Jabardasth Varsha: ఇమ్మానుయేల్‌కు హ్యాండ్ ఇచ్చిన జబర్దస్త్ వర్ష... అదేంటి అంత మాట అనేసింది?
జబర్దస్త్ షో గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఇక ఈ షో ఎంతో మందికి లైఫ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఎంతో మంది కమెడియన్స్ ను, దర్శకులను, హీరోలను ఇండస్ట్రీకి అందించింది ఈ షో. అయితే తాజాగా ఈ షోకి సంబంధించిన ప్రోమో రిలీజ్ కాగా.. అది నెట్టింట వైరల్ గా మారింది. కమెడియన్ ఇమ్మానుయేల్, వర్ష లవ్ ట్రాగ్ అందరికీ తెలిసిందే. అయితే తాజాగా వర్ష.. ఇమ్మానుయేల్ కు షాక్ ఇచ్చింది. అసలు విషయం ఏంటో ఈస్టోరీలో తెలుసుకుందాం.
జబర్దస్త్ షో... ఎంతో మందికి లైఫ్ ఇచ్చింది. ఈ షోలో కమెడియెన్ గా స్కిట్స్ చేసిన వారంతా.. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో టాప్ కమెడియన్స్ గా మారిపోయారు. గెటప్ శ్రీను, హైపర్ ఆది కమెడియన్స్ గా సెటిల్ అయిపోగా... సుడిగాలి సుదీర్ హీరోగా మారిపోయాడు. ఇక చమ్మక్ చంద్ర, వేణు, ధన్ రాజ్ ఇలా చాలా మంది ఇండస్ట్రీలో బిజీగా మారిపోయారు. ఇక డైరెక్టుర్లుగా మారి వారు కూడా ఉన్నారు. ఇక యాంకర్లుగా రష్మి, అనసూయ ఫేమస్ అయ్యారు.

అయితే తాజాగా ఈ షోకి సంబంధించిన ప్రోమో రిలీజ్ అయింది. ఇక లేడీ కమెడియన్ వర్ష గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఈమె హీరోయిన్ కి మించిన అందం, చలాకీతనంతో ఆకట్టుకుంటుంది. హీరోయిన్ స్థాయి అందం ఉన్నా.. ఆ రేంజు స్థాయికి మాత్రం చేరలేదు. ఇక బుల్లితెరపై స్కిట్లు చేసుకుంటూ పాపులర్ అయిపోయింది. జబర్దస్త్ ద్వారా బాగా పాపులారిటీ సంపాదించుకున్న వర్షా ఇమ్మానుయేల్ తో కలిసి చేసిన స్కిట్స్ ఎంత బాగా హైలెట్ అయ్యాయి.
అసలు ఒకానొక టైం లో వీరిద్దరి మధ్య ఏదో ఉందంటూ వార్తలు వచ్చాయి. ఇక వీరు పెళ్లి చేసుకుంటారు అంటూ ఓపెన్ గా చెప్పేశారు. సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారింది. వీళ్ళు వేసే స్కిట్స్ కూడా అలాగే అనిపించాయి. అందుకే వీళ్ళు పెళ్లి చేసుకోవాలనుకుంటున్న వార్త నిజమే అంటూ ప్రేక్షకులు కూడా నమ్మేశారు. అయితే అదంతా అబద్ధమని కేవలం స్కిట్స్ కోసమే వాళ్ళు అలా చేస్తున్నారు అని.. పలుసార్లు జబర్దస్త్ కమెడియన్స్ బయటపెట్టారు.
ఇటీవల ఇమ్మానియేల్ ను వర్ష అన్నా అని పిలవడం ప్రేక్షకులకు షాకింగ్ గా అనిపించింది. స్కిట్లో భాగంగా వర్ష వేరే కమెడియన్ ను పెళ్లి చేసుకోగా... అందులో ఇమ్మానుయేల్ ని అన్నా అంటూ పిలిచింది . దీంతో ఇమ్మానుయేల్ కి బాగా కోపం వచ్చి.. చూడు వర్ష ఏదైనా పిలువు అన్నా అని మాత్రం పిలవద్దంటూ.. అందరి ముందు వార్నింగ్ ఇస్తాడు. దీనికి సంబంధించిన ప్రోమో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
ఇక ఈ విషయంపై మొన్నటి వరకు లవర్స్, పెళ్లి అంటూ షో చేసిన వీరు.. ఇప్పుడు అన్నా చెల్లెలు ఏంటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. టీఆర్పీ కోసం ఏమైనా చేస్తారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ ఎపిసోడ్... జనవరి 12వ తేదీ ప్రసారం కాబోతుంది .


Click it and Unblock the Notifications











