కరోనా తర్వాత అలా కనిపించిన జబర్ధస్త్ వర్ష: అసలు మేటర్ రివీల్ చేసింది.. ఇక అతడితో కలిసి రచ్చే

తెలుగులో ప్రసారం అయ్యే షోలలో జబర్ధస్త్ మాత్రమే చాలా కాలంగా నెంబర్ వన్ స్థానంలో వెలుగొందుతోంది. ఈ క్రమంలోనే మిగిలిన షోల నుంచి పోటీని తట్టుకుని మరీ నెగ్గుకొస్తోంది. అదే సమయంలో ఎంతో మందిని ఇండస్ట్రీకి పరిచయం చేస్తోంది. ఇలా వచ్చిన వారిలో 99 శాతం మంది మేల్ ఆర్టిస్టులే ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో షోలోకి ఎంట్రీ ఇచ్చి సత్తా చాటుతోంది వర్ష. జబర్ధస్త్‌లో పర్మినెంట్ ఆర్టిస్టు అయిపోయిన ఆమె.. ఇటీవల కరోనా వైరస్ బారిన పడింది. ఈ నేపథ్యంలో తొలిసారి తన ఆరోగ్యంపై స్పందించిందామె. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

ఊర్వశి రటేలా గ్లామరస్ ఫోటోషూట్.. లేలేత అందాలతో...

మోడల్‌గా మొదలు... సీరియల్ నటిగా

మోడల్‌గా మొదలు... సీరియల్ నటిగా


యాక్టింగ్ మీద ఉన్న ఆసక్తితో ముందుగా మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించింది తెలుగు అమ్మాయి వర్ష. అలా కొంత కాలం పాటు నెట్టుకుంటూ వచ్చిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చే అవకాశాన్ని అందుకుంది. ఈ క్రమంలోనే పలు చానెళ్లో ప్రసారం అవుతోన్న 'అభిషేకం', 'తూర్పు పడమర', 'ప్రేమ ఎంత మధురం' వంటి సీరియళ్లలో నటించి మెప్పించిందీ తెలుగు బ్యూటీ.

అలా జబర్ధస్త్‌లోకి ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ

అలా జబర్ధస్త్‌లోకి ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ

కెరీర్ పరంగా ఫుల్ బిజీగా గడుపుతోన్న సమయంలోనే వర్షకు జబర్ధస్త్ షోలో పాల్గొనే అవకాశం కల్పించాడు టాప్ టీమ్ లీడర్ హైపర్ ఆది. ఆరంభంలోనే మెప్పించిన ఈ బ్యూటీ.. అప్పటి నుంచి ఆ షోలో భాగం అయిపోయింది. ఈ క్రమంలోనే ఎన్నో స్కిట్లలో అద్భుతంగా చేసింది. అలా హైపర్ ఆదితో పాటు రాకింగ్ రాకేష్, కెవ్వు కార్తీక్ టీమ్‌లలో సైతం చేస్తూ అలరిస్తోందీ ముద్దుగుమ్మ.

కమెడియన్‌తో లవ్ ట్రాక్.. ఫుల్ ఫేమస్

కమెడియన్‌తో లవ్ ట్రాక్.. ఫుల్ ఫేమస్


జబర్ధస్త్‌లో లేడీ కంటెస్టెంట్‌గా వెలుగొందుతోన్న వర్ష.. ఆ షోలోని టాలెంటెడ్ కమెడియన్ ఇమాన్యూయేల్‌తో ప్రేమాయణం సాగిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనికి కారణం.. కొంత కాలంగా వీళ్లిద్దరూ కలిసి రొమాంటిక్ యాక్టులు చేస్తుండడమే. అంతేకాదు, తరచూ ముద్దులు, హగ్గులతో రచ్చ రచ్చ చేస్తున్నారు. ఈ కారణంగానే ఈ జంట విపరీతమైన స్థాయిలో పాపులర్ అయిపోతోంది.

రెండు షోలలో భాగం... హవా చూపిస్తూ

రెండు షోలలో భాగం... హవా చూపిస్తూ

తెలుగు అమ్మాయి వర్ష జబర్ధస్త్‌ షోలో కెవ్వు కార్తీక్ టీమ్‌లో పని చేస్తోంది. అందులో ఇమాన్యూయేల్‌కు జోడీగా ఎన్నో స్కిట్లలో అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది. అదే సమయంలో 'శ్రీదేవి డ్రామా కంపెనీ' అనే షోలోనూ చేస్తోంది. ఇందులోనూ తన అందంతో పాటు ఆటపాటలతో ఆకట్టుకుంటోంది. తద్వారా ఈ అమ్మడు రెండు షోలలోనూ హవాను చూపిస్తూ దూసుకుపోతోంది.

ఆమెకు కోవిడ్ పాజిటివ్.. సెల్ఫీ వీడియో

ఆమెకు కోవిడ్ పాజిటివ్.. సెల్ఫీ వీడియో

గెస్టుగా జబర్ధస్త్‌లోకి ఎంట్రీ ఇచ్చి.. చాలా తక్కువ సమయంలోనే అద్భుతమైన టాలెంట్‌తో షోలో స్థిరపడిపోయింది వర్ష. తాజాగా ఆమెకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించింది. ఈ మేరకు ఓ సెల్ఫీ వీడియోను కూడా వదిలింది. అందులో పరిస్థితి దారుణంగా ఉందని.. డెడ్ బాడీలను పడేస్తున్నారని చెబుతూ ఎమోషనల్ అయింది.

Recommended Video

Sudigali Sudheer పై Nagababu కోపం గా ఉన్నారా? నెటిజన్ కి షాకింగ్ రిప్లై
కరోనా తర్వాత అలా కనిపించిన భామ

కరోనా తర్వాత అలా కనిపించిన భామ


కొంత కాలంగా కరోనాకు చికిత్స తీసుకుంటోన్న జబర్ధస్త్ వర్ష.. తాజాగా దాని నుంచి బయట పడింది. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో తనకు నెగెటివ్ వచ్చినట్లు వెల్లడించింది. ఇందులో భాగంగానే కరోనా రిపోర్టును కూడా షేర్ చేసింది. ఇక, తను త్వరగా కోలుకోవాలని కోరుకున్న ప్రతి ఒక్కరికీ ఆమె ధన్యవాదాలు తెలియజేసింది. తొందరలోనే ఆమె షూటింగ్‌లో పాల్గొనబోతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X