నీ సూది అంటూ.. వర్ష నోట అలాంటి మాటలు, రగిలిపోయిన ఇమ్మాన్యుయేల్
దశాబ్ధానికి పైగా తెలుగు వారిని నవ్వుల్లో ముంచెత్తుతోంది జబర్దస్త్. ఈటీవీలో ప్రసారమవుతున్న ఈ కమెడీ షో ప్రతి వారం కొత్తగా సిద్ధమవుతూ ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తోంది. ఇన్నేళ్లు అవుతున్నా ఎక్కడా బోర్ కొట్టించకుండా దూసుకెళ్తోంది జబర్దస్త్. ప్రతి వారం మాదిరిగా ఈ వారం ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. అది ఎలా ఉందో ఒకసారి పరిశీలిస్తే ..
జబర్దస్త్‌కు ఎంతో మంది కమెడియన్లు వచ్చారు, వెళ్లారు, ఇంకా వస్తునే ఉన్నారు? కానీ ఈ షో మాత్రం నేటికీ తెలుగు బుల్లితెరపై నెంబర్ వన్ షోగా దూసుకెళ్తూనే ఉంది. యాంకర్లు, కంటెస్టెంట్స్, జడ్జిలు మారినా జబర్దస్త్ మాత్రం అలాగే వినోదాన్ని పంచుతూనే ఉంది. ఈ వారం ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను చూస్తే . తొలుత ఇమ్మాన్యుయేల్ , పండు, దుర్గారావులు ఎంట్రీ ఇస్తారు. మేం ముగ్గురం ప్రాణ స్నేహితులమని చెప్పుకుంటూ ఉండగా.. ఏంటీ నీ లవర్‌తో బ్రేకప్ అయ్యిందట అని పండుని ఇమ్మాన్యుయేల్ అడుగుతాడు. నా కంటే దానికి మొగుడే ఎక్కువ అంటోందని అందుకే దాని మీద కోపం వచ్చిందని చెబుతాడు పండు.

ఇంతలో మాకు ఓ అమ్మాయి నచ్చిందని ముగ్గురు చెప్పగా.. ముగ్గురు ఒక్కరినే ఇష్టపడి ఉంటారని రష్మి పంచ్ వేస్తుంది. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు అని అడగ్గా.. ముగ్గురు రష్మి వైపు వెళ్లు చూపిస్తారు. నా దగ్గర ముగ్గురికి ఇచ్చి పుచ్చుకోవడాలు లేవని అంటుంది. ఇంతలో ముగ్గురు కలిసి పెళ్లి చూపులకు వెళ్లి ముగ్గురు అమ్మాయిలను చూస్తారు. ఇంతలో వర్షను దుర్గారావు పెళ్లి చేసుకుంటాడు. బెడ్‌పై దుర్గా.. సూది అని వర్ష దీర్ఘం తీయగా గుచ్చుకుందా అంటాడు దుర్గారావు. ఆ వెంటనే ఇమ్మాన్యుయేల్ , పండు వచ్చి దుర్గారావును చితకబాదుతారు.
మరో స్కిట్‌లో ఫైమా - భాస్కర్‌లు ఎంట్రీ ఇచ్చి .. మీరు తాగి ఇంటికొస్తే మీ పక్కన పడుకోవడం ఎంత ఇబ్బందిగా ఉందో తెలుసా అని ప్రశ్నిస్తుంది ఫైమా. తాగకుండా ఇంటికొచ్చి నీ పక్కన పడుకోవడం ఎంత ఇబ్బందిగా ఉందో తెలుసా అంటూ భాస్కర్ పంచ్ విసురుతాడు. బిర్యానీ అదిరిపోయిందని తింటుండగా అది మిరపకాయ్ అంటూ లాగి కొడుతుంది ఫైమా. మీ అమ్మాయిని పెళ్లి చేసుకుని అమ్మాయికి కొత్త జీవితాన్ని ఇస్తానని అంటాడు భాస్కర్. దీంతో లేడీ గెటప్‌లో ఉన్న నరేష్ ఆత్మహత్య చేసుకోవడానికి చూస్తాడు.

తర్వాత పేకాట పాపారావులా చలాకీ చంటీ ఎంట్రీ ఇచ్చి రాఘవతో పేకాట ఆడతాడు. ఓడిపోయినట్లుగా బిల్డప్ ఇచ్చిన చంటీ షో కొట్టడంతో అంతా షాక్ అవుతారు. తాగుబోతు రమేశ్ చేతిలో ఉన్న మందుబాటిల్‌లోని అతని భార్య లాక్కొని కూరగాయలు తీసుకురమ్మని చెబుతుంది. బజారుకు వెళ్తున్న తాగుబోతు రమేష్‌ని గుమ్మడికాయ తీసుకురమ్మని అంటుంది రష్మి. అప్పుడు నిన్నే తీసుకెళ్తే బెటర్ అంటూ పంచ్ వేస్తాడు రమేష్.
తర్వాత ఆటో రాంప్రసాద్ - దొరబాబులు ఎంట్రీ ఇస్తారు. దొరబాబు షర్ట్ మీద ఆడవారి వెంట్రుక చూసి ఎక్కడిదని వాళ్లావిడ అడుతుంది. నిన్న నువ్వు లేనప్పుడు పక్కింటి ఆంటీ వచ్చి నువ్వేమీ పీకలేవని వెంట్రుక నా మీదకి విసిరేసిందని , దాంతో గంట సేపు ఆవిడతో గొడవ జరిగిందని అంటాడు దొరబాబు. మరి ఆంటీకి దొరబాబుకు మధ్య ఏం జరిగింది? ముగ్గురు ప్రాణ స్నేహితులు విడిపోయారా? లేదా? భాస్కర్ విడోకి కొత్త జీవితం ఇచ్చాడో లేదో తెలియాంటే ఫిబ్రవరి 28, మార్చి 1 తేదీల వరకు ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











