జబర్ధస్త్‌‌లో కరోనా కలకలం: ఆమెకు పాజిటివ్.. ఆస్పత్రిలో చేరిక.. పరిస్థితి దారుణం అంటూ సెల్ఫీ వీడియో

దేశ వ్యాప్తంగా కరోనా సెకెండ్ వేవ్ విజృంభిస్తోంది. గతంలో కంటే భిన్నంగా ఈ సారి అన్ని ప్రాంతాల్లో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. అంతేకాదు, కొత్త కొత్త లక్షణాలు కూడా బయట పడుతున్నాయి. దీంతో చాలా రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ కూడా విధించారు. కొన్ని చోట్ల మళ్లీ లాక్‌డౌన్ పెట్టాలన్న ఆలోచనలో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సినీ ఇండస్ట్రీలో కరోనా విళయ తాండవం చేస్తోంది. ఇప్పటికే ఎంతో మంది ఈ మహమ్మారి బారిన పడ్డారు. ఇప్పుడు బుల్లితెరపైకీ వచ్చేసింది. తాజాగా జబర్ధస్త్ షోనూ టచ్ చేసిందీ భయంకరమైన వైరస్. అసలేం జరిగిందంటే!

కన్నుగీటిన ప్రియా ప్రకాశ్ వారియర్ వైరల్ ఫోటోలు..

 టాలీవుడ్ ప్రముఖులకు కరోనా పాజిటివ్

టాలీవుడ్ ప్రముఖులకు కరోనా పాజిటివ్

కొద్ది రోజులుగా తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ఎంతో మంది ప్రముఖులు కరోనా వైరస్ బారిన పడుతున్నారు. చిన్న చిన్న ఆర్టిస్టుల నుంచి బడా స్టార్ల వరకూ అందరూ ఈ మహమ్మారికి చిక్కుతున్నారు. ఈ మధ్యే నివేదా థామస్, పవన్, సోనూ సూద్ తదితరులు కోవిడ్ బాధితులయ్యారు. అదే సమయంలో చాలా మంది టెక్నీషియన్లు, ఆర్టిస్టులు కూడా పాజిటివ్‌గా తేలారు.

 షూటింగ్‌లు క్యాన్సిల్.. సినిమాలు కూడా

షూటింగ్‌లు క్యాన్సిల్.. సినిమాలు కూడా

కరోనా వైరస్ ప్రభావంతో టాలీవుడ్‌లో చాలా సినిమాలకు సంబంధించిన షూటింగులు నిలిచిపోయాయి. అందులో పాన్ ఇండియా మూవీలతో పాటు చిన్న చిత్రాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు షూటింగులు నిలిచిపోవడంతో వాటి విడుదల కూడా వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో తెలుగు సినీ పరిశ్రమకు మరోసారి అపారమైన నష్టాలు వాటిల్లే ప్రమాదం కనిపిస్తోంది.

 జబర్ధస్త్ షోలో కరోనా కలకలం.. వచ్చింది

జబర్ధస్త్ షోలో కరోనా కలకలం.. వచ్చింది

ఈ మధ్య కాలంలో తెలుగు సినీ ఇండస్ట్రీలో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో ప్రభావం చూపిస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ ప్రమాదకర వైరస్ బుల్లితెరను కూడా తాకింది. మరీ ముఖ్యంగా టెలివిజన్ చరిత్రలోనే ఎన్నో రికార్డులను క్రియేట్ చేస్తూ.. నెంబర్ వన్ కామెడీ షోగా వెలుగొందుతోన్న జబర్ధస్త్‌లో మొదటిసారి ఓ కరోనా పాజిటివ్ కేసు బయటపడటంతో కలకలం రేగుతోంది.

 ఆమెకు కోవిడ్ పాజిటివ్.. ఆస్పత్రిలో చేరిక

ఆమెకు కోవిడ్ పాజిటివ్.. ఆస్పత్రిలో చేరిక

గెస్టుగా జబర్ధస్త్‌లోకి ఎంట్రీ ఇచ్చి.. చాలా తక్కువ సమయంలోనే అద్భుతమైన టాలెంట్‌తో షోలో స్థిరపడిపోయింది వర్ష. తాజాగా ఆమెకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించింది. ఈ మేరకు ఓ వీడియోను కూడా వదిలింది. ఇక, ప్రస్తుతం ఆమె హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటోందని విశ్వసనీయంగా తెలిసింది.

పరిస్థితి దారుణం అంటూ సెల్ఫీ వీడియో

పరిస్థితి దారుణం అంటూ సెల్ఫీ వీడియో

జబర్ధస్త్ వర్ష తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ సెల్ఫీ వీడియో వదిలింది. అందులో 'నాకు రెండు రోజులుగా హెల్త్ బాగోడం లేదు. అందుకే కరోనా టెస్ట్ చేయించుకున్నాను. ఇందులో పాజిటివ్ వచ్చింది. ఆస్పత్రుల్లో పరిస్థితులు అస్సలు బాలేదు. డెడ్ బాడీలను చుట్టేసి పడేస్తున్నారు. అందుకే అందరూ జాగ్రత్తగా ఉండండి. మాస్కులు పెట్టుకుని, శానిటైజర్ వాడండి' అంటూ చెప్పుకొచ్చింది.

 రెండు షోలలో భాగం.. వాళ్లకూ ప్రమాదం

రెండు షోలలో భాగం.. వాళ్లకూ ప్రమాదం

వర్ష జబర్ధస్త్‌ షోలో కెవ్వు కార్తీక్ టీమ్‌లో పని చేస్తోంది. అందులో ఇమాన్యూయేల్‌కు జోడీగా ఎన్నో స్కిట్లలో అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది. అదే సమయంలో 'శ్రీదేవి డ్రామా కంపెనీ'లోనూ చేస్తోంది. ఇందులోనూ తన అందంతో పాటు ఆటపాటలతో ఆకట్టుకుంటోంది. దీంతో ఈ రెండు షోలలో ఆమెతో పాటు పని చేసి వారంతా టెస్టులు చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Recommended Video

PSPK 27 : Nidhhi Agerwal To Star Opposite Pawan Kalyan In Periodic Drama
 షూటింగులు ఆగిపోయే అవకాశం ఉందట

షూటింగులు ఆగిపోయే అవకాశం ఉందట

జబర్ధస్త్ వర్షకు కరోనా పాజిటివ్ రావడంతో మిగిలిన వాళ్లంతా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే కొద్ది రోజుల పాటు టీవీ రంగానికి సంబంధించిన షోలకు సంబంధించిన షూటింగులు కూడా నిలిపివేయాలన్న ఆలోచనను నిర్వహకులు చేస్తున్నట్లు సమాచారం. అదే జరిగితే రాబోయే రోజుల్లో ఆయా షోల ప్రసారాలు ఆగిపోయే అవకాశం ఉంటుందని అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X