో చేస్తోంది. వీటిలో అందంతో పాటు యాక్టింగ్‌లోనూ రాణిస్తూ సత్తా చాటుతోంది.

  గెస్టుగా వచ్చి పర్మినెంట్ అయిందిగా

  గెస్టుగా వచ్చి పర్మినెంట్ అయిందిగా

  దాదాపు ఎనిమిదేళ్లుగా బుల్లితెరపై హవాను చూపిస్తూ నెంబర్ వన్ షోగా వెలుగొందుతోంది జబర్ధస్త్. ఇందులో లేడీ ఆర్టిస్టులు కనిపించరు. అలాంటిది వర్ష మాత్రం ఈ షోలో పర్మినెంట్ ఆర్టిస్టుగా మారిపోయింది. టాప్ టీమ్ లీడర్ హైపర్ ఆది తరచూ ఎవరో ఒక అమ్మాయిని తన టీమ్‌లోకి తీసుకొస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే వర్షను తీసుకురాగా.. ఆమె ఆకట్టుకుని షోలో కొనసాగుతోంది.

  వరుస ఆఫర్లతో హవాను చూపిస్తూ

  వరుస ఆఫర్లతో హవాను చూపిస్తూ

  గెస్టుగా జబర్ధస్త్‌లోకి ప్రవేశించిన వర్ష.. చాలా తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును సంపాదించుకుంది. అదే సమయంలో ఎనలేని క్రేజ్‌ను సొంతం చేసుకుంది. ఫలితంగా ఇందులో వరుసగా స్కిట్లు చేస్తూ మెప్పిస్తోంది. అదే సమయంలో పలు స్పెషల్ ఈవెంట్లలోనూ సందడి చేస్తోంది. వీటితో పాటు అదే ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న ‘శ్రీదేవీ డ్రామా కంపెనీ' అనే షోలోనూ భాగమైంది.

   అతడితో ప్రేమాయణంతో పాపులరిటీ

  అతడితో ప్రేమాయణంతో పాపులరిటీ

  తన అందంతో కుర్రాళ్ల గుండెళ్లో గాయాలు చేసిన వర్ష.. అనతి కాలంలోనే ఊహించని రీతిలో ఫేమస్ అయిపోయింది. అదే సమయంలో యంగ్ కమెడియన్ ఇమాన్యూయేల్‌తో లవ్ ట్రాక్ వల్ల మరింత పాపులర్ అయింది. అతడితో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ చేసే స్కిట్ల వల్లే భారీ స్థాయిలో క్రేజ్ వచ్చింది. ఇక, తరచూ అతడితో హగ్గులు, ముద్దులతో రెచ్చిపోతూ హాట్ టాపిక్ అయిపోయింది.

  అందులో మాత్రం బిజీగా ఉంటూ రచ్చ

  అందులో మాత్రం బిజీగా ఉంటూ రచ్చ

  వరుసగా సీరియళ్లు.. ఇప్పుడు జబర్ధస్త్, శ్రీదేవీ డ్రామా కంపెనీతో పాటు స్పెషల్ ఈవెంట్లలో పాల్గొంటూ ఫుల్ బిజీగా గడుపుతోంది వర్ష. అయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఈ అమ్మాయి ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తరచూ తనకు సంబంధించిన విషయాలతో పాటు కెరీర్‌ విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. తద్వారా ఫాలోవర్ల సంఖ్యను పెంచుకుంటోందామె.

  గ్లామర్ ట్రీట్‌తో సెగలు రేపుతోన్న వర్ష

  గ్లామర్ ట్రీట్‌తో సెగలు రేపుతోన్న వర్ష

  సోషల్ మీడియా పుణ్యమా అని గ్లామర్ ట్రీట్ ఇవ్వడంలో తెలుగు అమ్మాయిలు కూడా ముందుంటున్నారు. తద్వారా ఇంటర్నెట్‌లో సెన్సేషన్ అవడంతో పాటు అవకాశాలను కూడా అందుకుంటున్నారు. ఇలానే జబర్ధస్త్ వర్ష కూడా అందాల ఆరబోతలో బౌండరీలను దాటేసి మరీ రెచ్చిపోతోంది. ఫలితంగా తరచూ హాట్ హాట్ ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ రచ్చ చేస్తోంది.

  ఎంగేజ్‌మెంట్ రింగ్‌తో షాకిచ్చిన బ్యూటీ

  ఎంగేజ్‌మెంట్ రింగ్‌తో షాకిచ్చిన బ్యూటీ

  సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉండే వర్ష.. తనకు సంబంధించిన పర్సనల్ విషయాలను సైతం తరచూ పోస్ట్ చేస్తూ ఉంటోంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది. అందులో ఆమె స్టీరింగ్ మీద చేయి వేసి ఉండగా.. అందులో ఓ వేలికి ఎంగేజ్‌మెంట్ రింగ్ ధరించి కనిపించింది. దీంతో వర్షకు నిశ్చితార్థం అయిపోయిందని ప్రచారం జరుగుతోంది.

  Ananya Nagallla Is The New Super Star Says Play Back Director | Filmibeat Telugu
  ఆరోజే అనౌన్స్‌మెంట్.. ఇమ్మూకు షాక్

  ఆరోజే అనౌన్స్‌మెంట్.. ఇమ్మూకు షాక్

  ఎంగేజ్‌మెంట్ రింగ్‌తో కనిపించడంతో పాటు దానికి ‘జూలై 4న బిగ్ అనౌన్స్‌మెంట్' అంటూ క్యాప్షన్ పెట్టింది. మరో ఫొటోలో పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు ఎమోజీలను జత చేసింది. దీనికి కూడా బిగ్ అనౌన్స్‌మెంట్ అంటూ క్యాప్షన్ పెట్టింది. దీంతో ఇప్పటికే ఆమె ఎంగేజ్‌మెంట్ జరిగిపోయిందని.. పెళ్లి గురించి ప్రకటించబోతుందనే టాక్ వినిపిస్తోంది. దీంతో ఇమ్మూకు షాక్ అని అంటున్నారు.

  English summary
  Telugu Actress, Model Jabardasth Fame Varsha Very Active in Social Media. Now She Shared Engagement Ring Photo in Instagram.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X