లేలేత అందాలతో కవ్విస్తోన్న జబర్ధస్త్ వర్ష: ఏకంగా అలాంటి ఫొటోతో రచ్చ.. గ్లామర్ ట్రీట్ అదిరిందిగా!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎంతో మంది అమ్మాయిలు.. తమ అందచందాలను ప్రదర్శిస్తూ సినిమాల్లోనో.. సీరియళ్లలోనో.. టీవీ షోలలోనో అవకాశాలను అందుకుంటున్నారు. తద్వారా తెలుగు రాష్ట్రాల్లో బిగ్ సెలెబ్రిటీలుగా సైతం మారిపోతున్నారు. అలాంటి వారిలో జబర్ధస్త్ ఫేం వర్ష గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సాదాసీదాగా షోలోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె.. ఇప్పుడు పర్మినెంట్ ఆర్టిస్టుగా మారిపోయింది. అదే సమయంలో వరుస ఆఫర్లు అందుకుంటోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా లేలేత అందాలతో కవ్విస్తూ ఓ ఫొటోను వదిలింది. ఇంకెందుకు ఆలస్యం దానిపై మీరూ ఓ లుక్కేయండి!

అలా మొదలైన వర్ష ప్రయాణం

అలా మొదలైన వర్ష ప్రయాణం

మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించింది వర్ష. ఆ రంగంలో చేస్తోన్న సమయంలోనే బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చే అవకాశాన్ని దక్కించుకుంది. ఇందులో భాగంగానే 'అభిషేకం', 'తూర్పు పడమర', 'ప్రేమ ఎంత మధురం' వంటి సీరియళ్లలో నటించింది. అందానికి అందంతో పాటు యాక్టింగ్‌లోనూ రాణించడంతో నటిగా మంచి గుర్తింపును అందుకుంది. ఈ క్రమంలోనే సినిమా అవకాశాల కోసం చూస్తోంది.

జబర్ధస్త్‌లోకి ఎంట్రీ ఇచ్చేసిందిగా

జబర్ధస్త్‌లోకి ఎంట్రీ ఇచ్చేసిందిగా

సీరియల్ నటిగా ఫుల్ బిజీగా ఉన్న సమయంలోనే టాప్ కమెడియన్ హైపర్ ఆది చొరవతో జబర్ధస్త్‌లోకి ఎంట్రీ ఇచ్చింది వర్ష. కేవలం గెస్టుగా వచ్చిన ఆమె.. అద్భుతమైన టైమింగ్‌తో పర్మినెంట్ ఆర్టిస్టుగా మారిపోయింది. ఈ క్రమంలోనే ఆది స్కిట్లతో పాటు రాకింగ్ రాకేష్, కెవ్వు కార్తీక్ టీమ్‌లలో పని చేస్తోంది. అదే సమయంలో 'శ్రీదేవి డ్రామా కంపెనీ' అనే షోలోనూ చేస్తోందీ బ్యూటీ.

కమెడియన్‌తో వర్ష ప్రేమాయణం

కమెడియన్‌తో వర్ష ప్రేమాయణం

జబర్ధస్త్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత వర్ష కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది. అలాగే, ఆ షోలోకి యంగ్ కమెడియన్ ఇమాన్యూయేల్‌తో ప్రేమాయణం సాగిస్తుందన్న వార్తలతో మరింత పాపులర్ అయింది. అందుకు అనుగుణంగానే తరచూ వీళ్లిద్దరూ రొమాంటిక్ యాక్ట్‌లు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ముద్దులు, హగ్గులతో రెచ్చిపోతున్నారు. తద్వారా ఎనలేని క్రేజ్‌ను అందుకుంది.

అందులో ఎప్పుడూ ఫుల్ బిజీగా

అందులో ఎప్పుడూ ఫుల్ బిజీగా

ఆకట్టుకునే అందం.. అద్భుతమైన టాలెంట్‌తో వరుస ఆఫర్లను దక్కించుకుంటూ దూసుకెళ్తోంది వర్ష. చేతి నిండా అవకాశాలు ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో సైతం ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తరచూ తనకు సంబంధించిన విషయాలతో పాటు కెరీర్‌ విశేషాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది. దీంతో తరచూ ఈ తెలుగు బ్యూటీ వార్తల్లో నిలుస్తూ హాట్ టాపిక్ అవుతోంది.

 హాట్ షోతో రచ్చ చేస్తున్న బ్యూటీ

హాట్ షోతో రచ్చ చేస్తున్న బ్యూటీ

తెలుగు ఇండస్ట్రీలో లోకల్ అమ్మాయిలకు పెద్దగా అవకాశాలు దక్కేవి కాదు. దీనికి కారణం మన వాళ్లు స్కిన్ షో చేయలేరన్న నానుడి ఉండేది. అయితే, అదంతా గతం.. ఇప్పుడు ఇక్కడి అమ్మాయిలే అందాలతో రచ్చ చేస్తున్నారు. అందులో వర్ష కూడా ఉంది. ఈ అమ్మడు తరచూ హాట్ హాట్ ఫొటోలు, వీడియోలు వదులుతూ సోషల్ మీడియాలో సెన్సేషల్ అయిపోతోంది.

 కరోనాను జయించిన జబర్ధస్త్ వర్ష

కరోనాను జయించిన జబర్ధస్త్ వర్ష

వరుస షోలతో ఫుల్ బిజీగా గడుపుతోన్న వర్షకు ఇటీవల కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ఆస్పత్రిలో ఉన్న పరిస్థితులను చూపిస్తూ ఓ వీడియోను కూడా విడుదల చేసింది. చాలా దారుణంగా ఉందంటూ భయ పెట్టేసింది. ఇలా కొంత కాలంగా కరోనాకు చికిత్స తీసుకుంటోన్న వర్ష.. తాజాగా దాని నుంచి బయట పడింది. సోషల్ మీడియా ద్వారా తనకు నెగెటివ్ వచ్చినట్లు వెల్లడించింది.

Recommended Video

Sudigali Sudheer పై Nagababu కోపం గా ఉన్నారా? నెటిజన్ కి షాకింగ్ రిప్లై
లేలేత అందాలతో కవ్విస్తోన్న వర్ష

లేలేత అందాలతో కవ్విస్తోన్న వర్ష

సోషల్ మీడియాలో తన అందమైన ఫొటోలతో హల్‌చల్ చేసే జబర్ధస్త్ వర్ష.. తాజాగా మరో గ్లామరస్ పిక్‌ను షేర్ చేసింది. ఇందులో ఆమె స్లీవ్‌లెస్ టాప్ వేసుకుని కనిపించింది. అంతేకాదు, తన నడుము అందాలను కూడా చూపిస్తోంది. అలాగే, కొంటె చూపుతో కవ్విస్తోందీ బ్యూటీ. ఇక, వర్ష లేలేత అందాలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. దీంతో ఈ పిక్ ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X