Jabardasth : పండంటి బిడ్డకు తండ్రైన జబర్దస్త్ స్టార్ కమెడియన్.. ఎమోషనల్ అవుతూ వీడియో!

జబర్దస్త్ షో ద్వారా చాలా మంది ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఈ షో ద్వారా సక్సెస్ అయిన వారిలో కొంత మంది సినిమాల్లోకి వెళ్లగా మరికొందరు మాత్రం ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే ఇదే షోలో కొనసాగుతూ ఇతర ఈవెంట్లకు అడపాదడపా వెళుతూ కాలం వెళ్లదీస్తున్నారు. ఈ జబర్దస్త్ షో ద్వారా మంచి క్రేజ్ సంపాదించిన వారిలో వినోద్ కూడా ఒకరు. వినోద్ అంటే వెంటనే గుర్తుకు రాకపోవచ్చు కానీ వినోదిని అంటే మాత్రం ఇట్టే గుర్తు పడతారు. తాజాగా ఆయన తండ్రి అయ్యాడు. ఈ విషయం గురించి ఆయన ఒక వీడియో కూడా విడుదల చేశారు. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే

లేడీ గెటప్ వేసుకుని

లేడీ గెటప్ వేసుకుని

జబర్దస్త్ ప్రారంభమైన కొత్తలో ఎందుకో కానీ షోలో ఆడ వాళ్ళను పెట్టకూడదు అని ఒక రూల్ పెట్టుకున్నారు. అందుకోసమే స్త్రీ పాత్రలు కూడా పురుషులే చేయాల్సి వచ్చేది. దీంతో చాలా మంది లేడీ గెటప్ వేసుకుని ఫేమస్ అయ్యారు. చమ్మక్ చంద్ర, వినోద్, సాయి తేజ, శాంతి స్వరూప్ ఇలా అనేకమంది లేడీ గెటప్స్ వేసుకుని తద్వారా ఫేమస్ అయ్యారు. వీరందరిలో కూడా ఎక్కువగా వినోద్ ఫేమస్ అయ్యాడు.

అత్త కూతురునే

అత్త కూతురునే


ఎందుకంటే చూడటానికి అచ్చం అమ్మాయిలా కనిపించడంతో చాలా మంది వినోద్ అమ్మాయి అని అనుకునేవారు. అయితే ఆ మధ్య పెళ్లి చేసుకోను అంటూ వినోద్ ఆత్మహత్యాయత్నం చేసిన వ్యవహారం కూడా రచ్చ రేపింది. ఆ తర్వాత తనకు బంధువులైన అత్త కూతురు విజయ లక్ష్మి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. అయితే వినోద్ భార్య గర్భవతి అని ఈ మధ్యనే క్యాష్ ప్రోగ్రామ్ ద్వారా తెలిసింది.

సుమ సీమంతం

సుమ సీమంతం

సుమ యాంకరింగ్ చేసే క్యాష్ ప్రోగ్రాంకి అడపదడపా జబర్దస్త్ సహా ఇతర సేవలకు సంబంధించిన కంటెస్టెంట్ లను పిలిచి సందడి చేస్తూ ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఈ షోకి వచ్చిన సమయంలో సుమ, విజయలక్ష్మి గర్భవతి అనే విషయాన్ని గుర్తించి ఆమెకు అప్పటికప్పుడు సీమంతం ఏర్పాట్లు చేయించింది. విజయలక్ష్మి తల్లి లేదని ఉంటే సీమంతం చేసేదని తాను సీమంతం చేశాను కాబట్టి తనను వారు తల్లిగా భావించవచ్చని చెప్పింది.

సోషల్ మీడియాలో వైరల్

సోషల్ మీడియాలో వైరల్

అదే సమయంలో వినోద్ కూడా తన తండ్రి చనిపోయాడు అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇక ఆ తర్వాత కూడా జబర్దస్త్ లోని ఇతర కంటెస్టెంట్ లు కూడా కొంతమంది విజయలక్ష్మి సీమంతాన్నీ ఘనంగా జరిపారు. తర్వాత ఆ ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఇప్పుడు తాజా సమాచారం మేరకు విజయలక్ష్మి ఒక పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.

 వినోద్ ఇంట మహాలక్ష్మి

వినోద్ ఇంట మహాలక్ష్మి

ఈ విషయాన్ని తన యూట్యూబ్ ఛానల్ ద్వారా వినోద్ వెల్లడించాడు. అంతేకాక తన కుమార్తె ఫోటోలను కూడా వినోద్ సందర్భంగా సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో వినోద్ కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. వినోద్ ఇంట మహాలక్ష్మి పుట్టిందని అం టూ ఆయన అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి మరి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X