ఆ బట్టల్లో కనిపిస్తా.. అక్కడి వరకు చూపిస్తా.. డైరెక్టర్ కే జబర్దస్త్ వర్ష ఆఫర్
యంగ్ అండ్ టాలెంటెడ్ బ్యూటీ జబర్దస్త్ వర్ష ప్రస్తుతం టాక్ షోతో సంచలనంగా మారుతోంది. కిసిక్ టాక్ షోతో అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంటోంది. ముఖ్యంగా సెలబ్రెటీల వ్యక్తిగత విషయాలను నిర్మోహమాటంగా అడుగుతూ ఆసక్తికరమైన విషయాలను వెలుగులోకి తీసుకొస్తోంది. సెలబ్రెటీలపై ఉన్న అపోహాలు, రూమర్లు, పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టేలా ప్రశ్నలు సంధిస్తోంది. తనదైన శైలిలో ఇంటర్వ్యూలు చేస్తూ టెలివిజన్ రంగంలో హాట్ టాపిక్ గ్గా మారింది. ప్రస్తుతం తన షోకు ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది.
మొన్నటి వరకు టెలివిజన్ నటీనటులు, సెలబ్రెటీలతో వరుసగా ఇంటర్వ్యూలు చేస్తూ సందడి చేసింది. ఇక తాజాగా ఈ బ్యూటీ టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలను తన కిసిక్ టాక్ షోకు ఆహ్వానించింది. ఈ సందర్భంగా ఆయనకు గ్రాండ్ గా వెల్కమ్ పలికింది. శ్రీకాంత్ అడ్డాలతో సాగిన ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు. ఈ సందర్భంగా జబర్దస్త్ వర్ష దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలతో మాట్లాడిన మాటలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.

శ్రీకాంత్ అడ్డాల పరిచయం తర్వాత జబర్దస్త్ వర్ష తనకు సినిమా ఆఫర్ ఇవ్వండిని రిక్వెస్ట్ చేసింది. శ్రీకాంత్ అడ్డాల నుంచి రాబోయే సినిమాల్లో తనను తీసుకోవాలని కోరింది. ఈ క్రమంలో ఆసక్తికరంగా మాట్లాడింది... 'నేనైతే మీ కోసం మెకాళ్ల వరకైనా, థైస్ మీదకైనా, నడుము వరకైనా బట్టలు వేసుకుంటాను' అని డైరెక్టర్ కే ఆఫర్ ఇచ్చింది. జబర్దస్త్ వర్ష కిసిక్ మాటలకు శ్రీకాంత్ అడ్డాల షాక్ అయ్యారు. ఇదేంటీ ఇలా అడిగేశావని అలాగే చూస్తూ ఉండిపోయాడు. ఇక వర్ష టాపిక్ ఛేంజ్ చేసి ఆ దర్శకుడిని వచ్చే సినిమాలపై మాట్లాడింది.
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో మహేశ్ బాబు చిన్నోడిగా, విక్టరీ వెంకటేశ్ పెద్దోడిగా ప్రేక్షకులను అలరించారు. కానీ వారి అస్సలు పేర్లు ఏంటనీ ప్రశ్నించింది. అందుకు డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల స్పందిస్తూ తనకు కూడా తెలియదని చెప్పారు. ఇక త్వరలోనే తన నుంచి సినిమా రాబోతోందని, జూన్ వరకు ఆ మూవీ అనౌన్స్ మెంట్ ఉంటుందని గతంలో చెప్పుకొచ్చారు. ఇక జబర్దస్త్ వర్ష కిసిక్ టాక్ షోలో ఇంకెలాంటి విషయాలను చెప్పారనేది ఇప్పుడు ఆసక్తిని పెంచుతోంది. ఈ టాక్ షో ఫుల్ ఎపిసోడ్ ఈరోజు రాత్రి 7 గంటలకు బిగ్ టీవీ ప్లస్ ఛానెల్ లో ప్రసారం కానుంది.
ఇక జబర్దస్త్ వర్ష ఓవైపు పాపులర్ తెలుగు కామెడీ షో జబర్దస్త్ కామెడీ షోలో అలరిస్తున్న సంగతి తెలిసిందే. కమెడియన్ ఇమ్మాన్యుయేల్ టీమ్ లో లేడీ ఆర్టిస్ట్ గా నటిస్తోంది. సరికొత్త స్కిట్లతో బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తోంది. కాగా దాదాపు ఐదారేళ్లుగా వర్ష బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తూనే వస్తోంది. ఈ క్రమంలోనే సినిమాల్లోనూ అవకాశాల కోసం ఎదురు చూస్తోందని ఈ టాక్ షోతో అర్థమవుతుంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ బాగానే యాక్టివ్ గా కనిపిస్తూ మరింతగా ఫాలోయింగ్ తెచ్చుకుంటోంది.


Click it and Unblock the Notifications











